Hin

25th march 2025 soul sustenance telugu

March 25, 2025

ఆధ్యాత్మిక అవగాహనతో తోబుట్టువుల మధ్య వైరాన్ని అధిగమించడం

తోబుట్టువులు అనగా మీ సోదర సోదరీల మధ్య విభేదాలు ఉండటం సాధారణం, కానీ యుక్త వయసులో కూడా తోబుట్టువుల పట్ల అభద్రత లేదా అసూయ అనే అంశాన్ని మనం కలిగి ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. తోబుట్టువుల పోటీ అనేది చిన్ననాటి విషయం అని మనం నమ్ముతాము – ఎవరు ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తారు, ఎవరు ఎక్కువ తెలివైనవారు, ఎవరు మరింత అందంగా కనిపిస్తారు, ఎవరు ఎక్కువ చురుకైనవారు…. మరియు మొదలైనవి. భావోద్వేగ గాయాలు తరచుగా యుక్తవయసులో కూడా కొనసాగుతాయి.

 

  1. మీకు విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్న తోబుట్టువులు ఉంటే, వారి విజయాన్ని లేదా జీవితంలో వారు సాధించిన ఏవైనా ప్రతిభలు చూసి మీకు అసూయ లేదా అభద్రత అనిపిస్తుందా? ఇది తోబుట్టువుల వైరానికి సంకేతం కావచ్చు.

 

  1. చిన్నతనంలో పోలిక లేదా పోటీ ద్వారా తోబుట్టువుల వైరం ప్రేరేపించబడి ఉండవచ్చు. కానీ మీరు ఇప్పుడు మీ వైఖరిని మార్చుకోవచ్చు. మీ యొక్క తక్కువ ఆత్మగౌరవం, మీ గురించి మీరు మంచిగా, సానుకూలంగా ఆలోచించలేకపోవడం మరియు మీ స్వంత విజయం లేదా జీవిత ప్రతిభల యొక్క ప్రాముఖ్యతను అనుభూతి చేయలేకపోవడమే మీ బాధ లేదా అసూయకు కారణం. ఆధ్యాత్మిక జ్ఞానం, బలం మరియు ఆత్మిక స్మృతిని అభ్యసించడం ద్వారా మిమ్మల్ని మీరు నయం చేసుకునే శక్తి మీకు వస్తుంది.

 

  1. మన జీవితంలోని ప్రతి పరిస్థితి ఖచ్చితమైనదని గుర్తుంచుకోండి మరియు మన కర్మల ఖాతా ప్రకారం మనలో ప్రతి ఒక్కరికి సమానమైన విజయం, గుర్తింపు లేదా వైఫల్యం లభిస్తుంది. మీ సోదరీమణులు లేదా సోదరులతో పోలిక లేదా పోటీ ఉండకూడదు. ప్రస్తుత అందమైన కర్మ బంధాన్ని ఆలోచించండి మరియు చిన్నతనం నుంచి అనుభవం చేసుకున్న నిస్వార్థ ప్రేమ, గౌరవంతో కూడిన మధురక్షణాలను గుర్తు చేసుకోండి. కొన్నిసార్లు విషయాలు తప్పుగా జరిగినప్పుడు లేదా మీరు వారి నుండి ఆశించినది పొందని క్షణాలపై దృష్టి పెట్టవద్దు. గతాన్ని విడిచిపెట్టి, కొత్త ప్రారంభాన్ని చేయండి.

 

  1. మీకు వారితో దృక్పథాలలో తేడాలు ఉంటాయి, కానీ వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకు తెలుసు. వారి మాటలు లేదా చర్యలు సరైనవి కాకపోవచ్చు, కానీ వారి ఉద్దేశాలు ఎల్లప్పుడూ అలాగే సరైనవె ఉంటాయి. వారితో మీ సంబంధాన్ని అందంగా మార్చుకోవడానికి మీ ఆలోచనలు మరియు మాటలలో ప్రతిరోజూ వారికి ప్రేమ మరియు స్వస్థతను పంపండి.

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »