Hin

27th dec 2023 soul sustenance telugu

December 27, 2023

ఎవరినైనా కలిసే ముందు వారు స్వచ్ఛమైన వారని గుర్తుంచుకోండి

ప్రతిసారీ మనం ఎవరితోనైనా సంభాషించే ముందు, ఆ సమావేశం ఎలా జరగనున్నది అన్న విషయాన్ని మనసులో రూపొందిస్తాము. మనం అపరిచితుడిని కలవబోతున్నట్లయితే ఉత్సుకత, ఆందోళన కలుగుతుంది.  ఒకవేళ, పరిచయస్తులైతే మన గత అనుభవాల ప్రకారంగా వారిని గుర్తిస్తాము. వారిని కలిసినప్పుడు, మన వైబ్రేషన్స్, మాటలు  మరియు ప్రవర్తన వారి గురించి మనం ఎలా ఆలోచిస్తామో దానిపై ఆధారపడి ఉంటాయి.

 

పరిచయస్తులను కలిస్తే వారి గురించి మీ మనసులో గతంలో ఏర్పడిన ముద్రల ఆధారంగా మీరు ఆ వ్యక్తిని గుర్తిస్తున్నారా? అలాగే, రోజులు లేదా సంవత్సరాల నాటి ఆ గత ముద్ర ప్రతికూలంగా ఉంటే, మళ్లీ ఇప్పుడు వారిని కలవడానికి మీరు భయపడుతున్నారా? లేదా మీరు ప్రతిసారీ తాజాగా, విశాలమైన మనస్సుతో అందరినీ కలుస్తారా? మనం ఎవరినైనా కలిసినప్పుడు, అందరూ మనం ఆశించిన విధంగా మాట్లాడకపోవచ్చు లేదా ప్రవర్తించకపోవచ్చు. అది మన చేతుల్లో ఉండదు, కానీ వాటి గురించి మనం మన మనస్సులో ఎలా తీసుకుంటున్నాము అనేది ఎల్లప్పుడూ మన ఎంపిక. వ్యక్తుల గురించి స్వచ్ఛమైన దృష్టికోణం కలిగి ఉండటం తదుపరి సమావేశంలో స్వచ్ఛమైన వైబ్రేషన్స్ ను ప్రసరింపజేస్తుంది, ఆహ్లాదకరంగా మారుస్తుంది. మనం ఎవరినైనా కలిసిన ప్రతిసారీ, మనం వారిని స్వచ్ఛమైన మనస్సుతో, నేను స్వచ్ఛమైన వ్యక్తిని, మరొక స్వచ్ఛమైన వ్యక్తిని కలుస్తున్నాను అన్న ఆలోచనతో కలవాలి. ఈ ఆలోచన గతంలోని ఏదైనా అప్రియమైన అనుభవాన్ని తొలగిస్తుంది. లేకపోతే  నేటి చేదుతనమే మరోసారి కలిసినప్పుడు కూడా కొనసాగుతుంది. గత అనుభవాలు మన వర్తమానంలో భాగం కాకుండా మరియు భవిష్యత్తులో అవి ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలి. స్వచ్ఛమైన మనస్సుతో అందరినీ కలవండి మరియు మీ సమావేశాన్ని ఆశీర్వదించండి. నేను ఎవరినైనా కలిసినప్పుడు, అప్రియమైన అనుభవం కలిగి ఉంటే, వారిని మళ్లీ కలవడానికి ముందు నా మనస్సు లోని గత అనుభవాన్ని  శుభ్రం చేసుకుంటాను అని మీకు మీరే గుర్తు చేసుకోండి .

 

మీ మనస్సును శుభ్రపరుచుకొని అందరి కోసం ఉత్తమమైన ఆలోచనను సృష్టించడం ఎవరినైనా కలవక ముందు మరియు కలిసెటప్పుడు వారి పట్ల నిజమైన గౌరవాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది. మీకు మీరు గుర్తు చేసుకోండి – నేను అందరినీ చక్కటి స్వచ్ఛమైన వారిలా  గుర్తించిన తర్వాతనే కలుస్తాను. ఇలా అనుకోవడంతో, ఒకరికొకరి సాంగత్యం హాయిగా ఉంటుంది. ఇది మనలో మరియు మన చేతల్లో శక్తిని నింపుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »
16th june2024 soul sustenance telugu

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం

Read More »
15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »