Hin

5th march 2025 soul sustenance telugu

March 5, 2025

చింతించే అలవాటును అధిగమించడం (పార్ట్ 1)

ఆందోళనకు మంచి నిర్వచనం ఏమిటి? ఆందోళన అనేది ఒక నిర్దిష్ట పరిస్థితిలో అతి ఘోరమైన పరిణామం లేదా ఫలితం లేదా భవిష్యత్తును ఊహించుకొని మీ మనసులో అది నిజంగా జరిగినట్లుగా చిత్రాన్ని సృష్టించడం. ఇక ఆ నెగిటివ్ చిత్రం యొక్క శక్తిని ఉపయోగిస్తూ మీ మనసులో దానిని ప్రవహించేలా చేయటం. తద్వారా అది మిమ్ముల్ని ఆధ్యాత్మికంగా, భౌతికంగా బలహీన పరిచి భయాన్ని కలిగిస్తుంది. 

ఈ ప్రక్రియ గురించి అడిగినప్పుడు, ఈ ప్రక్రియతో ముడిపడి ఉన్న మరియు రోజంతా వివిధ రకాల పరిస్థితులలో చాలా తరచుగా ఈ ప్రక్రియలో ఉన్న వ్యక్తి, ఒక అలవాటుగా చింతించే వ్యక్తి – కానీ ఆందోళన చెందడం ముఖ్యం, ఇది మంచిదని స్పందిస్తాడు. మనము వివిధ నెగిటివ్ ఫలితాల గురించి ఆలోచించకపోతే, మనం వాటి కోసం ఎలా తయారుగా ఉంటామని అంటాడు. చింతించడం ద్వారా, భవిష్యత్తులో జరిగే చెడు కోసం మనం సిద్ధంగా ఉంటామనే నమ్మకం తప్పు అని గ్రహించడం ముఖ్యం. చింత కేవలం తప్పుడు, ఫలించని సృష్టి అనే సత్యాన్ని ఈ నమ్మకం మనల్ని  గ్రహించనివ్వదు. ఇది మన మనస్సు, బుద్ధి యొక్క పాజిటివ్, నిర్మాణాత్మక మరియు ఊహాత్మక సామర్థ్యాన్ని తప్పుగా ఉపయోగించడం అవుతుంది. ఇది మనస్సు మరియు బుద్ధిని శక్తివంతం చేయడానికి బదులుగా, వాటిని బలహీనపరుస్తుంది. భవిష్యత్తు కోసం సిద్ధపడడం చాలా ముఖ్యం మరియు అవసరం, కానీ అలా చేస్తున్నప్పుడు, మనం చింతించటం ప్రారంభిస్తాము, అది మనల్ని ఓడిస్తుంది లేదా బలహీనపరుస్తుంది. ఒకవైపు ముందుగానే అవసరమైన ప్రిపరేషన్ చేసుకోవడం మరోవైపు చింత చేయడం – ఈ రెండింటి మధ్య చాలా సన్నని గీత ఉంది.  మనస్సులో నెగిటివ్ ఫలితాలను అధిక సంఖ్యలో సృష్టించకుండా ఈ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. 

(సశేషం…)

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »