
భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 2)
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన
January 13, 2025
మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ధ్యానంతో మన జీవితాలు అందంగా, ఆనందంగా మారాయి. భగవంతుడు ప్రపంచ పరివర్తన కార్యాన్ని నిర్వర్తిస్తూ, తన జ్ఞానం, స్వచ్ఛత మరియు శక్తులతో ప్రపంచాన్ని అందమైన స్వర్గంగా మారుస్తున్న ప్రస్తుత సమయంలో ఈ రెండు ప్రాప్తులను మనకు బహుమతిగా ఇస్తారు. మన ప్రస్తుత జీవితంలో ఈ రెండు ప్రాప్తులతో, మనం సంస్కారాలలో స్వచ్ఛంగా మరియు పరిపూర్ణంగా మారి, మన స్మృతిని దివ్యంగా చేసుకుంటాము. ఈ పరివర్తన మార్గాన్ని భగవంతుడు మనకు చూపిస్తారు. కానీ మనం ఆ మార్గాన్ని ఎలా నేర్చుకోగలం? ఎక్కడ మొదలవుతుంది? మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని బ్రహ్మా కుమారీల వద్ద 7 రోజుల పరిచయ ఆధ్యాత్మిక కోర్సుతో ప్రారంభిస్తాము. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క వివిధ అంశాలను మరియు ధ్యానం యొక్క టెక్నిక్ ను మనకు వివరిస్తుంది.
మనం కోర్సు ప్రారంభించినప్పుడు, మనం వాస్తవానికి ఆధ్యాత్మిక శక్తి లేదా ఆత్మ అని, ప్రకృతితో తయారైన ఈ భౌతిక శరీరం కాదని తెలుసుకుంటాము. కారు నడిపే డ్రైవర్ లాగా, ఆత్మనైన నేను, ఈ శరీరాన్ని నడుపుతాను మరియు నియంత్రిస్తాను. ఇంకా, నా శరీరం, మెదడు మరియు కర్మేంద్రియాల ద్వారా వివిధ చర్యలను చేస్తాను. ఆత్మనైన నేను, ఆలోచించే మరియు అనుభూతి చెందే మనస్సుతో; జ్ఞానాన్ని నిర్ధారించుకొని, ఆచరించే మరియు విజువలైజ్ చేసే బుద్ధితో మరియు సంస్కారాలు అనగా అంతర్గత వ్యక్తిత్వంతో రూపొందించబడ్డాను. నా రూపం దివ్యమైన ప్రకాశం, భౌతిక కళ్ళకు కనిపించదు. నా అసలైన సుగుణాలు శాంతి, సంతోషం, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం. వీటిని నేను జనన-మరణ చక్రంలో కోల్పోయాను. మన అసలైన మరియు శాశ్వతమైన ఆధ్యాత్మిక గృహం పరంధామం లేదా అవ్యక్త ప్రపంచం లేదా నిశ్శబ్ద ప్రపంచం అని కూడా మనం నేర్చుకుంటాము. దీనిని నిర్వాణధామం లేదా శాంతిధామం అని కూడా పిలుస్తారు, ఇక్కడ నుండి మనం మన పాత్రలను పోషించడానికి భూమి మీద ఉన్న భౌతిక ప్రపంచంలోకి దిగుతాము. అలాగే, భూమిపై జరిగే ప్రపంచ నాటకంలో నాలుగు వేర్వేరు యుగాలలో మన వేర్వేరు పాత్రలు లేదా జన్మలను మనం అర్థం చేసుకున్నాము. ఈ ప్రపంచ నాటకంలో ఏ మానవ ఆత్మ అయినా అత్యధికంగా 84 జన్మలు తీసుకుంటుంది. చివరగా, మనం మానవులుగా మాత్రమే జన్మిస్తామని, పశుపక్షాదులలో పుట్టమని కూడా భగవంతుడి నుండి నేర్చుకుంటాము. ఎందుకంటే మనం మానవ శరీరాలలో మాత్రమే మన పాత్రలను పోషించే సంస్కారాలను కలిగి ఉంటాము. అలాగే, అందరూ నమ్మినట్లుగా మనం కోతులుగా ఉండమని, మన ప్రారంభ జన్మలలో దేవీ దేవతలుగా ఎలా ఉండేవాళ్ళమని భగవంతుడి నుండి నేర్చుకుంటాము. మనము జనన-మరణ చక్రంలోకి వచ్చిన తరువాత ప్రారంభంలో ఉండే మన ఆత్మిక స్మృతి, ఆధ్యాత్మిక స్వచ్ఛత మరియు దివ్య గుణాలను కోల్పోయి అదే దేవీ దేవతలను పూజించడం ప్రారంభించాము.
(సశేషం…)
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఉదయం మనం రోజును ప్రారంభించినప్పుడు, వివిధ చర్యలను చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా లేదా మన ఆఫీసులో ఉన్నా
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మనది వినాలని లేదా మనమంటే ఆసక్తికరంగా అనిపించాలని అందరితో మాట్లాడుతూ ఉండాలి అని భావిస్తాము. ఈ ఆత్రుత
Start your day with a breeze of positivity and stay motivated with these daily affirmations
After Clicking on Join, You will be redirected to Whatsapp Community to receive daily message. Your identitiy will be secured and no group member will know about another group member who have joined.