Hin

18th May 2025 Soul Sustenance Telugu

May 18, 2025

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 5)

భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మనం మంచిని ప్రసరింపజేస్తాము

మనం ఇతరులకు ఎంత మంచిని ప్రసరింపజేస్తాము అనేది మానవ జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలలో ఒకటి. భగవంతుడు ఒక అందమైన ఆత్మ, పరమ ఆత్మ అని గుర్తుంచుకోండి. వారు సంపూర్ణ జ్ఞానం లేదా సత్యంతో, అన్ని గుణాలతో మరియు అన్ని శక్తులతో నిండి ఉన్నందున, తన లోపల ఉన్న ప్రతిదానితో ప్రతి ఆత్మకు మరియు భౌతిక ప్రపంచానికి నిరంతరం సేవ చేస్తారు. భగవంతుడి లాగా ఎవరూ ఉండరు, ప్రతి క్షణం బేషరతుగా ఇచ్చేది వారు ఒక్కరు మాత్రమే. కానీ ఈ సంస్కారంలో మనం భగవంతుడిని అనుసరించవచ్చు. నిరంతరం భగవంతుడితో ఉండటం ద్వారా, మనం మరింత సంతృప్తికరంగా అనుభూతి చెందవచ్చు, ఎందుకంటే ప్రపంచంలో మనం చూసే ప్రతి మంచి వస్తువుకు వారు సాగరుడు. వారి మంచితనం ప్రతి మానవ ఆత్మలో వివిధ రకాలుగా ఉంటుంది, ఎందుకంటే వారు మానవ ప్రపంచ వృక్షానికి విత్తనం. మన జీవితంలో వారి చెంతను అనుభూతి చేయడం ద్వారా, మనం మంచితనం యొక్క పరిపూర్ణ స్వరూపంగా మరియు మంచితనం యొక్క మాస్టర్ సాగరుడిగా – మంచితనం యొక్క సాగరుడైన భగవంతుని బిడ్డగా మారుతాము. మన వ్యక్తిత్వం పరిపూర్ణమవుతుంది మరియు ప్రతి ఒక్కరూ మన చెంతలో ఉండటం ద్వారా సానుకూలంగా ప్రయోజనం పొందుతారు. ఎలా అయితే భగవంతుడు ఎటువంటి కోరికలు మరియు అంచనాలు లేకుండా సేవ చేస్తారో, అలానే మన ప్రకంపనలు, ఆలోచనలు, మాటలు మరియు చర్యలు ప్రతి ఒక్కరికీ సేవ చేయడం ప్రారంభిస్తాయి.           

భగవంతునికి దగ్గరగా ఉండటం వలన, మనం వారి స్వచ్ఛమైన మాధుర్యత, అమాయకత్వం, వినయం మరియు ఔదార్యం యొక్క శక్తిని పొందుతాము. ఈ శక్తి మన ద్వారా ఇతరులకు ప్రవహిస్తుంది. అలాగే, ఈ శక్తిని ప్రసరింపజేసేటప్పుడు, మనం సంతృప్తిని అనుభూతి చేసి ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలను పొందుతాము. ఇది మన జీవిత ప్రయాణాన్ని సులభంగా, ఆనందదాయకంగా మరియు అడ్డంకులు లేకుండా చేస్తుంది. మరోవైపు, మనం మన భౌతిక వాస్తవంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించి, భగవంతుడిని మరచిపోయినప్పుడు, మన స్మృతిలో ఖాళీగా ఉంటాము మరియు మనలో జ్ఞానం, గుణాలు మరియు శక్తులు క్షీణిస్తాయి. అటువంటి దశలో, ఇతరుల కోసం కూడా ఇవన్నీ చేయడానికి బదులు, మన స్వంత కోరికలను నెరవేర్చడం, మన ప్రతికూల సంస్కారాలను మరియు మన స్వంత క్లిష్ట పరిస్థితులను అధిగమించడంపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తాము. అలాగే, ఇతరులకు మంచితనం ఇచ్చే దశలో, మనం భగవంతుడి నుండి చాలా పొందుతాము మరియు వారి ఆశీర్వాదాలు నిరంతరం మనతో ఉంటాయి, ఇవి మనల్ని వారికి దగ్గరగా చేస్తాయి. ఇది భగవంతుడు మనకు ఇచ్చే అతి పెద్ద బహుమతి.

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »