Hin

16th May 2025 Soul Sustenance Telugu

May 16, 2025

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 3)

భగవంతుడు మనతో ఉన్నప్పుడు, జీవితానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది.

ఈ రోజు మనం మన జీవితాన్ని వివిధ రకాలుగా ఆస్వాదిస్తున్నాము. ఐదు ఇంద్రియాల ఆనందానికి అనేక విభిన్న వనరులు ఉన్నాయి. మనం సంతోషిస్తాము, మరచిపోతాము. తరువాత మళ్ళీ సంతోషిస్తాము, మళ్ళీ మరచిపోతాము. మనం ఒకసారి సంతోషంగా ఉంటాము, మళ్ళీ వెంటనే ఆ సంతోషం పోతుంది. సంతోషం శాశ్వతం కాదేమో అని అప్పుడప్పుడూ మనలో అనుమానం కలుగుతుంది. అయినప్పటికీ మనం మళ్ళీ సంతోషానికి తదుపరి మూలం కోసం చుస్తూ ఉంటాము, ఎందుకంటే, అది మనల్ని ఉత్తేజపరిచి ఆ తాత్కాలిక పాజిటివ్ అనుభూతిని ఇస్తుంది. మనం ఎల్లప్పుడూ ఈ విధంగా సంతోషం కోసం వెతుకుతూ ఉంటాము. తాత్కాలికంగా మాత్రమే ముగిసే ఈ సంతోషం యొక్క అన్వేషణ ఎప్పటికీ ముగియదు. అప్పుడు కొంత సమయం తరువాత, మన మనస్సు మరింత అడగడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియలో ఏమి జరిగిందంటే, మన జీవితం మన స్వంత మనస్సులలో ప్రాముఖ్యతను కోల్పోతుంది. ఇది బహుశా సరైన జీవన విధానం కాదని, ఏదో లోపం ఉందని మనం స్వయంగా భావిస్తాము. దీనికి పరిష్కారం ఏమిటి అని మన మనస్సు కూడా ఆందోళన చెందుతుంది.

మనం చేస్తున్న తప్పు ఏమిటి? మనం మనుషులతో, భౌతిక వస్తువులతో మరియు ప్రక్రుతితో  కూడా స్నేహం చేసుకున్నాము, కాని అత్యంత సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన, జ్ఞానం, గుణాలు, శక్తులు మరియు అనేక విభిన్న విశేషతలతో నిండిన భగవంతునితో మన అత్యున్నత స్నేహాన్ని కోల్పోయాము. వ్యక్తులతో, సన్నిహితులతో, స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి భగవంతుడు అడ్డుకుంటున్నాడా? జీవితంలో మంచి వస్తువులను ఉపయోగించడానికి, వాటిని కలిగి ఉండటానికి భగవంతుడు మనల్ని అడ్డుకుంటున్నాడా? జీవితంలో మంచి ప్రదేశాలను చూసి వాటిని ఆస్వాదించడానికి భగవంతుడు మనల్ని అడ్డుకుంటున్నాడా? అస్సలు కాదు. ఇవన్నీ చేస్తూనే ఉండమని చెప్తారు. మంచి కుటుంబం మరియు స్నేహితులను కలిగి ఉండండి, మీ వృత్తిపరమైన జీవితంలో మీరు చేసే అన్ని పనులను ఆస్వాదించండి, మీ పాత్రలలో మంచి డిగ్రీలు, పదవులు కలిగి ఉండండి. అలాగే, జీవితంలో ముఖ్యమైన ప్రతిదానితో మంచి నాణ్యమైన జీవితాన్ని గడపండి. కానీ, ఇవన్నీ చేసేటప్పుడు భగవంతుడిని మర్చిపోకూడదు. అభివృద్ధి చెందిన ఈ ప్రపంచంలో మనకు చాలా మంచి విషయాలు లభించిన తర్వాత, మనం ఆయనను ఎందుకు అంతగా మరచిపోయామని భగవంతుడు మనల్ని అడుగుతున్నారు. కొంతకాలం క్రితం ప్రపంచం అంతగా అభివృద్ధి చెందని సమయంలో ప్రపంచం ఆయనను ఎక్కువగా గుర్తుంచుకునేదని భగవంతునికి తెలుసు. ఆ సమయంలో ఐదు ఇంద్రియాల యొక్క సంతోష వనరులు సంఖ్యలో తక్కువగా, చాలా తక్కువ ఉత్తేజకరమైనవిగా ఉండేవి. అందుకే భగవంతుడు మరింత ముఖ్యమైనవారిగా ఉండేవారు. మరి, మనం ఎలా దారి తప్పిపోయాం? మరింత భౌతికవాదంగా మారడం ద్వారా. మన స్వంత జీవితం యొక్క ప్రాముఖ్యతను తిరిగి పొందాలంటే, భగవంతుని ప్రాముఖ్యతను, వారి నిరంతర సహవాసాన్ని మనం తిరిగి పొందాలి. అది మన జీవితాన్ని ప్రాముఖ్యతలో మరింత లోతుగా చేస్తుంది మరియు మనం అలా చేసినప్పుడు మరింత సంతృప్తిగా, సంతోషంగా కూడా అనుభూతి చెందుతాము.

(సశేషం…)

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »