Hin

8th march 2025 soul sustenance telugu

March 8, 2025

మనం ఎమోషనల్‌గా ఉండాలా వద్దా (పార్ట్ 2)

నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాం, ఇస్తూ ఉంటే భావోద్వేగ శక్తి వస్తుంది. తీసుకోవడమే మన లక్ష్యంగా పెట్టుకుంటే భావోద్వేగ బలహీనత వస్తుంది. జీవితంలో మన ముందుకు వచ్చే దృశ్యాలు, పరిస్థితులు, వ్యక్తుల ఆలోచనలు, మాటలు మరియు వారి కర్మల నుండి మనం చాలా గ్రహిస్తుంటాము. కొన్నిసార్లు అది సాధికారత కలిగించే అనుభవంగా భావిస్తాము. కానీ గుర్తుంచుకోండి, మీరు మంచిని గ్రహిస్తే, మీరు చెడును కూడా గ్రహిస్తారు ఎందుకంటే మీ మనస్తత్వం అలా ఉంటుంది. ఇది వాక్యూమ్ క్లీనర్ లాంటిది. మీరు దానితో మీ కార్పెట్‌ను శుభ్రం చేస్తున్నారు. ఇది దుమ్మును గ్రహిస్తుంది. ఒకవేళ మీ ఉంగరం కార్పెట్‌పై పడి ఉంటే, దానిని కూడా వాక్యూమ్ క్లీనర్ లోపలకు తీసేసుకుంటుంది. అలాగే, ఇవ్వడమే స్వీకరించడం. మనం ఇచ్చే ప్రతి సానుకూల భావోద్వేగం, అదే సమయంలో మనలో పెరుగుతుంది, అది మనలో నుండి ప్రతి ఒక్కరికీ మరియు మన చుట్టూ ఉన్న ప్రతిదానికీ ప్రవహిస్తుంది.

                

ఈ సిద్ధాంతం ఆధారంగా, ఒక పాజిటివ్ దృశ్యం నుండి మనం తీసుకోవాలని చూస్తే, మనం ఎమోషనల్‌గా ఆనందంగా ఉంటాము. అలాగే ఒక నెగిటివ్ దృశ్యం నుండి కూడా మనం ఎమోషనల్‌గా బాధను తీసుకుంటాము. ఎంతగా మన ఎమోషనల్ ప్రపంచాన్ని మనం బాహ్య పరిస్థితులపై ఆధారపడేలా చేస్తామో అంతగా మన ప్రతిస్పందనలు వాటి ప్రభావంలో ఉంటాయి. అతిగా ఎమోషనల్‌గా ఉంటే, అది ఆనందం కావచ్చు బాధ కావచ్చు, ఇది ఆధారపడే స్వభావానికి గుర్తు. అంటే ఏ ఎమోషన్లు లేకుండా బోరింగుగా ఉంటూ జీవితంలో వచ్చే అందమైన క్షణాలను ఆస్వాదించవద్దు అని అర్థం కాదు. నిజానికి, మనం అందరినీ ప్రేమిస్తూ అవసరమైన చోట మన సానుభూతిని కూడా వ్యక్తపరుస్తూ ఉండాలి. అయితే జీవితాన్ని చూసే సమయంలో కొద్దిగా నిర్లిప్తత కూడా ఉండాలి. క్రీడలు జరుగుతున్నప్పుడు అది ప్రత్యక్షంగా చూసే ప్రేక్షకుడు తనకిష్టమైన టీమ్ లేదా ఆటగాడు ఆడుతుంటే ఎమోషన్ల రోలర్ కోస్టర్ (మలుపులు తిరిగే ట్రాక్‌పై చేసే వినోద యాత్ర) పై ప్రయాణిస్తూ ఉంటాడు. అంటే, ఒక్కోసారి చాలా ఆనందం, మరోసారి చాలా బాధ. ఆత్మిక స్థితిలో ఉండి చూసే ప్రేక్షకుడు తన టీమ్ లేక ఆటగాడి ఆటకు అతిగా ప్రభావితం కాడు. ఇతడు విజయాలను, వైఫల్యాల క్షణాలను రెండింటినీ ఎమోషన్లలోకి రాకుండా ఆస్వాదిస్తాడు. ఇది బోరింగ్ స్థితి కాదు, పైగా మరింత శక్తివంతమైన స్థితి. ఇది జీవితంలో వచ్చే అన్ని పరిస్థితులకు వర్తిస్తుంది.

 

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »