Hin

11th November 2024 Soul Sustenance Telugu

November 11, 2024

మానసిక అలసటను అధిగమించడానికి 5 చిట్కాలు (పార్ట్  3)

  1. పరిస్థితుల భారం లేకుండా జీవితాన్ని ఒక అందమైన ప్రయాణంగా జీవించండి – భారం లేకుండా జీవితాన్ని జీవించడానికి చాలా ముఖ్యమైన అభ్యాసం ప్రయాణాన్ని ఆస్వాదించడం. సైడ్ సీన్లు లేని ప్రయాణాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? అదే విధంగా, జీవిత ప్రయాణంలో ఎల్లప్పుడూ కొన్నిసార్లు ప్రతికూలంగా, కొన్నిసార్లు సానుకూలంగా ఉండే సన్నివేశాలు ఉంటాయి. ఏ దృశ్యాలు శాశ్వతంగా ఉండవని గుర్తుంచుకోండి. కాబట్టి, ప్రతి సన్నివేశాన్ని చూసేటప్పుడు, ఎటువంటి ఆందోళన, చింత లేకుండా ఉండండి. ఎందుకంటే మన జీవిత అనుభవం నుండి మనకు తెలిసినట్లుగా – ఇది కూడా గడిచిపోతుంది. వర్తమానం గతం అవుతుంది మరియు భవిష్యత్తు అందంగా ఉంటుంది. ఏ ప్రతికూల పరిస్థితి శాశ్వతం కాదు. ప్రశాంతంగా ఓర్పుతో వేచి ఉన్నట్లయితే ప్రయాణంలో ఆ పరిస్థితిని దాటి ఇక తరువాత ప్రయాణం హాయిగా కొనసాగే దశకు మనల్ని చేరుస్తుంది. ఇది జీవిత నియమము. అలాగే, మన జీవిత ప్రయాణంలో సైడ్ సీన్లకు మనం ఎంత దూరంగా ఉంటామో, అంత సంతోషంగా, తేలికగా ఉంటాము.
  2. మీ ఆలోచనలు మీ జీవితాన్ని సృష్టిస్తాయి. ..మీకు మీరే మానిటర్ గా ఉండండి – మీ ఆలోచనలను తక్కువగా, చాలా సానుకూలంగా, తేలికగా ఉంచడం మరియు మానసిక అలసట నుండి విముక్తి పొందడంలో చాలా ముఖ్యమైన అంశం, రోజంతా ఎప్పటికప్పుడు మీ ఆలోచనలను చెక్ చేసుకోవడం. ఒకటి, మీ ఆలోచనలు ప్రతికూలంగా మారి, అవి ఎక్కువ అయ్యి ప్రతికూల బలం పెరిగి, మిమ్మల్ని కలవరపెట్టినప్పుడు, వాటి దిశను సానుకూలంగా మార్చడం.  ఇది మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ లో  ఏదైనా సానుకూలమైనది చదువుకోవటానికి ఉంచుకోవడంతో చేయవచ్చు. దీన్ని రోజూ కాలానుగుణంగా చదవండి. దీన్ని రోజుకు 4-5 సార్లు చదివితే మీరు మీ ఆలోచన యొక్క దిశను సులభంగా మార్చగలుగుతారు. అలాగే, మీరు రోజును ముగించినప్పుడు, గడిచిన రోజంతా మీ ఆలోచనలను సమీక్షించి, మరుసటి రోజు కోసం దిద్దుబాట్లు చేసుకోండి. మరుసటి రోజు ఉదయం, రోజు కోసం మీ పనులను ప్లాన్ చేసుకొని వాటితో పాటు మీ ఆలోచనలను స్వయం చెక్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా చిన్న విరామాలను తీసుకునేలా చూసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »
19th May 2025 Soul Sustenance Telugu

మార్పులో స్థిరంగా ఉండటానికి 5 మార్గాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు స్వయంతో మాట్లాడుతూ ఆత్మపరిశీలన చేసుకోండి – మన జీవితంలో ఏ రకమైన మార్పును చూసినా, మార్పు యొక్క విభిన్న దృశ్యాలకు ప్రభావితం

Read More »
18th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 5)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మనం మంచిని ప్రసరింపజేస్తాము మనం ఇతరులకు ఎంత మంచిని ప్రసరింపజేస్తాము అనేది మానవ జీవితంలో చాలా ముఖ్యమైన

Read More »