2nd feb soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (భాగం 2)

మెడిటేషన్ అనేది మనస్సులో పాజిటివిటి సృష్టించే ప్రక్రియ, తద్వారా మనస్సు రోజువారీ జీవితంలోని సాధారణ ఆలోచనలను పాజిటివ్ గా మారడం ప్రారంభమవుతుంది. ఇది మైండ్ ను ఖాళీగా ఉంచడం లేదా పూర్తిగా ఆలోచనలు లేకుండా చేయడం కాదు. వాస్తవానికి, ఇది మనస్సును పాజిటివ్ ఆలోచనలతో మరియు బుద్ధిని అత్మనైన నా యొక్క, పరమాత్మ యొక్క పాజిటివ్ దృశ్య చిత్రాలతో నింపుకోవడం. మనం ఎవరు, భౌతిక కాయాన్ని గురించి , మన పేరు ఏమిటి, మనం ఏ పని చేస్తాం, మనం ఎక్కడ ఉంటాము, మన జాతీయత ఏమిటి మరియు మనం ఎలా కనిపిస్తామో మనందరికీ తెలుసు. కానీ అది మన భౌతిక గుర్తింపు మరియు ఇది మన భౌతిక గుర్తింపుకు భిన్నమైన ఆత్మిక గుర్తింపు.
ఆధ్యాత్మిక గుర్తింపు చాలా సులభం – నేను శరీరానికి అతీతమైన ఆత్మిక శక్తి. నేను ప్రకృతి యొక్క పంచ తత్త్వాలతో రూపొందించబడలేదు. అలాగే, నేను ఏడు నిజ గుణాలతో ఉన్నాను – శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, పవిత్రత, శక్తి మరియు జ్ఞానం, ఇది నా అసలు స్వభావం. నేను భౌతిక శరీరం ద్వారా నా వంతు పాత్రను పోషించడానికి పరంధామం లేదా శాంతిధామం లేదా నిర్వాణధామం అని కూడా పిలువబడే ఆత్మల ప్రపంచం నుండి ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాను. అలాగే, నా తండ్రి, సర్వోన్నతమైన ,సర్వాత్మల తండ్రి, ఈ ఏడు గుణాల సాగారుడు, వారు ఆత్మ ప్రపంచంలో ఉంటారు. ఇది నా ఆధ్యాత్మిక పరిచయం మరియు ఇది ప్రపంచంలోని మానవ ఆత్మలందరి పరిచయం. ఇప్పుడు, ఈ ఏడు గుణాల సాగరుడైన భగవంతునితో కనెక్ట్ కావడానికి – నేను ఆత్మను, మెరిసే నక్షత్రం వంటి వాడిని, అనే నా ఆత్మిక రూపాన్ని గుర్తుంచుకొని, మనసు-బుద్ధి ద్వారా నా గుణాలను విజువలైజ్ చేసుకోవాలి. ఇదే మెడిటేషన్ యొక్క మొదటి మెట్టు.ఆ తరువాత, నేను నా బుద్ధి నేత్రంతో ఆత్మల ప్రపంచానికి ప్రయాణించి నా పరమపిత పరమాత్ముని తో కొన్ని నిమిషాల కనెక్ట్ అవ్వాలి. వారి శక్తిని నాలో నింపుకావాలి. మెడిటషన్ అంటే ఆత్మ మరియు పరమాత్మ యెక్క కలయిక. ఆత్మ శక్తివంతమైన కనెక్షన్‌తో ఈ విధంగా తనను తాను శక్తివంతం చేసుకొని ఈ ప్రపంచంలో తన కర్మలను తన ఏడు గుణాలతో నిర్వహిస్తుంది. ఆ కర్మలు పవిత్రమైన కర్మలుగా మారి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తాయి. ఇది మెడిటేషన్ యొక్క ఇంద్రజాలం.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »