Hin

9th oct 2023 soul sustenance telugu

October 9, 2023

10 మెడిటేషన్ యొక్క ఆణిముత్యాలు (పార్ట్ 1)

మెడిటేషన్ పవిత్రంగా మరియు శక్తివంతంగా మార్చే భగవంతునితో ఒక లింకు. ఇది ఆధ్యాత్మిక స్వయాన్ని, పరమాత్మ లేదా భగవంతుడిని ఆత్మ పరిశీలన మరియు విజువలైజ్ చేసే ప్రక్రియ. మెడిటేషన్ నేర్చుకొని ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మనం స్థిరంగా, మరింత ప్రేమగా మరియు పూర్తి ప్రశాంతతతో ఉంటాము.

మెడిటేషన్ యొక్క 10 విభిన్న అందమైన ఆణిముత్యాలను సేకరించి ఈ సందేశంలో స్తున్నాము. ప్రతి ముత్యం ఒక గొప్ప అంతర్గత అనుభవం, అది మనల్ని పరమాత్మకు దగ్గరగా చేర్చి మన జీవితాన్ని మంచితనం మరియు శక్తితో విలువైనదిగా నింపుతుంది.

  1. జ్ఞానం యొక్క అంతర్గత నేత్రంతో ప్రతి గంటకు 1 నిమిషం నేను ఆత్మను కనుబొమ్మల మధ్య ప్రకాశవంతమైన కాంతి యొక్క అందమైన మెరిసే నక్షత్రాన్ని అని అనుభవం చేసుకొని శాంతి, ప్రేమ,  ఆనందం యొక్క గుణాలను తెల్లటి కాంతి రూపంలో అందరికీ ప్రసరింపజేయండి.
  2. రోజులో 10 సార్లు గుర్తు చేసుకోండి – నేను భగవంతుని బిడ్డను, వారు ఆత్మిక జ్ఞానసూర్యుడు. నేను వారి కిరణాలలోకి ప్రయాణించి కనెక్ట్ అయ్యి, వారి కాంతిని మరియు శక్తిని గ్రహించుకొని వాటిని విశ్వంలోకి ప్రసరింప చేస్తాను.  నెగెటివిటీ యొక్క చీకటిని తొలగిస్తాను.
  3. పవిత్రమైన మరియు లోతైన సైలెన్స్ ప్రపంచంలో ప్రతి ఉదయం శాంతి సాగరుడైన భగవంతునితో ఆత్మప్రపంచంలో కూర్చోని వారి లోతైన శాంతిని అనుభూతి చెందండి. ఆత్మను లోతైన గాయాలు మరియు నొప్పి నుండి శుభ్రపరచి ఆత్మను శక్తివంతం చేయండి.
  4. నేను ఆనంద స్వరూప ఆత్మను, సంతుష్టంగాన్నాను అని రోజులో కొన్ని సార్లు మీతో మీరు మాట్లాడుకోండి. నేను భగవంతుని ఆనంద కిరణాలు నాపై పడినట్లు భావిస్తున్నాను. నేను ఈ కిరణాలలో స్నానం చేసి ఇతరులపై ద్వేషం మరియు అసూయ వంటి నా మలినాలను కడిగివేస్తాను.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »
15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »