Hin

10th-oct-2023-soul-sustenance-telugu

October 10, 2023

10 మెడిటేషన్ యొక్క ఆణిముత్యాలు (పార్ట్ 2)

  1. ప్రతిరోజూ భగవంతుని స్మరణ అనే అద్దంలో చూసుకొని అన్ని గుణాలు మరియు శక్తులతో మిమ్మల్ని మీరు అందంగా మార్చుకోండి. మీరు భగవంతుని మంచితనానికి ప్రతిబింబం. ఈ మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని ఇతరులను చూడండి, వారు కూడా అందంగా అయిపోతారు.
  2. ఎల్లవేళలా భగవంతునితో మాట్లాడండి. నువ్వు నా అత్యంత విలువైన స్నేహితుడివి మరియు సహచరుడివి, అడుగడుగునా నువ్వు నాతోనే ఉంటావు. నేను నీ చేయి పట్టుకున్నాను, నీ ఆశీర్వాదాలను పొందుతున్నాను, నీ హృదయంలో నేను ఉన్నానని భావిస్తున్నాను, నా బాధలు మరియు కష్టాలు అన్నీ మర్చిపోతాను అని వారికి చెప్పండి.
  3. మీరు ఒత్తిడికి గురైనప్పుడల్లా, భగవంతుడిని శాంతిధామం నుండి క్రిందికి పిలవండి. మీ ఇంటిలో, మీ కార్యాలయంలో, తన శక్తి కిరణాలను ప్రసరింపజేస్తూ, వాతావరణాన్ని పాజిటివ్ గా మార్చేలా పరమాత్మ కాంతిని అనుభూతి చెందండి.
  4. ప్రతి గంటా నేను ఒక చైతన్య ఆత్మను అనే స్పృహలో భగవంతుని వద్దకు ప్రయాణించి శాంతిధామంలో వారి ముందు కూర్చోండి. మీ సమస్యలను వారికి చెప్పండి, మీ భారాలను తగ్గించుకోండి. వారి గైడెన్స్ తీసుకుంటూ వారి ప్రేమను అనుభూతి చెందండి. తేలికగా అయి విశ్రాంతి పొందండి.
  5. మీ భగవంతుని స్మరణ ప్రపంచానికి ఒక లైట్ హౌస్ . నేను మంచితనం మరియు శక్తి యొక్క దేవదూతను. నేను భగవంతునితో ప్రపంచమంతా తిరుగుతాను, వారి గుణాల వెలుగును అందరికీ ప్రసరింపజేస్తాను అని ప్రతి సాయంత్రం కొన్ని నిమిషాల పాటు విజువలైజ్ చేయండి.
  6. నిద్రపోయే ముందు భగవంతునికి మీ ప్రేమను తెలియజేస్తూ ఒక లేఖ రాయండి. విభిన్న సంబంధాల ద్వారా వారితో కనెక్ట్ అయ్యి ప్రేమ యొక్క కాంతితో ప్రపంచం యొక్క నెగిటివిటీ నుండి పూర్తిగా సురక్షితంగా రక్షించబడుతూ వారి ఒడిలో నిద్రించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

11th feb 2025 soul sustenance telugu

పునర్జన్మ అనేది వాస్తవమేనా ? 

మనమందరం ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం, మన శరీరాల ద్వారా మన పాత్రలను పోషిస్తున్నాము. మన స్వభావం లేదా సంస్కారాల ఆధారంగా మన ఆధ్యాత్మిక ఆలోచనలు, మనం విజువలైజ్ చేసేది, ప్రవర్తించేది వేర్వేరుగా ఉంటాయి. 

Read More »
10th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 3)

మీ మంచితనాన్ని ఉపయోగించుకోండి లేదంటే కోల్పోతారు  వారి సానుకూల శక్తులను ఉన్నతొన్నతమైన మూలం లేదా భగవంతుడు నింపే వ్యక్తులకు ఇచ్చే వ్యక్తిత్వం సహజంగా వస్తుంది. లేకపోతే ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇతరులకు సేవ

Read More »
9th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 2)

సానుకూల శక్తిని ఎప్పటికీ కోల్పోవద్దు వ్యక్తులు మన జీవితాల్లోకి వేర్వేరు, కొన్నిసార్లు వ్యతిరేక సంస్కారాలతో కూడా వస్తారు. తరచుగా, మన ప్రియమైనవారిలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు – భర్త లేదా భార్య, తల్లిదండ్రులు, పిల్లలు

Read More »