Hin

10th april soul sustenance telugu

మానసిక అలసటను అధిగమించడానికి 5 ఉపాయాలు (భాగం 1)

మన బిజీ జీవనశైలి, బిజీ రోజులు, ఇందులో మనమంతా ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మౌనం మరియు అంతర్ముఖత అభ్యాసాన్ని ఎప్పటికప్పుడు చేస్తుండాలి. మనల్ని మనం ఒక చక్కని ప్రశ్న వేసుకోవాలి – ఆలోచనలతో నిండిన మనసు నాకిష్టమా లేక తక్కువ ఆలోచిస్తూ ఆలోచనల మధ్య వ్యవధిని ఉంచే మనసు నాకిష్టమా? ఒకానొక కాలంలో, కొంతమంది ఒక దేశం నుండి మరో దేశానికి కాలిబాటన వెళ్తున్నారు. వారి వీపున ఎంతో బరువును మోస్తూ ఉన్నారు, అది చాలా అలసట కలిగించే ప్రయాణంగా అయింది వారికి. ఇక వారు తమ గమ్యస్థానానికి చేరుకునేసరికి, వారి శక్తి అంతా పోయి ఉత్సాహం తగ్గిపోయి ఉంది. వారి పని సామాన్లను ఒక చోటు నుండి మరో చోటుకు చేర్చడం. తక్కువ బరువున్న జీవితాన్ని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. అలాగే, మన భావోద్వేగాన్ని మోసేది మన మనసు, ఇది ఆలోచనల బరువును మోస్తుంది. ఎంత తక్కువ ఆలోచనలు మరియు తేలికగా మనసు ఉంటే అంత ఎక్కువగా మనసు తేలికగా, ఉత్సాహంగా ఉంటుంది. మన మనసు తేలికగా ఉండి ఆనందంగా ఎగరడానికి 5 ఉపాయాలను చూద్దాం –

  1. ఒక్కసారికి ఒక్క ఆలోచననే ఆలోచించండి – కలవరంగా ఉన్న మనసు, భయంతో ఉన్న మనసు అతిగా ఆలోచిస్తుంది, అవసరానికి మించి వేగంగా ఆలోచిస్తుంది. అలాగే, అటువంటి మనసు ఒక్కోసారి నెగిటివ్ మరియు భవిష్య వాస్తవాల గురించి తప్పుగా అంచనా వేస్తుంది. దీని కారణంగా ఆలోచనల సంఖ్య పెరిగి, ఇంకా జరగని, ఉనికిలో లేని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది, ఇలా జరగవచ్చునేమో అని మనసు భయపడుతుంది. దీనినే మనం సాధారణంగా నెగిటివ్ థింకింగ్ అంటాము. మరో వైపు, పాజిటివ్ థింకింగ్ అంటే, భవిష్యత్తులో జరగబోయే సానుకూల దృశ్యాలను సంపూర్ణ ఆశ మరియు దృఢత్వముతో చూడటము. ఇలా రెగ్యులర్‌గా చేసినప్పుడు, అన్ని రకాల పరిస్థితులలో చేసినప్పుడు, మన మనసు నిదానిస్తుంది, ప్రతి ఆలోచన ఒక చిన్న అణువులా అయి మనసులోపల కూర్చుని మనల్ని రిలాక్స్ చేసి, అన్ని భారాల నుండి విముక్తి చేస్తంది.  

(రేపు కొనసాగుతుంది)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »
2nd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 1)

మనం అనూహ్యమైన జీవితాన్ని గడుపుతున్నాము. మన జీవితంలో తరచూ ఊహించని పరిస్థితులు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఏమిటి? ఈ రోజు మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులు ఎందుకు పెరుగుతున్నాయి? భగవంతుడు వెల్లడించిన ప్రపంచ నాటకం

Read More »
1st dec 2024 soul sustenance telugu

దివ్యమైన ఆత్మ యొక్క 12 లక్షణాలు (పార్ట్  2)

స్వయంలోని బలహీనతలను, లోపాలను సులభంగా పరిశీలించుకోగలిగే అద్దం లాంటి వారు దివ్యమైన ఆత్మ. వారిలో భగవంతుని మంచితనాన్ని, శక్తులను చూడగలుగుతాము. వారు భగవంతునితో స్వచ్ఛంగా, సత్యంగా ఉంటారు. వారు ప్రతిదీ ఎలా ఆచరణలోకి తీసుకురావాలనే

Read More »