Hin

ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ (పార్ట్ 4)

ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ (పార్ట్ 4)

ప్రపంచ వార్తలను ఎలా చూడాలి?

మనం వార్తాపత్రికలో ఒక వ్యక్తి లేదా స్థానం గురించి చదివినప్పుడు లేదా వార్తా ఛానెల్‌ని చూస్తున్నప్పుడు, అవే ఎమోషన్స్ లో ఉంటాము. ప్రకృతి వైపరీత్యాలు, ఉగ్రవాదుల దాడి, ప్రమాదాలు , అనారోగ్యం, ఆర్థిక సంక్షోభం వంటి వార్తలను చూస్తుంటే దుఃఖం, భయం, కోపం, ద్వేషం కలగడం సహజం. ఈ ఎమోషన్స్ లో ఉంటే అది ఇక బాహ్య ప్రపంచం యొక్క వార్త మాత్రమే కాకుండా  మన అంతర్గత ప్రపంచం యొక్క క్వాలిటిగా మారుతుంది. నెగెటివ్ ఎమోషన్స్ రచించడం ద్వారా, మనం అక్కడ ఉన్న వ్యక్తులకు, ప్రదేశానికి కూడా అదే వైబ్రేషన్‌ను ప్రసరింపజేస్తాము. మనం వారికి ఇప్పుడు ఉన్న బాధను ఎక్కువ చేస్తాము. బాధితులకు ఉన్న బాధను మనం అనుభవించటం దయ అని భావిస్తాము.  మనం వారికి మరింత నొప్పిని కలగ చేయాలా లేదా వారికి నయం అయ్యే  శక్తిని ఇవ్వాలా అని మనం ఆలోచించుకుందాము. దయ అంటే వారిని అర్థం చేసుకొని వారికి అవసరమైన వాటిని ఇవ్వడం. కోపం, ద్వేషం ఉంటే ప్రేమను, భయాందోళన ఉంటే శాంతిని ఇవ్వాలి. వార్తలను చూస్తున్నప్పుడు… ఇప్పటికే ఉన్న వైబ్రేషన్స్ కాకుండా వారికి అతీతమై అవసరమైన వైబ్రేషన్‌లను తయారుచేయండి.

ప్రపంచంలో ఏమి జరుగుతుందో అదే వైబ్రేషన్‌ను మనం సృష్టిస్తే, మనం దానిని ప్రపంచంలోకి ప్రసరింపజేస్తాము మరియు ప్రపంచంలో అంతకంటే ఎక్కువ జరుగుతుంది. ఉగ్రదావాదుల దాడి గురించి విని, ద్వేషాన్ని పెంచుకుంటే, మనం ప్రపంచంలో ద్వేషాన్ని ప్రసరింపజేస్తాము. ప్రపంచంలోని వైబ్రేషన్స్ ద్వేషం  వైపు మళ్లుతాయి మరియు ప్రపంచంలో హింస పెరుగుతుంది. మంచి  చేసే శక్తిని వారికి ఇవ్వడానికి, ప్రపంచాన్ని ప్రేమ మరియు శాంతి వైపు మళ్లించడానికి, మనం హింసను చూస్తున్నప్పుడు కూడా ప్రేమ మరియు శాంతి భావాలను సృష్టించి, వాటిని ప్రసరింపజేయాలి. నిర్లిప్త పరిశీలకుడిగా ఉండటం అంటే సన్నివేశం యొక్క భావోద్వేగానికి భిన్నంగా ఒక భావోద్వేగాన్ని సృష్టించడం. ప్రపంచానికి ఐక్యత, కరుణ, గౌరవం, ప్రేమ మరియు శాంతి వైబ్రేషన్స్  అవసరం. ఈ వైబ్రేషన్స్ ను ఎల్లప్పుడూ సృష్టిద్దాం. ప్రపంచంలోని వైబ్రేషన్స్ ప్రభావంతో జీవించడం ఒక విధానం. మన వైబ్రేషన్స్ తో ప్రపంచాన్ని ప్రభావితం చేయడం మరొక విధానం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 1)

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 1)

మనం ఒక పోటీలో ఉన్నామని, జీవితం ప్రతి క్షణం గెలవడం గురించెనని మన రోజువారీ జీవితంలో తరచుగా వింటాము. అలాగే, శారీరక స్థాయిలో ఏదైనా విజయం సాధించినప్పుడు చాలా సంతోషపడటం మనకు అలవాటయింది. అది

Read More »
11th dec 2024 soul sustenance telugu

నిజమైన విజయానికి ప్రాథమిక సూత్రాలు

కొన్నిసార్లు మనం మన లక్ష్యాలను సాధించలేనప్పుడు, మనం అంటాము – నేను విజయవంతం కాలేదు, నేను విఫలమయ్యాను. మిమ్మల్ని మీరు వైఫల్యం అని అనుకుంటే మీకు మీరే అన్యాయం చేసుకోవడం. మిమ్మల్ని మీరు నిజంగానే

Read More »
10th dec 2024 soul sustenance telugu

మనతో మంచిగా లేని వ్యక్తులకు కృతజ్ఞత

కొంతమంది వ్యక్తుల ప్రవర్తనలు మనకు దాదాపు భరించలేనివిగా అనిపిస్తాయి. వారు మన జీవితంలోకి వచ్చి వారి మాటలు, ప్రవర్తనలతో గందరగోళాన్ని సృష్టించారని మనం భావిస్తాము. అలాంటి వ్యక్తులు మన సామర్థ్యాన్ని బయటకు తీసుకువస్తారని, మనం

Read More »