10th feb soul sustenance telugu - brahma kumaris | official

ఆలోచనలు మరియు ఆంతరిక చిత్రాల యొక్క సూక్ష్మ పాత్ర (భాగం 1)

మానవ ఆత్మ అనేది సూక్ష్మమైన (భౌతికం కాని) దశ, దీనిలో ఆలోచనలు మరియు చిత్రాల యొక్క సూక్ష్మమైన పాత్ర రోజంతా మరియు మనం నిద్రపోతున్నప్పుడు కూడా నిరంతరం జరుగుతుంది, అయితే ఇది నిద్రిస్తున్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. మన ఆలోచనలు 4 ప్రధాన రకాలుగా ఉంటాయి – సద్గుణాల ఆధారంగా పాజిటివ్ ఆలోచనలు , రోజువారీ కార్యకలాపాలకు సంబంధించినవి అనగా అవసరమైన ఆలోచనలు , అనవసరమైనవి అంటే గతం, భవిష్యత్తు మరియు ఇతరులకు సంబంధించినవి అనగా వ్యర్ధ ఆలోచనలు మరియు దుర్గుణాలతో మరియు వికారాలతో కూడిన నెగిటివ్ ఆలోచనలు . అదే విధంగా, మనము నిరంతరం 4 రకాల ఆంతరిక చిత్రాలను రచిస్తాము. ఆత్మ మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలతో కూడిన ఆధ్యాత్మిక శక్తి. మనస్సు సూక్ష్మంగా ఆలోచిస్తుంది లేదా మాట్లాడుతుంది మరియు బుద్ధి దాదాపు అన్ని సమయాలలో దృశ్యమానం చేస్తుంది లేదా సూక్ష్మంగా చూస్తుంది.

ఈ రెండు ప్రక్రియలు, కొన్నిసార్లు ఒకదానికొకటి స్వతంత్రంగా పని చేస్తాయి, అలాగే కొన్నిసార్లు ఒకదానిపై ఒకటి ఆధారపడి పని చేస్తాయి లేదా ఒకదానికొకటి ప్రభావితం చేస్తాయి. ఉదా. శాంతి గురించి ఆలోచించినపుడు, దానికి సంబంధించిన విజువలైజేషన్‌లకు దారి తీస్తుంది. కోపం మరియు ద్వేషం యొక్క బాధించే దృశ్యాన్ని దృశ్యమానం చేస్తే మీ ఆలోచనలు ఆ దిశలో నుడుస్తాయి . కొన్నిసార్లు ఈ రెండు ప్రక్రియలు ఒకే సమయంలో పనిచేస్తాయి, మరి కొన్నిసార్లు ఒక సమయంలో ఒక ప్రక్రియే పనిచేస్తుంది . కొన్నిసార్లు రెండూ పని చేయవు , అయితే ఇలా మనం మేల్కొని ఉన్నప్పటితో పోల్చితే నిద్రపోతున్నప్పుడు చాలా తరచుగా జరుగుతుంది . ఈ సూక్ష్మమైన, భౌతికంగా కనిపించని పాత్ర అనేది స్వీయ మరియు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ కనిపించే పదాలు మరియు చర్యల యొక్క భౌతిక పాత్ర అంటే ఈ భౌతిక నాటకానికి పునాది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »