Soul Sustenance Telugu - 10th January

స్నేహాన్ని పునరుద్ధరించండి మరియు ఆత్మిక బంధాన్ని పెంచుకోండి

ప్రస్తుత సమయంలో పెరుగుతున్న బాధ్యతల కారణంగా మన స్నేహాలను తరచుగా వెనకకు నెట్టి వేస్తున్నాము. కొన్ని సమయాల్లో చిన్న చిన్న విభేదాల వలన మనం మనస్తాపం చెంది స్నేహితుల నుండి దూరం అవుతాము. మనమందరం స్నేహితులతో మంచి సమయాన్ని గడిపాము. కానీ కొన్ని మాటలు లేదా ప్రవర్తనల కారణంగా కొంతమంది స్నేహితుల నుండి దూరమయ్యాము. మళ్లీ వారితో కనెక్ట్ అవ్వడానికి మరియు వారితో మన ఆత్మిక బంధాన్ని పెంచుకోవడానికి ఇదే సరైన సమయం.
1. మీ మనసులో కనుమరుగైపోయిన ఒక స్నేహితుడిని మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు వారితో కాంటాక్ట్ లో ఉండవచ్చు. కానీ నిజానికి కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఆ స్నేహితుడిని గురించి మీ ఆలోచనలను పరిశీలించుకోండి. వారి పట్ల ఏదైనా ఆశతో, తిరస్కరణ లేదా బాధతో కూడిన ఆలోచనలు ఉన్నాయేమో అని పరిశీలించుకోండి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు మరియు భావాలు సంబంధాలలో ఉన్న పాజిటివ్ పునాదిని నిర్మూలిస్తాయి .
2. స్నేహాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం ఇద్దరి వ్యక్తుల అవసరం లేదు. కేవలం ఒకరు మాత్రమే చాలు. ఆ ఒక్కరూ మీరు కావచ్చు. మీ ఇద్దరి అభిప్రాయాలు మరియు ప్రవర్తనలు భిన్నంగా ఉండవచ్చు, కానీ మనసులో వారు మీ శ్రేయోభిలాషులని మీకు తెలుసు. వారి మాటలు లేదా వ్యవహారం ఏదో ఒక సమయంలో మీకు ఇబ్బందిని కలిగించి ఉండవచ్చు. దాని కారణంగా మీరు విడిపోయి ఉండవచ్చు, కానీ వారికి ఆ ఉద్దేశాలు లేకపోవచ్చు.
3. మీ మనసులో వారి పట్ల ఏర్పడిన గాయాన్ని నయం చేసుకోవడానికి ప్రతి రోజు మెడిటేషన్ చేయండి. వారి గురించి మీ ఆలోచనలలో మార్పును తీసుకురండి. దీనికోసం కొద్ది రోజులపాటు వారికి ఈ ఆలోచనలను ప్రసరింప చేయండి – నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని చేసి ఉన్నా క్షమాపణలను కోరుతున్నాను….. మీరు చేసిన దానికి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను…… మన సంబంధం ప్రేమ మరియు విశ్వాసం అనే బలమైన పునాదిపై నిలిచి ఉంది…..
4. మనస్తాపం పోయినప్పుడు మనసు షరతులు లేని అంగీకారాన్ని ప్రసరిస్తుంది. ఇతరులు మీరు అనుకునే విధంగా ఉండాల్సిన అవసరం కనిపించదు. త్వరలో ఈ ఎనర్జీ బ్లాకేజులు సమాప్తం అవుతాయి మరియు సుందరమైన స్నేహాలు బలపడటం మీరు చూస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మీ అంతరాత్మ చెప్పేది వినడం అభ్యసించండి

మన మనస్సు ప్రశాంతంగా, బుద్ధి స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన అంతరాత్మ చైతన్యవంతమవుతుంది. అంతరాత్మనే అంతర్ బుద్ధి లేదా 6th సెన్స్ అని కూడా అంటారు. అంతరాత్మ మన పంచ కర్మేంద్రియాలకు అందని అంతర్గత జ్ఞానాన్ని

Read More »
6th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మానసిక భారాలు మరియు ఒత్తిళ్ళను అధిగమించుట (పార్ట్ 3)

ఒక్కోసారి, మనమున్న వర్తమాన పరిస్థితికి సంబంధించిన ఒత్తిడి మనకు ఉంటుంది, మరి కొన్ని సార్లు ఒక పరిస్థితిలోని ఒత్తిడిని మరో పరిస్థితిలోకి తీసుకు వెళ్తుంటాం అంటే ఇది అసంబద్ధ ఒత్తిడి. ఇలా రోజంతా జరుగుతూనే

Read More »
5th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మానసిక భారాలు మరియు ఒత్తిళ్ళను అధిగమించుట (పార్ట్ 2)

బాహ్య ఒత్తిళ్ళు లేనప్పుడే మనం స్వేచ్ఛగా ఉండగలమా? ఒత్తిడి రకరకాలుగా ఉంటుంది. పనిలో చూసుకుంటే, నిర్థారిత మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత సమయంలో పని చేయాలని, ఇతరుల అంచనాలకు అనుగుణంగా పని చేయాలని, సహోద్యోగుల పనితీరుకు

Read More »