నమ్మకం ఉంటే మీరు విజయం సాధిస్తారు

నమ్మకం ఉంటే మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉండి  , వాటిని  చేరుకోవడానికి చాలా కష్టపడి పనిచేస్తూ ఏదో ఒక సమయంలో విజయంపై సందేహం పడ్డార? ఇది ఫలితాన్ని ఎలా ప్రభావితం చేసిందో గుర్తు చేసుకోండి. వ్యక్తిగత లక్ష్యం అయినా లేదా వృత్తిపరమైన లక్ష్యం అయినా, విజయవంతం కావడానికి మాకు సాధారణంగా ఇతరుల మద్దతు అవసరం. ప్రతి ఒక్కరూ ప్రశాంతంమైన మరియు స్థిరమైన మనస్సుతో పని చేయడం ముఖ్యం. చుట్టూ ఉన్న వాతావరణం  ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పం యొక్క వైబ్రేషషన్స్  తో నిండి ఉండాలి. మనం ఒకరిపై ఒకరు ఆధారపడినప్పుడు, నమ్మకం మన  ఆలోచనాలలో మరియు ప్రవర్తనలో తప్పనిసరిగా ఉండాలి. వ్యక్తులు తమ సామర్థ్యాలను విశ్వసించే వ్యక్తిని కలిగి ఉన్నప్పుడు చాలా ఉత్పాదకత కలిగి ఉంటారని మనమందరం అనుభవం చెప్తుంది . ఎవరూ తమ గురించి లేదా ఇతరుల గురించి సందేహం, అభద్రత, అసమర్థత లేదా ఆందోళన వంటి ఆలోచనలను సృష్టించకుండా చూసుకుందాం. నెగెటివ్ ఆలోచనలు విజయానికి అడ్డంకిగా మారతాయి. ఇది మన లక్ష్యం అయితే, పరిష్కార దిశగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. అందరికీ ఎలా సహాయం చేయాలి మరియు ప్రేరేపించాలి అనే దానిపై మాత్రమే దృష్టి పెడతాము. మనం ప్రతిరోజూ కలిసి కట్టుగా ఉంటేనే మనం విజయవంతం అవుతామని మనం నమ్మి గుర్తుచేసుకుందాం.  

ప్రారంభం బాగుంటే సగం కార్యాన్ని పూర్తి చేసినట్టే అని మనం విన్నాము. ఈ రోజు మనం చేయవలసిన పనుల జాబితాలో 10 లేదా 20 అంశాలు ఉన్నా, మనం వాటిని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరియు ఉత్సాహంతో ప్రారంభిస్తే, మన వేగం మరియు సామర్థ్యం అద్భుతంగా పెరుగుతాయి. మనతో పనిచేసే వ్యక్తులు మన శక్తిని గ్రహించి ప్రేరణ పొందుతారు. స్థలం, వ్యక్తులు మరియు పనికి సంబంధించి ఒక సద్భావం ఏర్పడుతుంది. సమయం అడ్డంకిగా అనిపించదు. రిలాక్స్ గా కూర్చొని ఈ రోజు మీ పనిని పూర్తిగా అర్థం చేసుకోండి. స్థిరత్వం, సౌలభ్యం మరియు సంతోషం యొక్క మీ అంతర్గత విజయ కారకాలు మీరు బయట విజయం సాధించడంలో ప్రభావం చూపుతాయి. ఆందోళన, దూకుడు లేదా ఒత్తిడి యొక్క భావోద్వేగ లీకేజీలు లేనందున మీరు సమయం మరియు శక్తిని ఆదా చేస్తారు. మీరు మీ కార్యాలయం నుండి సంతోషంగా. ప్రశాంతంగా ఇంటికి తిరిగి వెళతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »