HI

లక్ష్య సాధన ప్రయాణంలో సంతోషం పొందడం

లక్ష్య సాధన ప్రయాణంలో సంతోషం పొందడం

మనమందరం, ఏదో ఒక సమయంలో, వాస్తవానికి మన జీవితంలో దాదాపుగా, వివిధ రకాల దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక లక్ష్యాలను కలిగి ఉంటాము – వ్యక్తిగత లక్ష్యాలు, వృత్తిపరమైన, ఆర్థిక, సామాజిక, సంబంధాల లక్ష్యాలు; శారీరక శ్రేయస్సు మరియు ఆరోగ్యానికి సంబంధించిన లక్ష్యాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలు మొదలైనవి. కొన్నిసార్లు మనకు మనం గుర్తించక పోయినా మనం ఎల్లప్పుడూ ఏదో ఒక లక్ష్యంతో జీవిత ప్రయాణంలో ప్రయాణిస్తుంటాము. ఆ లక్ష్యం ఉన్నతమైన ప్రయోజనం లేదా ఏదైనా మన రోజువారీ జీవనానికి చెందినదైనా ఉండవచ్చు. 

మనం చేసే చర్యలు ఏమైనప్పటికీ, ఈ ప్రయోజనాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా ఉంటాయి. అలాగే, ఈ చర్యలు చాలా అంచనాలతో నిండి ఉంటాయి, కొన్ని ఫలితాలను సాధించేవిగా ఉంటాయి. మనం ఆశించే ఈ ఫలితాలు ఒక్కోసారి వస్తాయి మరియు కొన్నిసార్లు రావు. మనం ఆశించే ఫలితాలు రాకుంటే, అవి మనలో ఆందోళన కలిగిస్తాయి. ఫలితాలు సాధించినప్పటికీ, ఆ ఫలితాలకు ముందు ప్రయాణం యొక్క స్వభావం, ఉద్దేశ్యంతో నిండిన కానీ నిరీక్షణ లేని ప్రయాణంతో పోలిస్తే ఒత్తిడితో కూడుకున్నది, ఒత్తిడి లేకుండా లక్ష్యం సాధ్యం కాదని కొందరు వాదించవచ్చు. ఆందోళన మరియు ఒత్తిడి కేవలం ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ రూపంలో మాత్రమే కాకుండా మన భౌతిక శరీరాన్ని మరియు సంబంధాలను కూడా దెబ్బతీస్తాయి, ప్రయాణాన్ని కష్టతరం మరియు అలసిపోయేలా చేస్తాయి. కార్యాచరణ ఆధారితంగా ఉండటం మరియు మన లక్ష్యం వైపు ముందుకు సాగడంలో కొన్ని స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉండటంలో తప్పు కాదు, కానీ మన కలలను డేట్ కాన్షియస్ చేయకుండా మరియు అవి ఇప్పుడు నెరవేరుతుందనే అంచనా నుండి విముక్తి పొందగల సామర్థ్యం కలిగి ఉండాలి. అలా ఉండకపోతే , మనం రేపటి కోసం జీవిస్తాము మరియు సులభంగా కలత చెంది  నిరుత్సాహపడతాము మరియు ఈరోజును మనం ఆనందించలేము. మనం ఏదైనా సాధించినప్పుడు సంతోషించడం తప్పు కాదు, కానీ మన ఆనందం మన విజయాలపై ఆధారపడి ఉంటే, మనం సంతోషించడం ఎల్లప్పుడూ వాయిదా వేస్తాము. సంతోషం తర్వాత కోసం కాదు, ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. ఆనందం ఒక ప్రయాణం, గమ్యం కాదు అని ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతుంది. ఇక్కడ మేము చెప్తున్నాము –  సంతోషం అనేది మీ లక్ష్యాన్ని, మీ గమ్యాన్ని చేరుకోవడంలోనే కాదు, లక్ష్యం యొక్క ప్రయాణంలో కూడా ఉంటుంది. అలాగే, ఆందోళన చెందిన బుద్ధితో పోలిస్తే తేలికైన మరియు నిర్లిప్తమైన బుద్ధి ఎల్లప్పుడూ పాజిటివ్  పరిస్థితులను ఆకర్షిస్తుంది, అది ఒకరి లక్ష్యాన్ని చేరుకోవడంలో వారధిగా ఉపయోగపడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th april 2024 soul sustenance telugu

మీరు భగవంతుడిని నమ్ముతారా? మీరు వారి ఉనికిని అనుభవం చేసుకుంటున్నారా?

భగవంతుడు మన ఆధ్యాత్మిక తల్లి-తండ్రి మరియు విశ్వంలో అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి. అనేక శతాబ్దాలుగా, భగవంతుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిచే ప్రేమించబడ్డారు, గౌరవించబడ్డారు. అయినప్పటికీ, భగవంతుడు మానవ రచన మరియు వారి ఊహ అని

Read More »
24th april 2024 soul sustenance telugu

తోటివారి ఒత్తిడితో వ్యవహరించడం

సమాజంలో అంగీకారం, గౌరవం పొందడానికి మనం చేసే ప్రయత్నాలలో, సమాజానికి తగ్గట్టుగా ఉండటా నికి ప్రాధాన్యత ఇస్తాము. ఇతరులు చేసేది మనమూ చేయవలసిన అవసరం ఉందని భావిస్తాము. తోటివారి పెట్టే ఒత్తిడి మనం సిద్ధంగా

Read More »
23rd april 2024 soul sustenance telugu

బాహ్య గందరగోళం మరియు ఆంతరిక భావోద్వేగాల నుండి ఉపసం‌హరించుకోవడం

సంకీర్ణ శక్తిని తాబేలు ప్రవర్తనతో పోల్చవచ్చు. ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు, తాబేలు దాని పెంకులోకి (గట్టి బాహ్య రక్షణ పొరలోకి) వెళ్లిపోతుంది. రోజంతటిలో కొన్ని సార్లు లోలోపలికి అడుగు పెట్టి మనల్ని మనం చూసుకోవటమే

Read More »