10th march soul sustenance - telugu

ఒత్తిడి లేని జీవితానికి 5 మెట్లు (భాగం 2)

2 – నేను సమయానికి చేరలేదు … ఇది ఓకే – ఈ రోజుల్లో మన జీవితంలోని ప్రతి అడుగు, పనులు పూర్తి చేయడం మరియు పనులు వేగంగా మరియు మెరుగ్గా జరిగేలా చేయడంగానే చూస్తున్నాము. తొందరపాటుకు సంబంధించిన ప్రతి ఆలోచన మరియు ఆందోళన మన మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని మనం గ్రహించడం లేదు . అలాగే, ఆ సమావేశానికి, అసైన్‌మెంట్‌కి లేదా భోజనానికి ఆలస్యం చేయడం మంచిది. కానీ త్వరపడటం అధ్వాన్నంగా ఉంటుంది, ఎందుకంటే తొందరపాటుతో  మీ మార్గంలో మరింత కఠినమైన షెడ్యూల్‌లను తెస్తుంది, ఎందుకంటే అది మీరు ప్రసరించే శక్తి, అది మీకు తిరిగి వస్తుంది. ఎంత తొందరపడితే, వ్యక్తులు అంత ఎక్కువ ఆ నెగెటివ్ శక్తిని ఫీల్ అయ్యి మీతో అసౌకర్యంగా ఉన్నట్లుగా వారికి అనిపిస్తుంది. అలాగే, మీ మనస్సు, శరీరం మరియు సంబంధాలకు దీర్ఘకాలిక హాని కంటే స్వల్పకాలిక వైఫల్యం మంచిదని గుర్తుంచుకోండి. కాబట్టి, మీ జీవితంలో ముఖ్యమైన పనులను చేయండి, ఆఫీస్ కు కారు డ్రైవ్ చేస్తూ వెళ్ళండి, మీ ఇంటి పని మరియు కార్యాలయ దినచర్యను ముగించండి మరియు బిజీ సామాజిక జీవితాన్ని కూడా గడపండి, కానీ అన్నింటినీ రిలాక్స్‌గా, తొందరపడని మరియు అలసిపోని మానసిక స్థితిలో చేయండి. ఈ విధంగా, మీరు జీవిత క్షణాలను ఆస్వాదిస్తారు, అన్ని స్థాయిలలో దీర్ఘకాలిక విజయాన్ని అందుకుంటారు మరియు డెడ్లైన్లకు  ఇంకా మీ పై ఇతరుల సమయ ఆధారిత అంచనాలకు మీకు ఒత్తిడి అనిపించదు. 

 

స్టెప్ 3 – ఈ విశ్వం ఒక నాటక రంగం మరియు మనమంతా యాక్టర్స్ – ప్రతి ఉదయం నేను ప్రపంచ వేదికపై నటుడిని అని మరియు ఇక్కడ నేను చేసేదంతా నేను పోషించాల్సిన పాత్ర అని మీకు మీరే చెప్పుకోండి. నాటక వేదికపై ఉన్న నటుడు తన పాత్రతో గుర్తించబడరు మరియు ఎన్నటికీ అనుబంధము పెట్టుకోరు. ఆ పాత్ర తాత్కాలికమైనదని మరియు ఆ పాత్రను పోషించిన తర్వాత అతను వాస్తవ స్థితికి, తన ఇంటికి తిరిగి వెళ్లాలని అతనికి తెలుసు. ఒత్తిడికి అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒక ఆలోచన – నేను ఈ పాత్రను, ఇది తప్పుడు చేతనం. దానికి బదులు సరైన చేతనం  ఏమిటంటే నేను ఆత్మను, ఆధ్యాత్మిక నటుడిని మరియు ఈ పాత్ర పోషించడమే నా పని . నా పాత్ర తాత్కాలికమే తప్ప నా నిజస్వరూపం కాదు. వాస్తవంగా నేను గుణాలు మరియు శక్తులతో నిండి ఉన్న జీవం. పాత్రతో ఎంత నిర్లిప్తత ఉంటే, అంత ఒత్తిడి తగ్గుతుంది, పాత్రలో ఉన్నప్పుడు, నేను కోరుకున్న లేదా ఆశించిన విధంగా విషయాలు జరగవు. అలాగే, ప్రతి ఒక్కరూ కూడా నటులే మరియు కొన్నిసార్లు వారి  పని నేను ఊహించినట్లుగా ఉండదు, కానీ నేను తేలికగా ఉంటాను, ఎందుకంటే ప్రతికూల నియంత్రణ కంటే సానుకూల ప్రభావం సులభం అని నాకు తెలుసు. నేను అవతలి వ్యక్తి యొక్క చర్యను నియంత్రించడానికి ప్రయత్నిస్తే, నేను ఒత్తిడితో కూడిన మనస్సు, సంబంధం మరియు వాతావరణాన్ని సృష్టిస్తాను. దానికి బదులుగా నేను ఆ నటుడిని ప్రభావితం చేస్తే, అతనికి మంచి భావాలు మరియు శుభాకాంక్షలను ప్రసరింపజేయడం ద్వారా, అవతలి వ్యక్తి మారి సానుకూలంగా వ్యవహరిస్తాడు మరియు నేను కూడా ఒత్తిడికి దూరంగా ఉంటాను.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th march soul sustenance telugu

24th March – జీవన విలువలు

కర్మ సిద్ధాంతం ఎలా పని చేస్తుంది? మనమందరం ఆధ్యాత్మిక శక్తులం  లేదా ఆత్మలం . ప్రపంచ నాటకంలో వివిధ రకాల కర్మలను చేస్తాము. మనమందరం ప్రపంచ నాటకంలో శరీర బ్రాంతిలో కొన్ని మంచి కర్మలు

Read More »
23rd march soul sustenance telugu

23rd March – జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి మనమందరం గొప్ప వక్తలు కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణమైన సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను

Read More »
22nd march soul sustenance telugu

22nd March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు: శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ

Read More »