మోహం మరియు దాని విభిన్న రకాలను గ్రహించడం (పార్ట్ 2)

మోహం మరియు దాని విభిన్న రకాలను గ్రహించడం (పార్ట్ 2)

బాహ్య విషయాల పై మోహంకు  సంబంధించిన కొన్ని సాధారణ ఉదాహరణలను మేము నిన్న వివరించాము.

అంతర్గతంగా ఉన్న మోహం యొక్క కొన్ని సాధారణ ఉదాహరణలు :

– మీ ఆలోచనలు,

 – మీ నమ్మకాలు,

– మీ అభిప్రాయాలు,

– మీ నిర్ణయం తీసుకోవడం,

– నీ జ్ఞాపకాలు,

– మీరు ఆలోచించే విధానం,

– మీకున్న ప్రత్యేక గుణం లేదా ప్రత్యేకత,

– మీకున్న ప్రత్యేకమైన  శక్తి,

– మీకు  అనుకూలమైన లేదా ప్రతికూలమైన – ఒక నిర్దిష్ట సంస్కారం,

– జీవితంలో మీకున్న  వివిధ రకాలైన జ్ఞానం మరియు సంపాదించిన జ్ఞానం,

మరియు అనేక ఇతర విషయాలు. మేము కొన్ని ఉదాహరణలు చెప్పాము.

మీరు ముడిపడినది బాహ్యమైన వాటికైనా లేదా అంతర్గతమైన వాటికైనా, మోహం యొక్క సంస్కారం ఎల్లప్పుడూ ఆంతరికంగా ఉంటుంది. ఉదా.  మీ ఉద్యోగానికి మిమ్మల్ని మీరు అటాచ్ చేసుకుంటే, మీరు నా పని అని చెబుతారు. మీ ఉద్యోగం బాహ్యమైనది, కానీ మీరు దానిని మీ చేతనంలో ఉంచుకుంటారు. అదే విధంగా మీ బిడ్డతో మీకు మోహం  ఉంటే నా బిడ్డ అని అంటారు. మీ బిడ్డ బయట ఉన్నాడు, కానీ మీరు మీ చేతనంలో అతనికి లేదా ఆమెతో ముడిపడి ఉన్నారు. చివరగా, మీరు మర్యాద మరియు దయ యొక్క మంచి గుణం  కలిగి ఉన్నారు. మీరు నా సంస్కారం అంటారు. ఇది మీ చేతనంలో ఉంది. కానీ మీరు దాని కోసం ప్రశంసించబడినప్పుడు, మీరు దాని అహంకారంతో ఉంటారు. ఇది దానితో మీకున్న మోహం యొక్క సంకేతం. ఈ మోహం మీ చేతనంలో లేదా అంతర్గతంగా కూడా ఉంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »