11th april soul sustenance telugu

మానసిక అలసటను అధిగమించడానికి 5 ఉపాయాలు (భాగం 2)

  1. అవసరమైనప్పుడే ఇతరుల గురించి ఆలోచించండి – మనందరికీ ఉన్న సర్వ సాధారణ అలవాటు – ఇతరుల గురించి అవసరం లేకపోయినా ఆలోచిస్తూ ఉండటం. ఉదాహరణకు, మీ ఆఫీసులో ఉన్న ఒక వ్యక్తి సరిగ్గా పని చేయడం లేదు, తన సమర్థత అనుసారంగా ఉండటం లేదు, అతని పని తీరు నేరుగా కంపెనీ పనితీరును ప్రభావం చేస్తుంది అనుకోండి. మామూలుగా అయితే అతడిని కరెక్ట్ చేయాలి, కంపెనీలో ఉన్న సరైన వ్యక్తుల వద్ద ఇతని పనితీరు గురించి చర్చించాలి. అలా చేసిన తర్వాత, అతడిని చూసిన ప్రతిసారీ మీరు అతడిని నెగిటివ్‌గానే చూడాలా, అతడి గురించి ఎవరితో మాట్లాడినా నెగిటివ్‌గానే చర్చించాలా? దీనిని అనవసరమైన లేక వృధా చర్చ అంటారు. ఇలాంటివారు మన జీవితంలో చాలామందే ఉంటారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, సహోద్యోగుల మీద నెగిటివ్ నిండిన ఆలోచనలు ఉంటే అవి మనసుకు అలసటను తీసుకురావా? కావున, ఫుల్‌స్టాప్ పెట్టండి, అనవసరమైన ప్రశ్నలకు, ఆశ్చర్యాలకు దూరంగా ఉండండి, ఆలోచనలు తక్కువగా పెట్టుకోండి. ఇతరుల పట్ల ఉన్న ప్రతికూల ఆలోచనలను మార్చి ఆ స్థానంలో ఇతరులలోని ప్రత్యేకతలు, సుగుణాలు, నైపుణ్యాలు మరియు సానుకూల వ్యక్తిత్వం గురించిన ఆలోచనలు చేయండి తద్వారా మీరు అలసిపోరు, మానసిక అలసట కలగదు.
  2. అహంకారాన్ని త్యజించండి, స్వేచ్ఛగా జీవించండి – మనం మన భావోద్వేగాల తలలో లేక మనసులలో మోసే అతి పెద్ద బరువు – మనలోని సూక్ష్మ అహంకారం. ఈరోజు ఉదయం నా సహోద్యోగి నేను వేసుకున్న వస్త్రాల గురించి నెగిటివ్‌గా మాట్లాడింది. తను విమర్శించింది, ఆ తర్వాత నేను తనను రోజంతా చూడలేదు. కానీ తాను చేసిన విమర్శను మాత్రం నేను రోజంతా నా మనసులో, హృదయంలో మోస్తూనే ఉన్నాను. ఇదేదో నేను పొందిన అతి పెద్ద అవమానంలాగా భావిస్తున్నాను. ఎక్కడ ఎక్కువ అహంకారం ఉంటుందో అక్కడ అంత ఎక్కువ అవమాన భావం ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే నేను నా సానుకూల స్వ చిత్రంతో బాగా ముడిపడి ఉన్నాను. ఎవరైనా నా ఈ స్వ చిత్రాన్ని అగౌరవపరుస్తూ ఒక చిన్న మాట అన్నా నేను భరించలేను. కనుక, మధురంగా, వినయంగా, మంచిగా ఉండండి – ఈ సుగుణాలున్న వ్యక్తి వ్యక్తుల విమర్శలకు నెగిటివ్‌గా ప్రభావితమవ్వకుండా అందరినీ ప్రేమిస్తాడు. వంగి ఉండండి, వినయంతో ఉండండి. అవమానపడ్డాను అన్న మీ అతి ఆలోచనలు తగ్గి మీ మనసు తేలిక అవుతుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »