Hin

ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ (పార్ట్ 5)

ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ (పార్ట్ 5)

మన వైబ్రేషన్స్ మన ప్రపంచాన్ని మార్చగలవు

ఆశీర్వాదం అంటే సంకల్పాలగా చేసే, పదాలలో వ్యక్తపరిచే ఉన్నతమైన, స్వచ్ఛమైన శక్తి లేదా వైబ్రేషన్. మన ఆశీర్వాదం ఒక వ్యక్తికి కావచ్చు, ఒక గ్రూప్ కి కావచ్చు, మొత్తం దేశ జనాభాకు కావచ్చు లేదా మొత్తం విశ్వానికి కావచ్చు, ఎవరికైతే వారికి ఖచ్చితంగా వారికి చేరుతుంది. అది ప్రపంచంలోని సుదూర మూలకు కూడా ప్రయాణించగల శక్తి. నేడు, మన ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ మరియు ఆనందం యొక్క ఆశీర్వాదాలు అవసరం. మనలో ప్రతి ఒక్కరూ మన వంతు సహకారాన్ని అందించినా పెద్ద మార్పు తీసుకురావచ్చు. మనం ఇతరులకు ఆశీర్వాదాల శక్తిని ఇస్తే, మనం ఖచ్చితంగా ప్రపంచ వైబ్రేషన్స్ ను మార్చగలము. ఆశీర్వాదాలు ఇవ్వడానికి, మనం ప్రతిరోజూ కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చోవచ్చు. ఈ కొన్ని నిమిషాల్లో మనం స్వచ్ఛమైన,  శక్తివంతమైన ఆలోచనలను విజువలైజ్ చేసి వాటిని వాస్తవికతగా భావించాలి. ప్రపంచాన్ని స్వస్థపరిచి, మార్చడానికి కొన్ని ఆలోచనలు క్రింద ఉన్నాయి –

  1. భగవంతుడు శాంతి సాగరుడు.  నేను శాంతి స్వరూప ఆత్మను. నేను వారితో కనెక్ట్ అయ్యి  వారి నుండి శాంతిని నింపుకుంటాను. నేను నా ముందు భూగోళాన్ని ఉంచి ప్రపంచంలోని అందరికి శాంతిని ప్రసరింపజేస్తాను. విశ్వంలో ఉన్న ప్రతి ఆత్మ భగవంతుని శాంతి వైబ్రేషన్స్ అందుకుంటుంది. శాంతి ప్రతి వ్యక్తి యొక్క సహజ జీవన విధానం. హింస మరియు యుద్ధం ఉన్న అన్ని ప్రదేశాలను నేను ఏమర్జ్ చేసుకుంటున్నాను … నేను వాటిని భగవంతుని ప్రేమ మరియు శాంతితో నింపుతున్నాను. ప్రపంచం యొక్క వైబ్రేషన్స్ శాంతిగా మారాయి.
  2. భగవంతుడు పవిత్రతా సాగరుడు. నేను స్వచ్ఛమైన ఆత్మను. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం – పంచ తత్వాలకు భగవంతుని స్వచ్ఛత ప్రసరిస్తుంది. భగవంతుని శక్తితో శుద్ధి చేయబడుతున్నాయి. ప్రకృతి మానవునితో సామరస్యంగా ఉంటుంది. ఆత్మలందరూ ప్రకృతిని గౌరవిస్తున్నారు. ప్రకృతి అందరికీ సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది.
  3. భగవంతుడు శక్తి సాగరుడు. నేను శక్తివంతమైన ఆత్మను. భగవంతుని శక్తులు ప్రతి ఒక్కరికీ ప్రసరిస్తాయి … ఆత్మలందరూ  శక్తివంతంగా ఉన్నారు. ప్రతి ఆత్మ వారి శరీరంలో ప్రతి కణానికి స్వచ్ఛమైన, శక్తివంతమైన వైబ్రేషన్స్ ను ప్రసరిస్తున్నారు. విశ్వంలో ప్రతి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సంపూర్ణ శారీరక మరియు మానసిక ఆరోగ్యం అందరికీ సహజం.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th april 2025 soul sustenance telugu

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత,

Read More »
24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »