చికాకును అధిగమించడానికి విధానాలు

చికాకును అధిగమించడానికి విధానాలు

మనం ఉత్తమంగా లేని సమయాలు ఉన్నాయి, ఎప్పుడైతే మనం మన శాంతిని కోల్పోయి చాలా చిరాకుగా అనిపిస్తున్న సమయాలు. చికాకు అనేది ఏదో సరిగ్గా లేదని మరియు దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. చికాకు రెచ్చగొట్టడం, ఒత్తిడి, నొప్పి, గందరగోళం వలన కానీ కొన్ని సార్లు ఏ  స్పష్టమైన కారణం లేకుండా రావచ్చు. మనం చెక్ చేసుకోకపోతే, చిరాకు అలవాటై పోయి మన రోజువారీ పనులలో కూడా ఆటంకం కలిగిస్తుంది మరియు సంబంధాలను దెబ్బతీస్తుంది. తరచుగా మనం చిరాకు పడతాము మరియు మన భావాలను కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడతాము. మానసిక అలసట, ఒత్తిడి, అభద్రత మరియు ఆందోళన వల్ల చికాకు వస్తుంది. ఈ ఎమోషన్స్ తో పోరాడుతున్నప్పుడు, మనకు నచ్చనిది ఏదైనా జరిగితే మనం ఇంకా చికాకు పడతాము. ఎవరైనా బిగ్గరగా నమలడం, లేదా ఎవరైనా ట్రాఫిక్ వద్ద హారన్ చేయడం వంటివి కూడా మనకు గంటల తరబడి చికాకు కలిగిస్తాయి.

చికాకును అధిగమించడానికి ఈ విధానలను అనుసరించండి –

  1. త్వరగా మేల్కొని  మీతో మీరు 30 నిమిషాలు గడపండి. మెడిటేషన్ మరియు ఆధ్యాత్మిక అధ్యయనంతో మనస్సును పోషించుకోండి. ఇది ప్రతి పరిస్థితిలో సరిగ్గా ఆలోచించడానికి మరియు మంచిని అనుభూతి చెందడానికి మీకు సహాయపడుతుంది.
  2. కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన శరీరం సంతోషకరమైన మనస్సును ప్రోత్సహిస్తుంది.
  3. ప్రతి గంట లేదా రెండు గంటల తర్వాత పాజ్ చేసి నేను శాంతి స్వరూప ఆత్మను – అంతా పర్ఫెక్ట్ గా  ఉంది అని మీకు మీరు గుర్తు చేసుకోండి.  
  4. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోండి. శ్రద్ధగా తినండి, పరధ్యానానికి దూరంగా ఉండండి మరియు నిర్ణీత సమయాల్లో మాత్రమే తినండి.
  5. తగినంత నిద్ర షెడ్యూల్‌ను సెట్ చేసుకోండి, రోజూ నిర్దిష్ట సమయానికి నిద్రపోండి  మరియు మేల్కొండి.  
  6. వ్యక్తులను ప్రభావితం చేయడానికి, వారి ప్రవర్తన మరియు విధానాలు మీకు భిన్నంగా ఉంటాయని అర్థం చేసుకోండి. ఆ భేదాలను గౌరవించండి. అవసరమైనప్పుడు వారికి సలహా ఇవ్వండి, కానీ దాని ఫలితం గురించి అతీతంగా ఉండండి.

మీరు మనస్సు మరియు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, మీరు పరిస్థితుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు వాటిని ప్రశాంతంగా ఎదుర్కొంటారు. ఓర్పు, స్పష్టత సహజంగా వస్తాయి. చికాకును అధిగమించడానికి ఈ సంకల్పాలను అనుభూతి చేయండి-

నేను శాంతి స్వరూప ఆత్మను… నేను ప్రతి ఉదయం నా మనస్సుకు శిక్షణ ఇస్తాను … నేను రోజంటిలో నా మనస్సును  జాగ్రత్తగా ఉపయోగిస్తాను … నేను ప్రతిరోజూ నా శరీరాన్ని శక్తివంతం చేస్తాను … నేను సరైన ఆహారం తీసుకుంటాను … నేను బాగా నిద్రపోతాను … నేను సాధించాల్సింది చాలా ఉంది … నాకు చాలా సమయం ఉంది … నేను పనిని … ఓపికగా .. పూర్తి చేస్తాను… ఎటువంటి పరిస్థితిలోనైన  కూడా … నా వైబ్రేషన్స్ ప్రశాంతంగా ఉంటాయి … నేను పరిస్థితులకు యాజమానిని.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »