సంఘర్షణ తర్వాత సాధారణ సంభాషణకు తిరిగి రావడం

సంఘర్షణ తర్వాత సాధారణ సంభాషణకు తిరిగి రావడం

వాగ్వివాదం లేదా సంఘర్షణ జరిగిప్పుడు, మనలో కొందరు డిఫెన్స్ మెకానిజం లేదా కంట్రోల్ మెకానిజంగా  సైలెంట్ ట్రీట్మెంట్ ను ఉపయోగిస్తాము. ఆ మాటలు లేకపోయిన రోజులు లేదా వారాలు ఇబ్బందికరమైనవి మరియు అనారోగ్యకరమైనవి, ఎందుకంటే మనం నెగెటివ్ ఆలోచనలకు అతుక్కుపోతాము, వాతావరణాన్ని భారీ వైబ్రేషన్స్ తో నింపుతాము.  అందరినీ క్షీణింపజేస్తాము. కుటుంబం లేదా స్నేహితులతో వాగ్వివాదం తర్వాత, మీరు అతిగా ఎమోషన్స్  అవుతారా? మీ మనస్సులో పగ మరియు ప్రతీకారం యొక్క తప్పుడు ఆలోచనలతో నిండి పోతుందా? మీరు గంటలు, రోజులు లేదా నెలల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి నిరాకరిస్తారా? వివాదం తర్వాత మనం  తరచుగా మాట్లాడటం మానేస్తాము, సంపూర్ణ నిశ్శబ్దం మన అభిప్రాయాన్ని తెలియజేయదానికి సహాయపడుతుందని, మనసును కుదుట పరచడానికి మరియు వాస్తవం గ్రహించడానికి మనకు సమయాన్ని ఇస్తుందని నమ్ముతాము. ఈ మౌన యుద్ధం జరుగుతున్న సమయంలో మనస్సు భారీగా అయ్యి విషపూరితమైన ఆలోచనలను ఆలోచిస్తాము, ఇటీవలి గాయాలను మళ్ళీ గుర్తుచేసుకుంటాము , మరింత నొప్పిని కలిగించి పరస్పరంలో తిరస్కార భావం కలిగిస్తుంది. ఈ వైబ్రేషన్స్ అందరి మనస్సు మరియు శరీరానికి హానికరం. సమస్యను పక్కన పెడదాం, మన అహాన్ని పక్కన పెట్టి మన సాధారణ ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనకు తిరిగి వద్దాం. మనమే ముందుకు వచ్చి మాట్లాడాలి, ఏమీ జరగని విధంగా తిరిగి మాట్లాడాలి  . ఎందుకంటే, వారు మన ప్రియమైనవారు మరియు శ్రేయోభిలాషులు. వారి శ్రేయస్సు మన  ప్రాధాన్యత మరియు మన శ్రేయస్సు వారి ప్రాధాన్యత. కమ్యూనికేషన్‌ను పునఃప్రారంభించడం అనేది సంబంధాన్ని కాపాడుకోవడానికి సులభమైన మార్గం. ఇది ఇరువురి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా ఇంట్లో లేదా మన కార్యాలయంలో సరైన సంస్కృతిని తయారు చేస్తుంది.

మీరు అందరి పై శ్రద్ధ చూపించే వారని గుర్తుంచుకోండి. మీ కుటుంబం మరియు స్నేహితుల ఆనందం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొన్నిసార్లు వారు మీతో సరిపోలని విభిన్న అభిప్రాయాలను కలిగి ఉంటారు. మీరు మీ దృక్కోణాన్ని తెలియజేస్తారు మరియు వారు వారి అభిప్రాయాలకు ఆటాచ్ అయితే వారు మీతో ఏకీభవించరు. మీరు ఏది చెప్పాలనుకున్నా స్థిరత్వంతో చెప్పండి. మీరు వారి అభిప్రాయాలతో ఏకీభవించనప్పటికీ వారిని గౌరవించండి. ఆ సంఘటన  తర్వాత వెంటనే మీ మనస్సును క్లియర్ చేసుకొని చుట్టూ ఉన్న ఎనర్జీని మార్చండి. వ్యత్యాసాలను ఆరోగ్యకరమైన మార్గంలో పరిష్కరించుకోండి మరియు నెగెటివ్ నిశ్శబ్దం ఎప్పుడూ రానివద్దు. మీ సాధారణ స్థితికి, ప్రశాంతంగా మరియు రిలాక్స్‌గా తిరిగి వెళ్లండి. వెంటనే స్వయంగా మీరే వారితో మాట్లాడండి మరియు వారు మీతో మాట్లాడాలని వేచి ఉండకండి. మీ ఇద్దరి మధ్య ఇబ్బందికరమైనది ఏమీ జరగనట్లుగా ఉండండి. మీ షరతులేని  ప్రేమ మరియు గౌరవం వారిని నయం చేస్తుంది. సంబంధాన్ని నయం చేసి సామరస్యాన్ని పునరుద్ధరించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »