మోహం మరియు దాని విభిన్న రకాలను గ్రహించడం (పార్ట్ 3)

మోహం మరియు దాని విభిన్న రకాలను గ్రహించడం (పార్ట్ 3)

ప్రతిసారీ బాహ్యమైన లేదా అంతర్గతమైన దేనితోనైనా మనల్ని మనం అటాచ్ చేసుకున్నప్పుడు, మనం భయాలను సృష్టిస్తాము, వాటిలో ప్రధానమైనది నేను బాగా అటాచ్ అయ్యి ఉన్నదాని  గురించి భయపడటం. మోహం భయాన్ని మాత్రమే కాకుండా దానితో పాటు కోపం, అహం, దుఃఖం, అసూయ, దురాశ, ద్వేషం మొదలైన ఎమోషన్స్ ను కూడా తెస్తుంది. ఈ ఎమోషన్స్ కు ఆధారం మోహం, ఇవి అభద్రత మరియు అసంతృప్తిని కలిగిస్తాయి.

మోహం అనేది మన చేతనంలో చాలా లోతుగా పొందపరచబడిన సంస్కారం, అది మనకు నార్మల్ గా అనిపిస్తుంది. ఇది కేవలం సంస్కారమే కానీ దానికి అపారమైన శక్తి ఉంది. అది మనల్ని మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా బంధించగలుగుతుంది, కానీ చాలాసార్లు మనం బంధింపబడి ఉన్నామని కూడా మనం గుర్తించము. ఈ రకమైన మోహంతో ఉన్నపుడు  నెగెటివ్ ఎమోషన్స్ ఆంతరిక మానసిక ఒత్తిడి లేదా లోలోపల శూన్యతను కలిగిస్తాయి. కొన్నిసార్లు మనల్ని పూర్తిగా నిస్సహాయంగా మరియు మానసికంగా బలహీనంగా భావించేలా చేస్తాయి. మన చేతనాన్ని నెగెటివ్ గా దెబ్బతీస్తాయి. అనేక జన్మలుగా, మనం మొహాన్ని మరియు దానితో కనెక్ట్ అయి ఉన్న అనేక రకాల బాధలకు ఎంతగానో అలవాటు పడ్డాము, అది మానవ వ్యక్తిత్వం మరియు మానవ జీవితంలో అంతర్భాగమని మనం నమ్మడం ప్రారంభించాము. అందుకే అదంతా సహజం అనుకున్నాము.  కాబట్టి మనం మోహం అనే సంస్కారంతో కొనసాగుతూ దానిని బలోపేతం చేస్తూనే ఉన్నాము, అది తీసివేయబడాలని ఎప్పుడూ ఆలోచించము. మన ఆరోగ్యం, పని మరియు సంబంధాలు కూడా నెగెటివ్ గా ప్రభావితం అయ్యేంత వరకు అంతర్గత ఒత్తిడి మరియు అసంతృప్తితో మనము దీనితో ఉంటాము. స్వయం యొక్క సహజ స్థితి స్వతంత్రంగా ఉంటూ దేనితోనూ అటాచ్ అవకుండా ఉండడం. అటాచ్‌మెంట్‌లు, బాహ్యమైనా లేదా అంతర్గతమైన దేనికైనా, జనన-మరణ చక్రంలో వేర్వేరు సమయాల్లో పొందబడ్డాయి.  అవి సహజమైనవి కావు మరియు ఆది నుండి లేవు. గత రెండు రోజుల మెసేజ్‌లలో పేర్కొన్న అన్ని విషయాలు మొదటి నుండి ఉన్నాయి కానీ మోహం మొదటి నుండి లేదు. ప్రస్తుత బాధలు అటాచ్‌మెంట్ అసాధారణమైనదని మరియు  సహజమైనది కాదని మనకు సూచిస్తున్నాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »