Hin

12th april soul sustenance telugu

మానసిక అలసటను అధిగమించడానికి 5 ఉపాయాలు (భాగం 3)

  1. జీవితాన్ని ఒక చక్కని ప్రయాణంలా భావిస్తూ పరిస్థితుల భారాలు లేకుండా చూసుకోండి – జీవితం భారంగా ఉండకుండా ఉండాలంటే ఒక ముఖ్యమైన అభ్యాసము – ప్రయాణాన్ని ఆస్వాదించండి. సైడ్ సీన్లు లేని ప్రయాణాన్ని ఎప్పుడైనా చూసారా? అలాగే, జీవిత ప్రయాణము ఎప్పుడూ సైడ్ సీన్లతో ఉంటుంది, అయితే అవి కొన్ని నెగిటివ్ అయితే మరికొన్ని పాజిటివ్. ఏ దృశ్యం ఎప్పటికీ నిలిచిపోదు అన్న మాట గుర్తుంచుకోండి. కనుక, ఏ దృశ్యాన్ని చూస్తున్నాగానీ, కలవరం, చింత నుండి దూరంగా ఉండండి ఎందుకంటే మన జీవిత అనుభవం మనకు చెప్పిన పాఠం – ఇది కూడా మారుతుంది. వర్తమానం గతంగా మారుతుంది, భవిష్యత్తు చక్కగా ఉండబోతుంది. ఏ ప్రతికూల పరిస్థితి ఎప్పటికీ ఉండిపోదు. శాంతి నిండిన ఓర్పుతో కూడుకున్న నిరీక్షణ నెగిటివ్ దృశ్యాన్ని మాయం చేసేస్తుంది, సుందరమైన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఇదే జీవిత సిద్ధాంతం. అలాగే, సైడ్ సీన్ల నుండి మనం ఎంత ఉపరామంగా ఉంటామో అంతగా మనం సంతోషంగా, పూర్తి తేలిగ్గా ఉంటాము.
  2. మీ ఆలోచనలు మీ జీవితాన్ని తయారు చేస్తాయి – మీకు మీరే పర్యవేక్షకునిగా అవ్వండి – తక్కువ ఆలోచనలు, పాజిటివ్ మనసు, తేలిగ్గా మరియు మానసిక అలసట లేని జీవితం కావాలంటే ఒక ముఖ్యమైన అంశంపై శ్రద్ధ పెట్టండి – మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండటము. ఒకటి, ప్రతికూల ఆలోచనలు వస్తుంటే, వాటి సంఖ్య పెరుగుతుంటే వాటి దిశను మార్చి సానుకూలంగా ఆలోచించడము. ఇందుకోసం ఒక పుస్తకాన్ని పెట్టుకోండి, లేదా మొబైల్, లాప్‌టాప్‌లో మంచి సాహిత్యాన్ని చదవండి. రోజంతటిలో మధ్యమధ్యలో ఇది చదవండి. రోజుకు 4-5 సార్లు చదవండి, అప్పుడు ఆలోచనల దిశను సులువుగా మార్చగలరు. అలాగే, మీ రోజు ముగిసే సమయంలో, రోజంతా వచ్చిన ఆలోచనలను ఒకసారి సమీక్షించండి, మరుసటి రోజు కోసం ఏవైనా సవరణలు ఉంటే సవరించుకోండి. మరుసటి రోజు ఉదయం, ఆ రోజంతా చేయవలసిన పనులను ప్లాన్ చేసుకోండి, మధ్యమధ్యలో బ్రేక్ తీసుకుని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »