ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ (పార్ట్ 6)

ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ (పార్ట్ 6)

ఆలోచనలు, పదాలు మరియు కర్మలతో సేవ

ఇతరులకు సేవ చేయడం మన స్వభావం. ప్రపంచవ్యాప్తంగా బాధలో ఉన్న వ్యక్తుల గురించి మనకు తెలిసినప్పుడు మనం వారికి భౌతికంగా, ఆర్థికంగా సహాయం చేస్తాము. కానీ మనం కొన్ని సమయాలలో, కొంతమందికి మాత్రమే ఆ విధంగా సహాయం చేయగలం. మనం చేసే సహాయం ప్రతిసారీ అందరికీ చేరదు. వివిధ రకాల సేవలు –

  1. కర్మల ద్వారా సేవ – ఇతరుల ప్రయోజనం కోసం మన సమయం, నైపుణ్యాలు మరియు ప్రతిభను అందించడం లేదా ఆర్థిక సహకారం చేయడం కర్మల ద్వారా సేవ.
  2. మాటల ద్వారా సేవ – ఆధ్యాత్మిక జ్ఞానం, అనుభవాలు లేదా సలహాలను పంచుకోవడం అంటే మాటల ద్వారా సేవ చేయడం.
  3. సంకల్పాల ద్వారా సేవ – ప్రార్థిస్తున్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు లేదా భగవంతుని స్మరించేటప్పుడు, ఆంతరికంగా శాంతి, ప్రేమ మరియు ఆనందం యొక్క వైబ్రేషన్స్ ను మనుష్యులకు  మరియు ప్రపంచానికి ప్రసరింపజేయడమే సంకల్పాల ద్వారా సేవ చేయడం. శాంతి, ప్రేమ మరియు ఆనందంతో జీవించడం ద్వారా, మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన వైబ్రేషన్స్ ప్రతి క్షణం ప్రపంచంలోకి ప్రసరిస్తాయి. ఈ సేవ ఎల్లప్పుడూ చేయవచ్చు మరియు ప్రతి ఒక్కరికి చేరుతుంది.

స్వచ్ఛమైన వైబ్రేషన్స్ లేదా ఆశీర్వాదాలను ఇవ్వడానికి, మనం ప్రతిరోజూ ఉదయం కొన్ని నిమిషాలు కేటాయించవచ్చు లేదా రోజులో ఎప్పుడైనా అనగా వంట చేసేటప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా నడిచేటప్పుడు కూడా చేయవచ్చు. ముందుగా మన ఆశీర్వాదాలను పంపడానికి వ్యక్తిని మరియు ఉద్దేశ్యాన్ని ఎంచుకోవాలి. ఇది బాధలో ఉన్న కుటుంబ సభ్యుని కోసం, పొరుగువారి కోసం, మనం విన్న లేదా చూసిన అపరిచితుడి కోసం, ఒక నగరం కోసం లేదా సంక్షోభంలో ఉన్న మొత్తం దేశం కోసం లేదా ప్రపంచం కోసం కావచ్చు. మనం ఆశీర్వదించగల మరియు నయం చేయగల వ్యక్తుల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. అదే మనకున్న శక్తి. మనం వ్యక్తిగతంగా లేదా గ్రూప్ గా ఆశీర్వాదాలను పంపవచ్చు. మనం కుటుంబ సమేతంగా, పిల్లలు వారి పాఠశాల ప్రార్థనల సమయంలో చేయవచ్చు లేదా స్నేహితుల గ్రూప్ లేదా కార్యాలయ సహోద్యోగులు ఒకరితో ఒకరు చేయవచ్చు. సామూహిక వైబ్రేషన్స్ శక్తిని పెంచి ఫలితాలు వేగంగా ఉంటాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »