12th feb soul sustenance telugu - brahma kumaris | official

ఆరోగ్యకరమైన గుండె కోసం 5 ఆధ్యాత్మిక చిట్కాలు

1. ఒత్తిడి లేని జీవితాన్ని అనుభూతి చెందుతూ తేలికగా ఉండండి – గుండె సమస్యలను కలిగించడంలో ఒత్తిడి అత్యంత ప్రభావవంతమైన కారణాలలో ఒకటి. మనం మెడిటేషన్ ఎంత ఎక్కువగా చేస్తూ మన ఆలోచనలను నియంత్రించుకుంటూ తక్కువగా ఆలోచిస్తే , పాజిటివ్ గా మరియు శక్తివంతంగా ఎలా ఉంచుకోవాలో నేర్చుకుంటే, మన మనస్సు మరింత తేలికగా మరియు రిలాక్స్‌గా ఉంటుంది. ఇది మన గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు గుండె సజావుగా పని చేస్తుంది.
2. సమయ స్పృహ నుండి విముక్తి పొంది ఆత్మ స్పృహతో ఉండండి – రోజులో వివిధ పనులు త్వరగా జరగాలని ఆందోళన చెందడం వల్ల మన గుండెపై నిరంతరం ఒత్తిడి పడుతుంది. ఇది కొంత కాలానికి గుండె సమస్యలకు దారితీస్తుంది. ఆధ్యాత్మికత నిరంతరం గడియారంతో పాటు పరుగెత్తడానికి బదులుగా ప్రతి పనిలో ఆత్మికత మరియు ఆత్మ యొక్క పాజిటివ్ గుణాల అనుభూతిని నేర్పుతుంది.
3. శాకాహారిగా అయ్యి శరీరానికి స్వచ్ఛమైన ఆహారం అందించండి – శాకాహార ఆహారం మరియు పొగాకు మరియు ఆల్కహాల్ లేని జీవనశైలి మనం మన శరీరానికి ఇవ్వగల ఉత్తమ బహుమతులలో ఒకటి. ఇది గుండెకు అనేక ప్రయోజనాలతో పాటు స్వచ్ఛమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. శరీరం ప్రశాంతమైన ప్రకంపనలతో నిండి ఉంటుంది. ఇది మన స్వభావాన్ని మరింత శాంతిగా , మరింత ముందస్తు ఆలోచన కలిగినవారిగా మరియు నిరహంకారిగా చేస్తుంది. మన గుండెను మరింత పాజిటివ్గా ప్రభావితం చేస్తుంది.
4. ప్రతి సంబంధంలో ఆనందం మరియు సంతృప్తిని అనుభవించండి – కుటుంబంలో లేదా కార్యాలయంలో విభిన్న స్వభావాల వ్యక్తులతో వ్యవహరించడంలో మరియు వారితో కలిసి పని చేయడంలో ఆందోళన చెందడం అనేది గుండెపై చాలా పెద్ద ప్రతికూల ప్రభావం చూపుతుంది . ప్రతిరోజూ చదివే లేదా వినే ఆధ్యాత్మిక జ్ఞానం సహాయంతో ప్రతి ఆత్మ యొక్క విశేషతలను చూడటం, మనం నిరంతరం ఆనందంగా ఉండడంలో మరియు ఒత్తిడి నుండి విముక్తి పొందడంలో సహాయపడుతుంది.
5. జీవితంలోని ప్రతి క్షణానికి కృతజ్ఞత కలిగి ఉండండి మరియు దానిని ప్రత్యేకంగా చేయండి – మీరు ఉదయం లేచిన వెంటనే , జీవితంలో ప్రతిదానికీ మరియు ప్రతి ఒక్కరికీ మీ మనసులో కృతజ్ఞత యొక్క అందమైన అనుభవాన్ని తయారు చేయండి . అలాగే, రోజులో ఇస్తూనే ఉండండి మరియు మీ మంచితనం యొక్క శక్తిని జీవితంలోకి ప్రవహించనివ్వండి. ఇది మిమ్మల్ని ఆనంద స్థితిలో మరియు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »