మేధావి ఏలా తయారవుతారు : నేర్చుకున్న ప్రతిభ లేదా స్వాభావిక ప్రతిభ?

మేధావి ఏలా తయారవుతారు : నేర్చుకున్న ప్రతిభ లేదా స్వాభావిక ప్రతిభ?

చాలా సార్లు మనం కొంతమంది పిల్లలలో సృజనాత్మక లేదా పండిత సామర్థ్యాలను చూస్తాము, వారిని బాల మేధావులని అంటాము . వారు ఏదో ఒక నైపుణ్యంలో మేధావులు. 4 ఏళ్ల పిల్లవాడు అద్భుతంగా పియానోపై లాంగ్ నోట్స్ వాయిస్తాడు, 7 ఏళ్ల చిన్నారి కఠినమైన సాఫ్ట్‌వేర్ కోడ్‌ను వ్రాస్తుంది, మరొకరు 5 సంవత్సరాల వయస్సులో గ్రంథాల నుండి శ్లోకాలను పఠిస్తారు. వారి కుటుంబంలో ఎవరూ ఆ నైపుణ్యంలో మొగ్గు చూపనప్పటికీ  లేదా శిక్షణ పొందనప్పటికీ ఆ  నైపుణ్యాలను వారు ఎప్పుడు మరియు ఎవరి నుండి నేర్చుకున్నారు?  అలాగే, చాలా మంది ప్రసిద్ధ కళాకారులు, సంగీతకారులు, ఇంజనీర్లు, క్రీడాకారులు వారి తల్లిదండ్రులు లేదా కుటుంబం నుండి వారసత్వంగా ఆ విద్యను పొందనప్పటికీ చాలా చిన్న వయస్సులో వారి ప్రతిభను తరచుగా ప్రదర్శిస్తారు. 

శరీరాన్ని తీసుకున్న తర్వాత ఆత్మ చేసే ప్రతి చర్య ఆత్మలో సంస్కారం లేదా అలవాటుగా రికార్డు చేయబడుతుందని ఆధ్యాత్మిక జ్ఞానం మనకు బోధిస్తుంది. మన సంస్కారాలు మన స్వభావం, ప్రతిభ మరియు అభిరుచుల కలయిక.  ఈ సంస్కారాలు తరువాత జన్మలలోకి తీసుకువెళ్ళబడతాయి మరియు కొత్త జన్మలలో కార్యరూపం దాల్చుతాయి. ఈ అవగాహనను ద్వారా అర్ధం అయింది ఏమిటంటే ఆ బాలమేధావిలోని ప్రతిభ అతని లేదా ఆమె పూర్వ జన్మలో నేర్చుకుని,ప్రావీణ్యం పొందింది.  ఆత్మలో రికార్డు చేయబడిన  ప్రతిభ మరు జన్మకు తీసుకువెళతారు. కొన్ని సందర్భాల్లో ఆత్మ ఈ జన్మలో బాల్యంలోనే ప్రతిభను తిరిగి కనపరుస్తుంది. సంక్షిప్తంగా, మేధావి ఒక అనుభవం. ఇది వరం లేదా ప్రతిభ అని మనం  భావిస్తాము, కానీ ఇది అనేక జన్మల లోతైన మరియు సుదీర్ఘ అనుభవం యొక్క ఫలం. మనలో కొందరు ఇతరుల కంటే పాత ఆత్మలు, ఎందుకంటే మనం ప్రపంచ వేదికపై ఎక్కువ కాలం ఉన్నాము మరియు అందువల్ల ఎక్కువ సంఖ్యలో జన్మల ప్రయాణాన్ని కవర్ చేసాము. అలాంటి ఆత్మలు ఇతరులకన్నా చాలా లోతైన మరియు సుధీర్ఘ మైన  అనుభవాలను తనతో ముందుకు తీసుకువెళతాయి. తల్లిదండ్రులకు ఈ అవగాహన ఉండడం వలన పిల్లలను వారు కోరుకున్న విధంగానే ఉండాలని ఆశించే బదులు వారిలోని స్వాభావిక ప్రతిభను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులకు సహాయపడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »