12th march soul sustenance telugu

మీ ఆలోచనలను సర్దుకునే కళ

మనం ఒక సన్నివేశం నుండి మరొక దృశ్యానికి ప్రయాణిస్తున్నప్పుడు, మన మనస్సులో మనం మోసుకెళ్ళే ఆలోచనలు మరియు భావోద్వేగాలను మనం జాగ్రత్తగా పరిశీలించు కుంటామా? ఏ రోజును మనం చూసుకున్న మన ఆలోచనలు మరియు భావోద్వేగాలు వ్యక్తులు, సంఘటనలు మరియు వస్తువుల చుట్టూ ఉంటాయి. దీని కారణంగా మానసిక భారం నుండి సర్దుకోవడానికి లేదా దూరం అవడానికి మన మనస్సు కష్టపడుతుంది.

  1. పాజ్ చేసి, మీ మానసిక సామాను ఎంత లోడ్ అయ్యిందో చెక్ చేసుకోండి – సంబంధ సమస్యలు, మీ కార్యాలయంలో సవాళ్లు, ఆరోగ్య సమస్యలు, ఊహించని అంచనాలు, పుకారులు, సోషల్ మీడియా నుండి మెసేజస్, ప్రపంచం నుండి నెగెటివ్ వార్తలు … ఇది పెద్ద జాబితా మరియు వీటిలో ఏదీ మీకు సరైనవి లేదా ఆరోగ్యకరమైనవి కావు.
  2. మీరు మీ భావోద్వేగ బరువును సరిగ్గా ప్యాక్ చేయకపోతే, మీ ప్రస్తుత అనుభవాలు మీ గతం ద్వారా ప్రభావితమవుతాయి, ఇది నెగెటివ్ గా లేదా అనవసరమైనవిగా ఉండవచ్చు. ఇది మిమ్మల్ని వ్యక్తులతో లేదా ప్రస్తుత పరిస్థితులను గతం యొక్క ఆధారంతో చూసేలా చేస్తుంది. 
  3. ప్రతి ఉదయం మరియు రాత్రి నిద్రపోయే ముందు మెడిటేషన్ చేసి ఆత్మపరిశీలన చేసుకోండి.  రోజులో మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు చెక్ చేయండి, సర్దుకునే శక్తిని పెంచుకోండి. ఇలా చేయడం వల్ల రోజులో వృధా ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టగలరు. మీరు ప్రయోజనకరంగా లేని వాటిని వదిలేయ వచ్చు – గత బాధలు, మోహాలు, అంచనాలు, తప్పుడు అలవాట్లు, పరిమిత విశ్వాసాలు, బాహ్య ప్రభావాలు.
  4. వ్యక్తులు, వస్తువులు, సంపద మరియు వివిధ సాంకేతిక మాధ్యమాలతో జీవించండి మరియు మీరు కలిగి ఉన్న వాటిని ఆస్వాదించండి. కానీ వాటితో అటాచ్ అవకండి. ప్రతి గంట తర్వాత, ఏవైనా అసౌకర్య ఆలోచనలు మరియు భావాలను ఉన్నాయేమో చెక్ చేసుకొని, వాటిని విడిచి పెట్టండి. క్షమించి, వదిలిపెట్టి ముందుకు సాగండి. ముందున్న ప్రయాణాన్ని  ఆనందించండి. శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తితో మిమ్మల్ని నింపే కొత్త పాజిటివ్  అనుభవాలను నింపుకోవడానికి మీ మనస్సును శుభ్రపరచుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »
23rd-sept-2023-soul-sustenance-telugu

మిమ్మల్ని మీరు నెగిటివ్ గా లేబుల్ చేసుకోకండి

అందరూ తమ వ్యక్తిత్వం మరియు అవగాహనల ఫిల్టర్ ద్వారా మనల్ని చూసినట్లే, మనం స్వయంపై పెట్టుకొనే కొన్ని లేబుల్‌ల ద్వారా కూడా మనల్ని మనం చూసుకుంటాము. నేను సోమరిని, నాకు అజాగ్రత్త ఉంది వంటి

Read More »