Hin

నిజమైన విజయం యొక్క ప్రాథమిక సూత్రాలు

నిజమైన విజయం యొక్క ప్రాథమిక సూత్రాలు

కొన్నిసార్లు మనం మన లక్ష్యాలను సాధించలేనప్పుడు, మనము నేను విజయవంతం కాలేదు, నేను విఫలమయ్యాను అని అంటాము. మిమ్మల్ని మీరు ఫైల్యూర్ అని అనుకోవడం తగనిది. మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ నిజమైన విజయవంతులుగా చూసుకోవటం ప్రారంభించండి. మనం అనుకున్నది సాధించనప్పుడు, మనల్ని మనం ఫైల్యూర్ అని ముద్రించుకుంటాము. విజయం యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి.

  1. విజయం అనేది మీరు చేసే పని వల్ల కాదు, విజయం అనేది అసలు మీరు ఎవరో, దాని వలన. నేను- జీవిని, ఆలోచించే, అనుభూతి చెందే, మాట్లాడే, ప్రవర్తించే, కార్యసాధనలోకి వచ్చే, ప్రతి పనిని పూర్తి చేసి, లక్ష్యాలను సాధించే శక్తిని. విజయం నేను జీవిని అనే చేతనంలో ఉండటంతో మొదలవుతుంది, పనులు చేయడంతో కాదు.
  2. మీరు సంతోషంగా లేకుండా, కలవరపడుతూ, ఉద్రేకంతో లేదా అహంభావంతో, మీ ప్రాపంచిక కోరికలను నెరవేర్చుకుంటే, మిమ్మల్ని మీరు విజయవంతులు అని చెప్పుకోగలరా? మీరు స్వయంతో సంతోషంగా లేనందున మీరు సంతోషంగా ఉండలేరు.
  3. మీరు సంతోషంగా, శ్రద్ధగా మరియు దయతో ఉన్నప్పుడు మీరు విజయవంతులని  గుర్తుంచుకోండి. మీరు వ్యక్తుల విజయాలు, పదవి లేదా వయస్సుతో సంబంధం లేకుండా వారితో కనెక్ట్ అయితే మీరు విజయవంతులు. మీకు తెలిసిన వాటిని ఇతరులతో పంచుకుని సహకరిస్తే మీరు విజయవంతులు.
  4. మీరు జీవి అనే చేతనంతో విజయం సాధించి, బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు, మీరు మీ విజయాలను ఆనందించగలుగుతారు. మీరు కోరుకున్నది మీకు లభించనప్పటికీ, మీరు సాధించేది ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంది కనుక మీరు ఇప్పటికీ విజయవంతులని గుర్తుంచుకోండి. తద్వారా మీరు మళ్లీ ప్రయత్నించి సాధించే శక్తిని కలిగి ఉంటారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »