HI

13th april soul sustenance telugu

భగవంతుని సుందరమైన 5 విశేషతలు :

1.అందరూ భగవంతునిగా చూసే వ్యక్తిత్వం  – భారతదేశంలో, ప్రజలు పెద్ద సంఖ్యలో దేవతలను లేదా దేవీ దేవతలను పూజిస్తారు. భారతదేశం వెలుపల, వివిధ ధర్మస్థాపకులను ఎంతో గౌరవంగా ఆరాధిస్తారు. కానీ భగవంతుడు ఒక్కరే శరీరం లేనివారు,సర్వోన్నతమైనవారు, ఒక ఆధ్యాత్మిక కాంతి. సర్వ గుణాల సాగరుడు. వారిని  వివిధ మతాలలో దేవుడు, ఈశ్వర్, భగవాన్, అల్లాహ్ మొదలైన పేర్లతో పిలుస్తారు.

2.భగవంతుడు సర్వోన్నతమైనవారు – భగవంతుడు ఈ విశ్వంలో అందరికీ పరమ పిత, పరమ శిక్షకుడు  మరియు పరమ గురువు. వారు ఏ ఇతర ఆత్మ నుండి పాలన  తీసుకోరు. నిజానికి, వారు ప్రతి ఒక్కరికీ పాలన ఇచ్చే సర్వోన్నతమైన వారు. వారు  విశ్వాత్మలందరిని తన జ్ఞానం, గుణాలు మరియు శక్తులతో నింపి   ప్రకృతిలోని 5 తత్వాలను కూడా శుద్ధి చేస్తారు .

 

3.ప్రపంచంలోని ద్వంద్వాలకు అతీతమైన వారు – భగవంతుడు జనన మరణాలకు అతీతుడు, సుఖ  దుఃఖాలకు , కర్మ  మరియు కర్మ ఫలాలకు అతీతుడు. వారు సదా స్థిరంగా ఆత్మల ప్రపంచంలో ఉంటూ సదా స్వచ్ఛంగా  ఆనందంగా , జ్ఞానంతో ,  శక్తితో మరియు ఎల్లప్పుడూ ఆత్మిక స్థితిలో ఉంటారు. వారు మధురమైనవారు మరియు విశ్వంలో ఆత్మలందరికీ  అత్యంత వినయపూర్వకమైన పరమ పిత. 

4.వారు జ్ఞాన సాగరుడు మరియు సర్వజ్ఞుడు – భగవంతుడు ఆత్మ యొక్క జ్ఞానం, స్వ పరిచయం మరియు ప్రపంచ నాటకం యొక్క పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్న వారు. ఈ ప్రపంచ నాటకం ఎలా పునరావృతం అవుతుందో తెలిసిన వారు.  ప్రతి జీవిత పరిస్థితి యొక్క రహస్యాలు మరియు దానిని ఎలా పరిష్కరించాలో కూడా వారికి తెలుసు. ప్రతి ఒక్కరూ దుఃఖ సమయంలో భగవంతుని  సహాయం కోసం వారి  వైపు చూస్తారు. వారు అత్యంత స్వచ్ఛమైన మరియు అత్యున్నతమైన బుద్ధి కలిగిన వారు.

5.వారు మంచిని ఇచ్చి తిరిగి ఏమీ ఆశించనివారు – భగవంతుడు ఎప్పుడూ ఎవరి నుండి ఏమీ తీసుకోరు లేదా ఆశించరు. వారు నిరంతర దాత మరియు మంచిని ఇచ్చేవారు. వారు భౌతిక మరియు భౌతికేతర మైనవి (physical and non-physical) ఇచ్చేవారు. ఆయనను స్మరించుకోవడం ద్వారా మనల్ని మనం అంతర్గతంగా నింపుకోవడమే కాకుండా ప్రాపంచిక విజయం సాధించి, భౌతిక స్థాయిలో అన్నీ మంచివి పొందుతాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th feb 2024 soul sustenance telugu

గతం నుండి నేర్చుకుందాం

మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా నిజాయితీగా గతంలో చేసిన పొరపాట్ల నుండి ఏమైనా నేర్చుకున్నారా లేక కేవలం గతంలోనే ఆగిపోతున్నారా? చివరకు గతాన్ని వృధాగా తలుచుకుంటూ చాలా తక్కువ నేర్చుకోవడం జరుగుతుందా?

Read More »
18th feb 2024 soul sustenance telugu

ఆపేక్షలను విడిచిపెట్టండి

మీ సహోద్యోగి సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీరు ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చారు, కానీ ఒక్కసారి మీరు అతడిని సహాయం అడిగితే అతను నిరాకరించాడు. మీరు ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు. మీ

Read More »
17th feb 2024 soul sustenance telugu

దూకుడు స్పందనలను సమర్థించవద్దు

కొన్ని సందర్భాలలో మన మాటలను, ప్రవర్తనను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మనం దూకుడుగా స్పందించేస్తుంటాం. అప్పుడు మన పొరపాటును అంగీకరించకపోగా, తరచూ మన స్పందనను సమర్థించుకుంటూ ఉంటాము. ఈరోజుల్లో మన పాత్రలు

Read More »