Hin

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు. మనం జీవితంలో అతిగా కట్టుబడి ఉంటే తక్కువ చేస్తాము. బిజీ అనే పదంలోని అస్థిరమైన శక్తి, జీవితాన్ని ఎంజాయ్ చేయనివ్వదు. సమయం ఆదా చేయడం, సమయాన్ని సద్వినియోగ పరచడం మరియు నిరంతరం చర్యలో ఉండటంలో బిజీ అనేది   మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. కేవలం బిజీ..బిజీ..బిజీ… అని అనడం వలన మన షెడ్యూల్ లో కొంత సమయం విశ్రాంతికి ఉన్నప్పటికీ, స్వయం కోసం లేదా ఇతరుల కోసం శ్రద్ధ వహించడానికి ఉపయోగించము. మనం ఇతరులను కలవడం మానేసి వారికి ఫోన్ కాల్ చేస్తాం. వారి మాటలు వినకుండా మనమే మాట్లాడతాము. మనం కనెక్ట్ అవ్వము, కేవలం కాంటాక్ట్ లో ఉంటాము. ఈరోజుల్లో మనకు బాధ్యతలు, ఒత్తిళ్లు, ఆపేక్షలు ఎక్కువ గా ఉన్నాయి. ఎక్కువగా ఉంటే బిజీ ఉండాలని అర్థం కాదు. మనం రోజుకు 16 గంటలు ప్రశాంతంగా మరియు సంతోషంగా పని చేయవచ్చు. నేను ఈజీ, అన్నింటికీ నాకు సమయం ఉంది అని అనడం మొదలు పెడదాం. ఈజీ అనే పదంలోని రిలాక్స్డ్ ఎనర్జీ మనల్ని ప్రశాంతంగా, ఏకాగ్రతతో మరియు సమర్థవంతంగా ఉంచుతుంది. అప్పుడు మనకు సమయం కావాలని ఉండదు, ఇంకా ఎక్కువ సమయం ఉంటుంది.

రోజుకు 14 గంటలు పని చేసే నిపుణులు లేదా గృహిణులను ప్రశాంతంగా ఉండటం చూస్తాము. నేను చాలా బిజీగా ఉన్నాను, తొందరపడండి అని చెప్పే స్కూల్ పిల్లలను కూడా చూస్తూ ఉంటాము. ఈరోజు బిజీ అనే ఎనర్జీ వాతావరణంలోనే ఉంది. మనం ఆ వాతావరణాన్ని స్వీకరిస్తూ, దానిని మన పదజాలంలో ఉపయోగించినపుడు, మనం మేనేజ్  చేయాల్సింది చాలా ఉంది, ఇతరులకు అందుబాటులో ఉండలేము అనే మెసేజ్ రేడియేట్ చేస్తున్నాము.  ఈజిగా లేదా బిజీగా ఉండటం మీ మనస్సు యొక్క వ్యతిరేక స్థితులను సూచిస్తుంది. మీరెంత పని చేస్తున్నారన్న దానితో  ఎలాంటి సంబంధం లేదు. బిజీని ఈజితో భర్తీ చేసి చూస్తే మానసిక ఆరోగ్యంలో వ్యత్యాసాన్ని మీరే చూస్తారు. మీరు ఇకపై స్వయాన్ని లేదా ఇతర వ్యక్తులను తొందరపెట్టి భయాందోళనలను కలిగించరు. మీరు ఊహించని పరిస్థితులను ఎదుర్కొనేందుకు బదులుగా ఆ ఫ్లో తో పాటు ముందుకు సాగుతారు. మీరు మీ మనస్సుకు శాంతిని, మీ శరీరానికి ఆరోగ్యాన్ని, మీ సంబంధాలకు సామరస్యాన్ని మరియు మీ సంతోషాన్ని వాతావరణానికి ప్రసరింపజేస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »
27th april 2025 soul sustenance telugu

మీ సంతోషాల గురించి మాట్లాడండి, బాధల గురించి కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా, మంచి మరియు సానుకూల విషయాలకు బదులుగా మన ఆరోగ్యం, ఆర్థిక, సంబంధాలు మరియు

Read More »