13th feb soul sustenance - telugu

సహన శక్తిని ఎప్పుడు ఉపయోగించాలి మరియు ఎదుర్కునే శక్తిని ఎప్పుడు ఉపయోగించాలి

మనలో ప్రతి ఒక్కరు విభిన్న ప్రవర్తనలను సహించే శక్తితో ఆశీర్వదించబడ్డారు, అదే విధంగా ఎదుర్కొనే శక్తి కూడా మనలో ఉంది. నైతిక విలువల ఘర్షణ, అభిరుచులలో వ్యత్యాసాలు, విరుద్ధమైన అభిప్రాయాలు లేదా మీ స్వంత బలహీనతలు ఉన్నప్పుడు, వాటిని సహించాలా లేదా వ్యతిరేకించాలా అని కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఎలా ప్రతిస్పందించాలో తెలుసుకోవడం సమస్యలను నివారించడంలో లేదా పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగిస్తుంది. మీరు ఆమోదించని విధంగా ప్రవర్తించే వ్యక్తులను ఎదుర్కోవడం అనివార్యమని మీరు భావిస్తున్నారా? దుర్వినియోగం, అవినీతి పద్ధతులు లేదా హింసను సహించడం కొన్నిసార్లు అనివార్యమని మీరు భావిస్తున్నారా? ఏ ప్రవర్తనలను సహించాలో మరియు ఏ ప్రవర్తనలను ఎదుర్కోవాలో మీ మనసుకు తెలియకుండా పోతుందా? మనందరికీ రెండు ఆంతరిక శక్తులు ఉన్నాయి – సర్దుబాటు చేసే శక్తి మరియు ఎదుర్కొనే శక్తి. ఈ శక్తులు వాటంతట అవే వ్యతిరేకమైనవి కాబట్టి, వాటిలో దేనిని ఏ నిర్దిష్ట సందర్భంలో ఏది ఉపయోగించాలో మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మన సంబంధాలు క్లిష్టంగా మారడానికి ఒక కారణం, మనం ఈ శక్తులను తప్పుగా ఉపయోగించడం. గుణాలు, ధర్మాలు, అభిప్రాయాలు, మనోభావాలు మరియు దృక్కోణాలలో తేడాలు ఉంటే, మనం వ్యక్తులతో సర్దుబాటు చేయాలి. అడ్జస్ట్‌మెంట్ అంటే మనుషులు భిన్నమైనవారని మనం అర్థం చేసుకొని సర్దుబాటు చేయడం మరియు అంగీకరించడం. వారి పట్ల నెగెటివ్ ఆలోచనలను సృష్టించవద్దు, వారిని ఎదురించవద్దు లేదా వారిని దూరం పెట్టవద్దు. కానీ నైతిక విలువలు మరియు సూత్రాల దుర్వినియోగం, దోపిడీ ఉంటే, మనం అలాంటి ప్రవర్తనలను ఎదుర్కొందాం. సామాజిక ఒత్తిళ్లను సర్దుబాటు చేయడం మరియు అంగీకరించడం మనల్ని క్షీణింపజేస్తుంది. సరైన శక్తిని గుర్తించడం మరియు ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు వాటిని ఎంత ఎక్కువ ఆచరణలోకి తీసుకువస్తే, వాటిని గుర్తించడం మరియు వాటిని అమలులోకి తీసుకురావడం సులభం అవుతుంది.
మీరు తెలివైన జీవి అని గుర్తుంచుకోండి. జీవితపు ప్రతి సన్నివేశంలో మీ ఆంతరిక శక్తులను తగిన విధంగా ఉపయోగించండి. మీరు కలిసే వ్యక్తులు వారి ప్రవర్తనలను ప్రదర్శిస్తారు. ఆ ప్రవర్తనలను ఎప్పుడు సర్దుబాటు చేయాలో మరియు ఎప్పుడు ఎదుర్కోవాలో తెలుసుకోండి. సర్దుకునే శక్తి మరియు ఎదుర్కునే శక్తి అనే మీ ఆంతరిక శక్తులను సరైన విధంగా ఉపయోగించండి. ప్రతి ఒక్కరిని వారు ఉన్నట్లుగానే అంగీకరించండి. వారి ప్రయోజనం కోసం వారికి సలహా ఇవ్వండి లేదా ఉపదేశించండి, వారిని ఆశీర్వదించండి కానీ వారిని ఎదుర్కోవద్దు. విభిన్న వ్యక్తిత్వాలను సహించే మీ శక్తి మీ సంబంధాలను బలపరుస్తుంది. అదే సమయంలో, కొన్ని సందర్భాల్లో, మీరు ఇతరులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, సామాజిక ఒత్తిళ్లు, ప్రజల ఆమోదం లేదా బాధ్యతలను అధిగమించవలసి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని సరైనది చేయండి. అలాగే, మీ బలహీనత లేదా తప్పుడు అలవాటు గురించి మీకు తెలిసినప్పుడు, దానిని ఎదుర్కోండి అంతేకాని సర్దుబాటు చేయవద్దు. దానితో జీవించవద్దు. ఎందుకంటే ఆ బలహీనత యొక్క పర్యవసానం మీకు తెలుసు. కాబట్టి మీరు దాన్ని పూర్తి చేసే వరకు లేదా మార్చే వరకు నిరంతరం దానిపై కృషి చేయండి. సరైన సమయంలో సరైన ప్రతిస్పందనను ఉపయోగించడం ద్వారా, మీరు మీ ఆంతరిక శక్తులను పెంచుకుంటారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »
23rd-sept-2023-soul-sustenance-telugu

మిమ్మల్ని మీరు నెగిటివ్ గా లేబుల్ చేసుకోకండి

అందరూ తమ వ్యక్తిత్వం మరియు అవగాహనల ఫిల్టర్ ద్వారా మనల్ని చూసినట్లే, మనం స్వయంపై పెట్టుకొనే కొన్ని లేబుల్‌ల ద్వారా కూడా మనల్ని మనం చూసుకుంటాము. నేను సోమరిని, నాకు అజాగ్రత్త ఉంది వంటి

Read More »