Soul sustenance 13th january telugu

పరిస్థితులను పాజిటివ్ గా చూడటం (భాగం-3)

కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నిస్సహాయతా భావాలు చాలా మందికి అనుభవం అవుతాయి. అలాంటి సమయంలో జీవితం నిలిచిపోయినట్లు అనిపిస్తుంది ,సహాయం కోసం ఎక్కడ వెతకాలో మరియు ఎవరిని పిలవాలో మనకు తెలియదు. పరిస్థితులను ఎదుర్కోవడం అంత కష్టమా? మన పరిస్థితి భగవంతునికి తెలియదా? దానిని దాటే ప్రక్రియలో వారి తోడు తీసుకోలేమా? భగవంతుడు మన సమస్యలను ప్రేక్షకుని వలె చూస్తూ ఉంటాడని, మన బాధ వినడానికి వారు చాలా దూరంగా ఉంటారని కొందరు అంటారు మరి అది నిజమా? మీరు భగవంతుని ఆత్మిక సంతానం మరియు అతని సహాయం తీసుకునే హక్కు మీకు ఉంది. కాబట్టి భగవంతుడు మీరు తన సహాయం ఎప్పుడు తీసుకుంటారా అని ఎదురు చూస్తారు . అలాగే భగవంతుడు మన కష్టాలు పట్టించుకోరు అని అంటే అది తప్పు . కొందరు మన జీవితంలోని సుఖ దుఃఖాలన్నీ భగవంతుడు ఇచ్చినవే అని కొన్నిసార్లు తప్పుగా అంటారు, అది నిజం కాదు. కానీ, అదే సమయంలో మనల్ని దుఃఖం నుండి బయటపడేయాలని భగవంతుడు కూడా ఎల్లప్పుడూ అనుకుంటున్నారు , అయితే ప్రతికూల పరిస్థితుల్లో దృఢంగా మరియు స్థిరంగా ఉంటూ మనం వారి సహాయం తీసుకోవాలి. మనం వేసే ఒక్క ధైర్యపు అడుగు భగవంతుడి నుంచి వేల అడుగుల సహాయం అందజేస్తుందని అంటారు. భగవంతుడు మన తండ్రి కనుక మనం కష్టాల్లో ఉన్నప్పుడు వారి సహాయం తీసుకోవడం అనేది మన మనస్సులోకి రావాల్సిన మొదటి విషయం. కానీ కొన్నిసార్లు ఇది చివరి విషయంగా భావిస్తాము. మనము పరిస్థితులలో మరియు దానిని ఎలా పరిష్కరించాలో ఎంత ఎక్కువగా లీనమవుతామంటే , మనం మన సంకల్ప శక్తి ద్వారా భగవంతుడిని పిలిచి వారి సహాయం తీసుకోవచ్చునని మనం మరచిపోతాము. మనకు అవసరమైతే,భౌతిక తండ్రిని సహాయం అడిగినట్లే భగవంతుని సహాయం అడగవచ్చు.

భగవంతుడు తనంతట తానుగా సహాయం చేయాలని కొందరు అనుకుంటారు, కానీ అతని సహాయాన్ని పొందడానికి రెండు షరతులు ఉన్నాయి – ఒకటి ధైర్యం మరియు మరొకటి వారిని స్మరించడం. భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు . వారిని స్మరించడం ఆయనకు గౌరవం ఇచ్చే విధానం . భగవంతుడు అత్యంత నమ్రచిత్తుడు. వారిని స్మరించండి. మనం వారిని నుండి డిస్‌కనెక్ట్ అయినప్పుడు కంటే, ఎక్కువగా వారిని స్మరించిన్నప్పుడే వారు మనకు సహాయం చేస్తారు . వారి సహాయం తీసుకోవడం వల్ల మీరు ఉన్న పరిస్థితిని సులభంగా ఎదుర్కోవచ్చు మరియు పరిస్థితులను పాజిటివ్ గా చూడగలరు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4)

9th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4) గాలి శుద్దీకరణ – గాలి మన చుట్టూ నిరంతరం ఉంటుంది మరియు మనం దానిని ఎల్లప్పుడూ  పీల్చుకుంటాము. భౌతిక

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3)

8th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3) నీటి శుద్దీకరణ – మనం త్రాగే నీటిని శుద్ధి చేయడం కోసం, మనం భౌతిక మార్గాలను మాత్రమే కాకుండా,

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2)

7th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2) ప్రకృతి నుండి మనం తీసుకునే ఆహారం, నీరు మరియు గాలి భౌతిక మరియు భౌతికేతర రెండు రకాలుగా ఎలా

Read More »