Hin

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాసినట్లయితే, రెండు విషయాలు జరుగుతాయి: మొదటిది, మనమందరం భగవంతుని పిల్లలం కాబట్టి, మనమందరి భాగ్యం  సమానంగా ఉండేది. రెండవది, మన తల్లిదండ్రులుగా, భగవంతుడు మనందరికీ ఒకే ఖచ్చితమైన భాగ్యాన్ని వ్రాసి ఉండేవారు. నేడు మన భాగ్యం సమానంగా, పరిపూర్ణంగా లేదు. మనం నా కర్మ ఎలా ఉంటుందో, నా భాగ్యం కూడా అలాగే ఉంటుంది అని కర్మ సిద్ధాంతాన్ని కూడా విశ్వసిస్తాము. మన కర్మలు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండవు, మనమందరం ఒకే విధమైన కర్మలను చేయము. కాబట్టి మన భాగ్యం పరిపూర్ణమైనది లేదా సమానమైనది కాదు. ఈ రెండు నమ్మకాలలో ఏది మనకు సరైనదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కర్మ అంటే చర్య. కర్మ సిద్ధాంతం అంటేనే చర్య మరియు ప్రతిచర్య, కారణం మరియు ప్రభావం. కర్మ మన ప్రతి ఆలోచన, ప్రతి మాటలో మరియు ప్రతి చర్యను కలిగి ఉన్నందున కర్మ సిద్ధాంతం మన జీవితాల్లో నిరంతరం పని చేస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం, ప్రతి చర్య – అది చిన్నదైనా లేదా ముఖ్యమైనది అయినా దానికి ఫలితం ఉంటుంది. ఫలితం ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటుంది. సరైన చర్య మంచి ఫలితాన్ని మరియు తప్పుడు చర్య కష్టతరమైనదాన్ని తెస్తుంది. కొన్ని కర్మలు తక్షణ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని కర్మలు ఒక గంట తర్వాత, ఒక సంవత్సరం తర్వాత,  20 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత లేదా భవిష్య జన్మలో తిరిగి వచ్చే ఫలితాన్ని కలిగి ఉండవచ్చు.

మనం కొన్ని సందర్భాల్లో కర్మను ఫలితంతో కనెక్ట్ చేయ వచ్చు. అయితే, మనం కర్మ యొక్క ప్రభావాలను సూక్ష్మ స్థాయిలో చూసినప్పుడు, మనం కర్మతో ఫలితాన్ని కనెక్ట్ చేయలేము, ఎందుకంటే కర్మ చాలా సంవత్సరాల క్రితం లేదా గత జన్మలో కూడా చేసి ఉండవచ్చు. కాబట్టి, కారణాన్ని గుర్తించే ఆ అంశం గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. మనం క్రింద చెప్పినవి గుర్తుంచుకుంటే చాలు –

  1. కర్మ సిద్ధాంతం అందరికి ఎల్లప్పుడూ ఖచ్చితమైనది మరియు న్యాయమైనది.
  2. మన ప్రస్తుత పరిస్థితులు మన పూర్వ కర్మల ఫలితం మాత్రమే. కాబట్టి, మనకు జరిగే ప్రతిదానికీ మనమే బాధ్యులం.
  3. మన ప్రస్తుత కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి, మన భాగ్యాన్ని తయారు చేసుకొనే  శక్తి మనకు ఉంది.

మనమందరం సరైన కర్మల మరియు తప్పు కర్మల ఫలితాలను అనుభవించాము. మనం నమ్మినా నమ్మకపోయినా, కర్మ సిద్ధాంతం మన జీవితాల్లో నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అలాగని మనం కర్మ సిద్ధాంతానికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ మనం దాని గురించి తెలుసుకోవాలి. కర్మలు అంటే  మాటలు మరియు చర్యలే కాకుండా ఆలోచనలు కూడా ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం సరైన ఆలోచన, మాటలు మరియు ప్రవర్తన పై దృష్టి పెడదాం, తద్వారా మనం అందమైన భాగ్యాన్ని తయారు చేసుకుందాం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th feb 2025 soul sustenance telugu

నిద్రపోయే ముందు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీ నుండి దూరమవ్వండి 

రాత్రి వరకు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ లో చిక్కుకోవడం వల్ల మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనస్సు పనుల గురించి ఆలోచిస్తూ, మన నిద్రకు భంగం కలిగిస్తుంది. మన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అదుపు తప్పడం

Read More »
11th feb 2025 soul sustenance telugu

పునర్జన్మ అనేది వాస్తవమేనా ? 

మనమందరం ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం, మన శరీరాల ద్వారా మన పాత్రలను పోషిస్తున్నాము. మన స్వభావం లేదా సంస్కారాల ఆధారంగా మన ఆధ్యాత్మిక ఆలోచనలు, మనం విజువలైజ్ చేసేది, ప్రవర్తించేది వేర్వేరుగా ఉంటాయి. 

Read More »
10th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 3)

మీ మంచితనాన్ని ఉపయోగించుకోండి లేదంటే కోల్పోతారు  వారి సానుకూల శక్తులను ఉన్నతొన్నతమైన మూలం లేదా భగవంతుడు నింపే వ్యక్తులకు ఇచ్చే వ్యక్తిత్వం సహజంగా వస్తుంది. లేకపోతే ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇతరులకు సేవ

Read More »