Hin

మీ సంకల్ప శక్తి మీ అతిపెద్ద బలం

మీ సంకల్ప శక్తి మీ అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహార విధానాన్ని అనుసరించాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, మన విజయాన్ని లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యున్నత సంకల్ప శక్తిని ప్రదర్శిస్తాము మరియు మరికొన్ని సార్లు మనకు పూర్తిగా లోపించినట్లు అనిపిస్తుంది. మనందరికీ ఏకరీతి మరియు అపరిమిత సంకల్ప శక్తి ఉంటుంది. మనం దానిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తామో, అంత ఎక్కువగా అనుభూతి చెందుతాం . మీరు ఏదైనా సాధించడంలో, లేదా అధిగమించడంలో విఫలమైనప్పుడల్లా, నాకు తగినంత సంకల్ప శక్తి లేదు, నేను ఇది చేయలేను అని మీరు అనుకున్నారా?  విజయవంతమైన వ్యక్తులకు అధిక సంకల్ప శక్తి ఉందని మీరు అనుకుంటున్నారా? కొన్ని సమయాల్లో మీకు వైఫల్యం కలిగించేది మీ సంకల్ప శక్తియేనా కాదా అని మీరు తనిఖీ చేసుకున్నారా? మనందరికీ   ఒకే విధమైన సంకల్ప శక్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన సంకల్ప శక్తిని ఉపయోగిస్తాము మరియు కొన్ని సందర్భాల్లో ఉపయోగించము. మనం ఉపయోగించనప్పుడు, మనం చేయాలనుకున్న పనిలో విఫలమవుతాము. పదే పదే వైఫల్యం మనకు సంకల్ప శక్తి లేదనే తప్పుడు నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది. సంకల్ప శక్తి లేకపోవడం కాదు, కోరిక మరియు నిశ్చయం లేకపోవడం మన విజయాన్ని అడ్డుకుంటుంది. సంకల్ప శక్తి పని చేయడానికి, మనం గతంలో విఫలమైనప్పటికీ మరోసారి ప్రయత్నించాలనే లోతైన కోరిక మరియు పట్టుదల కలిగి ఉండటం ముఖ్యం. మీ సంకల్ప శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి, ప్రతి అంశంలో విజయానికి ఇది ముఖ్యమైన అంశం. 

మీరు శక్తివంతమైన ఆత్మ అని ఎల్లప్పుడూ మీకు  మీరు గుర్తుచేసుకోండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండొచ్చు, అలాగే మీరు చేయాలనుకున్నది చేయవచ్చు. మీరు మీ ఇంద్రియాలకు అధిపతి అయినందున మీ మనస్సు మరియు శరీరం ఎల్లప్పుడూ మీకు సహకరిస్తాయి. మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు సామాజిక జీవితంలో మీరు నిజంగా ఏమి కావాలనుకుంటున్నారో మీకు ఎల్లప్పుడూ స్పష్టంగా తెలియాలి. మీకు సరైన ఎంపికలు చేయగల సామర్థ్యం ఉంది, మీ నిర్ణయాలను అమలు చేయడానికి మీకు సంకల్ప శక్తి ఉంది. సరైన ఆహార అలవాట్లు , నిద్ర అలవాట్లు వంటి జీవనశైలిని అనుసరించండి. మీ మనస్సుకు సరైన ఆలోచనా  విధానం , సరైన మాటలు మరియు ప్రవర్తన నేర్పండి. మీ అలవాటును మార్చుకోవడానికి , ఆరోగ్యకరమైన ఎంపికలు చేయడానికి లేదా సమయానుకూల చర్యలు తీసుకోవడానికి, వ్యక్తులు, పరిస్థితులు, వాతావరణం లేదా మీ గత అనుభవాలపై ఆధారపడవద్దు. మీ దృఢమైన  సంకల్ప శక్తిపై ఆధారపడండి. ప్రలోభాలకు లోనుకాకుండా సంయమనం పాటించండి. మీ ప్రణాళికలను వాయిదా వేయవద్దు, రద్దు చేయవద్దు. మీ లక్ష్యాలను వదులుకోవద్దు. ప్రతి పరిస్థితిలో మీ సంకల్ప శక్తిని ఉపయోగించండి. మీరు మీ సంకల్ప శక్తిని ఒక సందర్భంలో ఉపయోగించినప్పుడు, మీరు దానిని ఇతర పరిస్థితులలో కూడా పెంచుతారు. నేను శక్తివంతమైన ఆత్మను . “నాకు బలమైన సంకల్ప శక్తి ఉంది, నా సంకల్ప శక్తి నేను కోరుకునే ప్రతిదాన్ని సాధించడానికి నాకు శక్తినిస్తుంది. నా అపరిమిత సంకల్ప శక్తి నా అతిపెద్ద బలం. నేను కోరుకున్నది సాధించడానికి నేను దానిని ఉపయోగిస్తాను” అని ప్రతిరోజూ మీకు మీరు గుర్తు చేసుకోండి. 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th june2024 soul sustenance telugu

విజయం కోసం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తయారుచేసుకోవడం (పార్ట్ 1)

జీవితంలో వివిధ రకాల పరిస్థితులు ఎదురుకోవడం, వివిధ రకాల వ్యక్తులను కలవడం, మీకు ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అలాగే, మన వ్యక్తిత్వం  స్థాయిలో మన శక్తులు

Read More »
24th june2024 soul sustenance telugu

పోటీ పడకుండా సహకరించుకుందాం

నిజమైన సహకారం అంటే సర్వులకు ఎల్లవేళలా తన వారనే భావన మరియు సాధికారత ఉద్దేశ్యంతో షరతులు లేని సహాయాన్ని అందించడం. ఇది వినయం, ప్రేమ, కరుణ మరియు తాదాత్మ్యం వంటి మన నిజ గుణాలను

Read More »
23rd june2024 soul sustenance telugu

నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలు

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శారీరక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని అపారంగా ప్రభావితం చేస్తుంది. నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలను చూద్దాం –

Read More »