13th march soul sustenance telugu

బ్రహ్మకుమారీస్ సంస్థలో బోధించే జ్ఞానము ఎవరు ఇస్తున్నారు? (భాగం 1)

ప్రపంచంలో చాలామంది తరచుగా అడిగే ప్రశ్న – బ్రహ్మకుమారీస్  సంస్థలో బోధించే జ్ఞానము ఎవరు చెప్పినది అని. బ్రహ్మకుమారీస్ సంస్థలో వివరించబడే ఆత్మ, పరమాత్మ, సృష్టి నాటకము, దాని వ్యవధి 5 వేల సంవత్సరాలు అన్న అంశాలు ప్రపంచంలో వివరించే వాటికన్నా కొద్దిగా భిన్నంగా ఉంటాయి. నిజానికి ఈ అంశాల లోతుల్లోకి మనం వెళితే ఆత్మ, పరమాత్మ వంటి ఆధ్యాత్మిక అంశాలు కావచ్చు, విశ్వ నాటక రంగ చరిత్ర, వ్యవధి, స్వభావము వంటి భౌతిక విషయాలు కావచ్చు ఇవి సరిగ్గానే చెబుతున్నారని అర్థమవుతుంది. అయితే, ఈ అంశాలు పెద్దగా ప్రాచుర్యం పొందని కారణంగా మరియు అంతగా నమ్మశక్యంగా లేని కారణంగా అవి ఆమోదయోగ్యంగా అవ్వలేదు. అందుకే ఇటువంటి అసాధారణ, తక్కువ ప్రాచుర్యం పొందిన సత్యమైన విషయాలను మనం పాఠశాలలో కానీ, కాలేజీ పుస్తకాలలో కానీ ఎక్కడా చూడలేదు. నిజానికి ఈ వాస్తవ అంశాలు అతి కొద్ది పుస్తకాలలో మరియు కొద్ది మందికి మాత్రమే తెలుసు.

అలాగే, అందరూ నమ్మిన విషయం కూడా కొంతకాలం తర్వాత అసత్యమైనదిగా నిరూపింపబడటం మనం చరిత్రలో గమనించాము. ఇటువంటి సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి, బ్రహ్మకుమారీస్  సంస్థలో బోధించే అంశాలను వింటూ ఉంటే కొన్ని సందేహాలు రావడం సహజమే. సందేహాలు రావడానికి రెండు కారణాలు – ఒకటి, సాధారణంగా అందరూ నమ్మే అంశాలకు భిన్నంగా ఇక్కడి బోధనలు ఉండటము, రెండు, ఈ జ్ఞానానికి మూలమైన భగవంతుడు సుపరిచితుడు కాకపోవడము, అనుభూతి పొందకపోవడము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th march soul sustenance telugu

24th March – జీవన విలువలు

కర్మ సిద్ధాంతం ఎలా పని చేస్తుంది? మనమందరం ఆధ్యాత్మిక శక్తులం  లేదా ఆత్మలం . ప్రపంచ నాటకంలో వివిధ రకాల కర్మలను చేస్తాము. మనమందరం ప్రపంచ నాటకంలో శరీర బ్రాంతిలో కొన్ని మంచి కర్మలు

Read More »
23rd march soul sustenance telugu

23rd March – జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి మనమందరం గొప్ప వక్తలు కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణమైన సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను

Read More »
22nd march soul sustenance telugu

22nd March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు: శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ

Read More »