సద్గుణాలు కలిగిన బిడ్డకు జన్మను ఇవ్వడానికి 5 చిట్కాలు

సద్గుణాలు కలిగిన బిడ్డకు జన్మను ఇవ్వడానికి 5 చిట్కాలు

  1. భగవంతుడిని స్మరించుకోవడం మరియు కృతజ్ఞతలు చెప్తూ జన్మను ఇవ్వడం : మీ కుటుంబంలో ఒక చిన్ని కుటుంబ సభ్యుడు వస్తున్నట్లు మీరు విన్నప్పుడు, తల్లిదండ్రులిద్దరూ ప్రతిరోజూ కొన్ని సార్లు మీ మనస్సులో దృఢ సంకల్పాన్ని చేయండి – నేను సంతోషకరమైన, ప్రేమగల మరియు భాగ్యశాలి జీవిని … నేను ప్రతి క్షణం భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతాను … నేను అన్ని గుణాలు మరియు ప్రత్యేకతలతో కూడిన అందమైన ఏంజెల్ (angel) కు  జన్మనిస్తున్నాను …
  2. మీ ఆలోచనలు మరియు భావాలతో మీ శిశువుతో మాట్లాడండి – ప్రతిరోజూ శిశువును స్వచ్ఛమైన, తెల్లటి కాంతి వలయంలో ప్రకాశిస్తున్న అందమైన, చిన్న ఏంజెల్ గా విజువలైజ్ చేసుకోండి. గర్భంలో ఉన్న బిడ్డ ఉనికిని అనుభూతి చేసుకోండి. బిడ్డతో కమ్యూనికేట్ చేయండి, కథలు చదవండి మరియు మంచితనం, ప్రేమ మరియు సంరక్షణ యొక్క పాటలను ప్లే చేయండి. బిడ్డకు  గర్భం లోపల మంచి మరియు ప్రత్యేకంగా అనుభూతిని కలిగించడానికి ఆప్యాయతతో కూడిన వాతావరణాన్ని తయారుచేసి స్వాగతించండి.  
  3. ప్రతిరోజూ మీ బిడ్డకు పాజిటివ్ వైబ్స్‌ను రేడియేట్ చేయండి – కొత్తగా  తల్లిదండ్రులు అవ్వడంలో మీ మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా మరియు రిలాక్స్‌గా ఉంచే పెద్ద బాధ్యత మీ పై ఉంటుంది. శిశువు పాలన మరియు సంరక్షణకు సంబంధించిన ప్రత్యేక మెడిటేషన్ ప్రతిరోజూ ఉదయం మరియు నిద్రపోయే ముందు సుమారు 15 నిమిషాలు సాధన చేయవచ్చు. మీ మెడిటేషన్లలో మీరు అనుభవించే పాజిటివ్ వైబ్స్‌ను మీ బిడ్డకు ప్రసరింపజేయండి. 
  4. స్వచ్ఛమైన మరియు పాజిటివ్ డైట్ తో మీ మనస్సు మరియు శరీరానికి పాలనను ఇవ్వండి – శిశువు మానసికంగా, ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా తల్లిదండ్రులిద్దరితో కనెక్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి గర్భధారణ సమయంలో  మరియు బిడ్డ వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ మనస్సును మంచి జ్ఞానంతో,  స్వచ్ఛమైన మరియు పాజిటివ్  ఆలోచనలతో నింపడం మరియు వారి శరీరానికి స్వచ్ఛమైన, సాత్వికమైన ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం.
  5. మీ ఇంటిలో ఒక అందమైన వాతావరణాన్ని సృష్టించండి – శిశువు యొక్క ఆత్మ గత జన్మలో ఒక ఇంటిని విడిచిపెట్టి మీ జీవితంలోకి వచ్చిననందున, మీ ఇంట్లో శాంతి, ఆనందం మరియు మధురత సృష్టించడం చాలా ముఖ్యం. ఇది కొత్త ఇంటిలో పిల్లవాడిని సౌకర్యవంతంగా చేస్తుంది మరియు పాజిటివ్ సంస్కారాలు, ఆరోగ్యం, తెలివితేటలు, అందం  మరియు ప్రతిభ వంటి అన్ని ప్రత్యేకతలతో నిండి ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »