14th april soul sustenance telugu

నెగిటివ్ పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 1)

మనం అనూహ్యమైన జీవితాన్ని గడుపుతున్నాము, మన జీవితంలో అప్పుడప్పుడు అనుకోని పరిస్థితులు వస్తాయి. దీనికి కారణం ఏమిటి? నేడు మన జీవితాల్లో కఠిన పరిస్థితులు ఎందుకు పెరుగుతున్నాయి? భగవంతుడు చెప్పిన  ప్రపంచ నాటకం యొక్క జ్ఞానం ప్రకారం, మనమందరం ప్రస్తుతం ప్రపంచ నాటకం యొక్క చివరి దశలో అంటే  కలియుగం లేదా ఇనుప యుగం అంతిమంలో ఉన్నాము. ఈ సమయంలో ప్రపంచంలోని  ఆత్మలందరూ తమ గత జన్మలలో చేసిన అనేక నెగిటివ్ చర్యల యొక్క నెగిటివ్ సంస్కారాలను కలిగి ఉన్నారు. ఈ నెగిటివ్ సంస్కారాలు నెగిటివ్ ఆలోచనలు మరియు భావాలు, అనగా మానసిక కఠిన పరిస్థితులకు కారణమయి తమ శరీరానికి, ఇతర ఆత్మలకు మరియు పర్యావరణానికి నిరంతరం నెగిటివ్ శక్తిని ప్రసరింపజేస్తున్నాయి.  శరీరం, సంబంధాలు, సంపద పరంగా కఠిన పరిస్థితులను ఆకర్షిస్తున్నాయి. కాబట్టి, మనం ఈ విభిన్న నెగిటివ్ పరిస్థితులను ఓర్పు మరియు శక్తితో పరిష్కరించుకోవాలి. ఈ కఠిన పరిస్థితులను విజయవంతంగా మరియు తక్కువ సమయంలో పరిష్కరించగల 3 అంశాలను ఈ సందేశంలో చూద్దాం –

1 – పరిస్థితిని శాంతియుతంగా అంగీకరించడం – ఏదైనా కఠిన  పరిస్థితిని పరిష్కరించడంలో మొదటి దశ వివేకం మరియు అవగాహనతో శాంతియుతంగా అంగీకరించడం. మనం ఏదైనా పరిస్థితిని ప్రతిఘటించి భయపడితే, అది మరింత పెద్దదిగా మారి పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు పరిస్థితి అంత పెద్దది కాదు కానీ మన జీవితంలో కఠిన పరిస్థితి ఉంది మరియు జీవితం ఇంతకుముందులా ఉండదు అని భావిస్తే, అది ఆ పరిస్థితిని ఇంకా  పెద్దది చేస్తుంది. అదే విధంగా , మనం మానసిక స్థితిని పాజిటివ్ గా తయారుచేసుకుని, మన సరైన ఆలోచనతో, భగవంతుని సహాయంతో మరియు ఇతరుల మార్గదర్శకత్వంతో పరిస్థితిని మార్చడం ప్రారంభించే ముందు, అది ఏ వ్యక్తి లేదా మరే ఇతర బాహ్య శక్తి వల్ల సంభవించలేదని అర్థం చేసుకుని పరిస్థితిని అంగీకరించే ముందు ఇది మన గత జన్మల యొక్క కొన్ని నెగిటివ్ చర్యల ఫలితం అని మనం అర్థం చేసుకోవాలి. దీనితో పాటు అనేక నెగిటివ్ చర్యలను చేసిన కారణంగా మనం ఈ రోజు బాధపడుతున్నాము అందువల్ల మనం చాలా చెడ్డ ఆత్మలం అని కాకుండా మనం అనేక ప్రత్యేకతలతో కూడిన మంచి ఆత్మలమని మరియు భగవంతుడు  మనలను ప్రేమిస్తున్నాడని, పైగా ఈ రకమైన పరిస్థితి ఎవరి జీవితంలోనైనా రావచ్చు, మన ఒక్కరిదే ఈ పరిస్థితి కాదు అని మనం మనతో మాట్లాడుకొని మన మనస్సులో తేలికగా ఉండాలి. అంగీకారం మనల్ని బలంగా మరియు మరింత స్థిరంగా చేస్తుంది మరియు ప్రతిఘటన మనల్ని మానసికంగా బలహీనంగా మరియు అస్థిరంగా చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »