HI

భగవంతుడు ఆశించిన భారతదేశాన్ని తయారుచేయటం (పార్ట్ 1)

భగవంతుడు ఆశించిన భారతదేశాన్ని తయారుచేయటం (పార్ట్ 1)

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక సందేశం – ఆగస్టు 15

భారతదేశానికి ఆగస్టు 15వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ  రోజున భారతదేశం స్వాతంత్ర దినోత్సవాన్ని   జరుపుకుంటుంది. చాలా కృషి, దృఢత్వంతో మరియు దేశం పట్ల ప్రేమ, శాంతి శక్తులతో, అంతర్గత స్వచ్ఛత, సత్యతా సహాయంతో అది సాధించబడింది. స్వాతంత్రానికి ముందు భారతీయులందరి త్యాగాలను మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, మనకు గర్వంగా ఉంటుంది. వారి సుఖ సంతోషాలు మరియు జీవితాల గురించి ఆలోచించకుండా దేశం కోసం ఇంత చేసిన వారందరినీ గౌరవిస్తాము. అప్పుడప్పుడు అతి కష్టంగా అనిపించినా, అందరి ఐక్యతా శక్తితో సాధించాము. చాలా సంవత్సరాలు దుఃఖం, అశాంతులను అనుభవించిన తరువాత ఈ అత్యంత అందమైన, అపారమైన ఆధ్యాత్మిక మరియు భగవంతుడిని ప్రేమించే దేశాన్ని స్వేచ్ఛగా చూడాలని భగవంతుడు కూడా ఆశించారు. మనం ఈ అతిపెద్ద మరియు కష్టమైన యుద్ధం నుండి విజయం సాధించి, స్వతంత్ర భారతదేశానికి ద్వారాలు తెరిచినప్పుడు మనతో భగవంతుడు ఉండి ఉంటారని ఈ రోజు అనుకుంటాము. భగవంతుడు ఆశించిన భారతదేశాన్ని తయారుచేసే 5 మార్గాలను ఈ సందేశంలో చూద్దాం –

  1. ఆధ్యాత్మికతను మన ప్రాధాన్యతగా మరియు ఆత్మ-పరిశీలనను మన అలవాటుగా చేసుకుందాం – ఆధునిక భారతదేశంలో మనం చాలా అభివృద్ధితో ,  సైన్స్ మరియు  టెక్నాలజీలో అనేక విజయాలతో ముందుకు సాగుతున్నప్పుడు, మన జీవితాలు మరింత బిజీగా, కార్య-ఆధారితంగా మారాయి. మనమందరము, నిత్యం స్త్రీ పురుషులు, పిల్లలతో సహా చాలా కార్యాలు చేస్తున్నాము. అందమైన జీవితానికి ఒక అందమైన రహస్యాన్ని భగవంతుడు మనతో పంచుకుంటారు – ప్రతిరోజూ ఉదయం కనీసం అరగంట సమయం మీకోసం ఇచ్చుకోండి. ఈ అరగంటలో మీ ఆలోచనలను శాంతపరచుకోండి, భగవంతుని జ్ఞానాన్ని వినండి మరియు మెడిటేషన్ లో భగవంతునితో ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. ప్రతి భారతీయుడు ఇలా చేస్తే, మనమందరం భగవంతునికి సమీపంగా చేరుకుంటాము మరియు అంతర్గతంగా మరింత సంతోషంగా, సుసంపన్నంగా ఉంటాము. 
  2. మనలోని అన్ని బలహీనతలను తొలగించి, గుణాలు మరియు శక్తులతో కూడిన స్వభావాన్ని తయారు చేసుకుందాం –  భారత దేశం గురించి భగవంతుడి విజన్ (vision) ఏమిటంటే – ప్రతి భారతీయుడు భగవంతుని గుణాలు మరియు శక్తులతో నిండి ఉండాలి అని. మనమందరం అనేక రకాల దుర్గుణాలు మరియు బలహీనతల ప్రభావంలో ఉండటానికి అలవాటు పడ్డాము. భౌతిక స్థాయిలో మనం స్వేచ్ఛను సాధించినప్పటికీ, మన నెగిటివిటీ ని మరియు చెడు అలవాట్లను భగవంతుడికి  అప్పగించడం ద్వారా మనం లోతైన శాంతి మరియు ఆనందాన్ని అనుభూతి చెందాలని  భగవంతుడు కోరుకుంటున్నారు. మనం అలా చేసినప్పుడు, మన స్వేచ్ఛ మరింత లోతుగా ఉంటుంది.  మన మంచి స్వభావం, వినయం, ప్రతి ఒక్కరికీ ఇచ్చే, ఉదార వైఖరితో మొత్తం ప్రపంచాన్ని ప్రేరేపించగలుగుతాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th feb 2024 soul sustenance telugu

వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మనకు హాని చేయరు

వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మనల్ని బాధపెట్టాలని అనుకోరు. వారి స్వభావం మరియు అలవాట్ల ద్వారా వారు ఆ  ప్రవర్తన కలిగి ఉంటారు. కొన్నిసార్లు, ఇతరులు ద్రోహం చేయవచ్చు, అబద్ధం చెప్పవచ్చు, తిరస్కరించవచ్చు లేదా విస్మరించవచ్చు, అది

Read More »
23rd feb 2024 soul sustenance telugu

క్షమించే ప్రపంచాన్ని తయారు చేద్దాం (పార్ట్ 4)

సత్యత యొక్క శక్తి లేకుండా క్షమించే ప్రపంచం సృష్టించబడదు. శాంతి మరియు ప్రేమ మన భావోద్వేగాలను మార్చినప్పటికీ, బలమైన ఆత్మగౌరవం లేకుండా మనకు అన్యాయం చేసిన వ్యక్తిని మనం క్షమించలేము లేదా వారిపై కోపం

Read More »
22nd feb 2024 soul sustenance telugu

క్షమించే ప్రపంచాన్ని తయారు చేద్దాం (పార్ట్ 3)

కోపాగ్ని ఉన్న ఇంటిలో నీటి కుండలు కూడా ఎండిపోతాయని భారతదేశంలో ఒక సామెత ఉంది. కోపం మానవ స్పృహలో ఉన్న చాలా కోరికల యొక్క సేకరణ కారణంగా మనల్ని క్షమించనివ్వకుండా నిరోధించడానికి ఇవ్వబడిన పేరు.

Read More »