Hin

ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి

ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి

ఆరోగ్యంగా ఉండటం మనల్ని సంతోషంగా ఉంచుతుందని మనం నమ్ముతాము. సంతోషంగా ఉండటం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని వైద్య శాస్త్రంలో ఆధారాలు ఉన్నాయి. ప్రతి ఆలోచన మన శరీరంలోని కణాలపై ప్రభావం చూపుతుంది. తప్పుడు ఆలోచన శరీరంలో అనారోగ్యంగా మారుతుంది. శరీరాన్ని నయం చేయడానికి, మన ఎమోషన్స్ యొక్క అడ్డంకులను నయం చేయాలి. గతం యొక్క ఏ బాధలను మనం పట్టుకోకూడదు. మన భావాల ప్రభావం మన శరీర రోగనిరోధక వ్యవస్థ పై పడుతుంది. ఆనందం, సంతృప్తి లేదా ఉత్సాహం వంటి ఎమోషన్స్ శరీరానికి పాజిటివ్ సిగ్నల్స్ పంపి శరీర స్టామినాను పెంచుతుంది. చికాకు, భయం, విమర్శలు లేదా ఆందోళన వంటి నెగెటివ్ ఎమోషన్స్ శరీరాన్ని సున్నితంగా చేసి అనారోగ్యానికి గురిచేస్తాయి. పాజిటివ్ దృక్పథం పెంపొందించుకోవడం అనారోగ్యాన్ని నిరోధించకపోవచ్చు కానీ నొప్పిని తగ్గిస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు మనం నొప్పులు మరియు బాధలను బాగా ఎదుర్కొంటాము. విచారంగా ఉన్నప్పుడు ఆలస్యంగా నయం అవుతుంది. సంతోషం ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. మనం చురుకుగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, బాగా విశ్రాంతి తీసుకోవడానికి మరియు మంచి సామాజిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాము. మనం అసంతృప్తిగా ఉంటే ఈ అంశాలను విస్మరించినట్లు.

స్థూలమైన దానిపై మనసు యొక్క ప్రభావం నిరంతరం ఉంటుంది. తప్పుడు ఆలోచనలు వ్యాధిని సృష్టించగలవు మరియు సరైన ఆలోచనలు నయం చేయడంలో సహాయపడతాయి. నాకు బాగా లేదు… నాకు అధిక రక్తపోటు ఉంది… నా కుటుంబ చరిత్రలో మధుమేహం ఉంది, ఈ ఆలోచనలు వ్యాధిని పెంచుతాయి. ఇప్పటికే ఉన్న వ్యాధి గురించి పదేపదే ఆలోచిస్తే శరీరానికి అదే శక్తి అంది వ్యాధిని తీవ్రం చేస్తాయి. మీ శరీరాన్ని నయం చేయడానికి మీ ఆలోచనలు మరియు మాటల శక్తిని ఉపయోగించండి. మీ శరీరం సాధారణ స్థితికి రావడానికి సాధారణ స్థితి మరియు సంపూర్ణ ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచనలను చేయండి. మీ శరీరాన్ని నయం చేయడానికి మీ సరైన ఆలోచనలు మరియు శక్తివంతమైన పదాలతో – నా శరీరం పరిపూర్ణంగా మరియు ఆరోగ్యంగా ఉంది అని సంకల్పాన్ని చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »