మీ ఆత్మగౌరవం గెలుపు మరియు ఓటముపై ఆధారపడుతుందా? (పార్ట్ 1)

మీ ఆత్మగౌరవం గెలుపు మరియు ఓటముపై ఆధారపడుతుందా ? (పార్ట్ 1)

మనం ఒక రేసులో ఉన్నామని మరియు జీవితం అంటే ప్రతి క్షణం గెలవడమేనని మన నిత్యజీవితంలో తరచుగా వింటూ ఉంటాము. అలాగే, మన చదువులో గానీ, కెరీర్‌లో గానీ, రిలేషన్‌షిప్‌లో గానీ లేదా ఏదైనా క్రీడలో విజేతగా నిలవడం వంటి మరేదైనా భౌతిక స్థాయిలో మనం విజయం సాధించినప్పుడు చాలా సంతోషపడడం అలవాటు చేసుకున్నాము. మరోవైపు, జీవితంలోని ఈ అంశాలలో దేనిలోనైనా మనం విజయవంతం కానప్పుడు లేదా అంత బాగా రాణించనప్పుడు మనం  నిరుత్సాహానికి గురవుతాము. మన ఆత్మగౌరవం లేదా మనల్ని మనం చూసుకునే విధానం అనేది మన ప్రస్తుత జీవితంలో ఈ హెచ్చు తగ్గులపై ఆధారపడి పోయింది. ఇవి మన జీవితంలోని తాత్కాలిక అంశాలు అని మనం మరచిపోయి ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారో, వారి మనస్సులలో మమ్మల్ని ఎలా లేబుల్ చేశారో అలా మనల్ని మనం చూసుకోవడం ప్రారంభించాము.  కానీ మనం అలా చేయవలసిన అవసరం లేదు. పిల్లలను కూడా వారి చదువులలో లేదా వారి క్రీడలలో లేదా ఏదైనా ఇతర కార్యకలాపాలలో ఈ గెలుపు ఓటముల ఆధారంగా అంచనా వేయడం వలన మన పిల్లలు కూడా దీని వలన బాధపడుతున్నారు. మన జీవితంలో ఈ సమస్యను అధిగమించడానికి మూడు మార్గాలను అన్వేషిద్దాం – 

  1. గెలపు ఓటమిలు బాహ్యమైనవి  … నేను సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటే, నేను ఎల్లప్పుడూ గెలుస్తాను – మొట్టమొదటి మరియు ప్రధానమైన అంశం ఏమిటంటే, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ సిద్ధాంతంతో, మనము సమాజంలో లోతైన పోటీని ప్రవేశపెట్టాము మరియు జీవితాన్ని చాలా కష్టతరం చేసాము. మనమే, ఈ రేసు నుండి ఎలా బయటికి రావాలో తెలియక ఇప్పుడు మనం కూడా అదే బాధను అనుభవిస్తున్నాము. మన వ్యక్తిగత జీవితంలో అయినా, మన వృత్తిపరమైన జీవితాల్లో అయినా, లేదా మన పాఠశాల మరియు కళాశాల పెంపకంలో అయినా, మనం ఎక్కడ చూసినా, విజయం అనేది బాహ్యం అయిపోయింది. చాలా సందర్భాలలో, అందరూ  దీని కారణంగా ఆంతరికంగా  బాధపడుతున్నారు మరియు అంత సంతోషంగా లేరు. మనం ఆధ్యాత్మిక జీవులు లేదా ఆత్మలమని మనం మరచిపోయాము మరియు మన నిజమైన గెలుపు స్వచ్ఛంగా, పాజిటివ్ గా ఉండటం మరియు శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి వంటి మన అసలైన గుణాలతో నిండి ఉండడమే. అలాగే, మనం బాహ్యమైన  గెలుపు ఓటముల పై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు, మనం ఇకపై జీవితాన్ని ఆస్వాదించలేము.  మనం కేవలం గెలుపు కోసం వెతుకుతూ, వెంబడించడం  వలన ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా ప్రతిరోజూ మరింత శూన్యంలోకి వెళ్లిపోతాము. మనలో ఉన్న మంచి గుణాలు తగ్గుతూనే ఉంటాయి.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »