Hin

14th march soul sustenance telugu

బ్రహ్మకుమారీస్ సంస్థలో బోధించే జ్ఞానము ఎవరు ఇస్తున్నారు? (భాగం 2)

ప్రపంచంలో ఉన్న ఏ బ్రహ్మకుమారీస్ సేవాకేంద్రానికి వెళ్ళినా, ఎవరిని కలిసినా లేక ఏదైనా మరే సాధనం ద్వారానైనా మనం అక్కడి బోధనలు అర్థం చేసుకునే ప్రయత్నంలో మనకు సందేహాలు వస్తే ఏమి చేయాలి? సమాధానం చాలా సహజము. జ్ఞాన వివరణ తీసుకోవడంతో పాటు ఈ జ్ఞానం ఎవరు చెప్తున్నారు అన్న స్పష్టత తీసుకోవాలి. బ్రహ్మకుమారీస్  సంస్థలో బోధించే జ్ఞానాన్ని స్వయంగా పరమాత్మయే నేర్పిస్తారు, ఆ పరమాత్మ అనుభూతిని పొందడానికి ఉన్న ఏకైక మార్గం రాజయోగ మెడిటేషన్. ఒకసారి ఈ ఆత్మిక సంబంధాన్ని మెడిటేషన్ ద్వారా పరమాత్మతో ఏర్పరచుకున్నప్పుడు, ఈ జ్ఞానాన్ని బోధించేది పరమాత్మగానీ మానవాత్మ కాదు అని విశ్వసించగలుగుతాము.  ఎందుకంటే బ్రహ్మకుమారీస్  సంస్థలో చెప్పబడే జ్ఞాన అంశాలు కావచ్చు, మెడిటేషన్ కావచ్చు అన్నీ స్వయంగా పరమాత్మ నేర్పించినవే.

అలాగే మా సలహా ఏమిటంటే, మీకు సందేహాలు ఉన్నాగానీ మీరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి, రోజూ జ్ఞానాన్ని వినండి, మెడిటేషన్ చేయండి. ఎందుకంటే నేర్చుకుంటూ ఉంటూనే మనకు అనుభూతి అవుతంది, జ్ఞానానికి మూలాధారుడైన పరమాత్మను అనుభూతి చేసుకోగలుగుతాము. జ్ఞానాన్ని మరింత స్పష్టంగా అవగాహన చేసుకుని ఆ మూలాధారునిపై,  వారు చెప్పే జ్ఞానముపై సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది. అన్ని సందేహాలు తొలగి జ్ఞానంపై స్పష్టమైన అవగాహన వస్తుంది. ఒకసారి ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో విడిచిపెట్టకండి ఎందుకంటే ప్రయాణంలో ఉంటేనే మూలాధారునిపై, ప్రయాణంపై మరియు గమ్యంపై నమ్మకం ఏర్పడుతుంది. సందేహాలు తీరే వరకు ప్రయాణం మొదలుపెట్టకపోతే ప్రయాణంలోని లాభాలను మిస్ చేసుకుంటున్నట్లే. సందేహాలు ఉన్నా ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తుంటే లాభాలు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే మీకు ఆంతర్యం బోధపడింది, అనేక ఆధ్యాత్మిక అంశాల వాస్తవం బోధపడింది. కనుక, ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడమే మంచిది, మిగతా అంతా ఆ భగవంతుడికి విడిచిపెట్టండి. వారే మీకు మార్గదర్శన చేసి అనుభూతి చేయిస్తారు.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »