మనతో సరిగా లేని వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపడం

మనతో సరిగా లేని వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపడం

కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను మనం దాదాపు సహించలేము. వారు మన జీవితంలోకి వచ్చి వారి మాటలు మరియు ప్రవర్తనలతో గందరగోళాన్ని సృష్టించారని మనం భావిస్తాము. అలాంటి వ్యక్తులు మన సామర్థ్యాన్ని బయటకు వెలికితీస్తారు, మనం ఎదగడానికి మరియు శక్తివంతంగా ఉండటానికి సహాయపడతారు అని మనం గ్రహించడంలో విఫలం అవుతాము. మనతో సరిగా లేని వారికి కృతజ్ఞతలు తెలుపుదాం. మంచి వ్యక్తులు మీకు మంచి సమయాన్ని ఇస్తారని, కానీ తప్పుడు వ్యక్తులు మీకు మంచి పాఠాలు నేర్పిస్తారని మీరు నమ్ముతురా? మీతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి సంబంధించిన ఏ విషయాన్నీ మీరు ఇష్టపడకపోవచ్చు, కానీ మీరు ఆ అనుభవాలను పొందుతునప్పుడు మీరు ఎంత శక్తివంతంగా అయ్యారో మీకు తెలుసా? వారు అమర్యాదగా ఉండవచ్చు,  మనకు ద్రోహం చేసినా, మన విజయానికి అడ్డంకిని కలిగించినా, మనకు అబద్ధాలు చెప్పినా, మనకు హాని చేసినా అవి మన భాగ్యాన్ని మార్చే సాధనాలు. సమస్యను స్వతంత్రంగా ఎదుర్కోవడానికి, ఎలాంటి పరిస్థితినైనా అధిగమించడానికి మరియు శక్తివంతంగా ఉండటానికి అవి మనల్ని శక్తివంతం చేస్తాయి. వ్యక్తులు మనతో సరిగా లేనప్పుడు, వారి ప్రవర్తనపై ఆధారపడకుండా, కొత్త ఆలోచనా విధానాలతో,వారి పై ఆధారపడకుండా మనం స్వీకరించి సర్దుకుంటాము. మనం మన అహాన్ని తగ్గించుకొని,  మన మంచితనాన్ని పెంచుకొని  మరియు మన కర్మలను స్వచ్ఛంగా ఉంచుకోవడంలో జాగ్రత్త తీసుకుంటాము. శక్తివంతంగా మారడం ద్వారా, మన ఎమోషన్స్ వ్యక్తులపై ఆధారపడి ఉంటాయని మన గత నమ్మకాన్ని కూడా మార్చుకుంటాము. అటువంటి వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో, దయతో మరియు శాంతియుతంగా ఉండటం  ప్రాక్టీస్ చేయండి . ప్రతిరోజూ మీకు  మీరు గుర్తు చేసుకోండి – నేను తెలివైన వాడిని. ఇతరులు నాతో ఎలా ప్రవర్తించినా, నా జీవితంలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. నేను వారితో మంచిగా వ్యవహరిస్తాను. ఈ రోజు నేను శక్తివంతంగా మరియు వినయంగా ఉండటానికి నాకు శక్తిని ఇచ్చినందుకు నాతో  సరిగా లేని వ్యక్తులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మీరు శక్తివంతమైన జీవి అని క్రమం తప్పకుండా గుర్తు చేసుకోండి. మీ జీవిత ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ, అందులో వారి పాత్రకు ధన్యవాదాలు తెలపండి. కొన్నిసార్లు వ్యక్తులు మీతో సరిగా ఉండరు, అబద్ధాలు చెప్తారు , ద్రోహం చేస్తారు , నిర్లక్ష్యం చేస్తారు లేదా నిందిస్తారు. ఇది వారి పని, వారి ఎంపిక. మీరు మీ పట్ల జాగ్రత్తగా ఉండి , మీ విలువను మీరు గుర్తించి ఆత్మగౌరవంతో ఉండాలి. మీలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకొచ్చినందుకు మీరు వారి పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి. వారి ప్రవర్తన మీ సహనాన్ని, మీ ప్రశాంతతను, మీ గౌరవాన్ని, మీ స్థిరత్వాన్ని పెంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. మీ పట్ల మరియు వారి పట్ల కరుణను పెంచుకోండి. వారు స్వయంగా బాధలో ఉన్నారు కనుక వారు అలా ప్రవర్తిస్తున్నారు అందువలన వారు తప్పు చేయనందున వారిని క్షమించండి. మన గత కర్మల లెక్కల ప్రకారం వారు తమ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు వారు మీ గత కర్మలను వారితో సెటిల్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నారు. మీకు క్షణక్షణం అసౌకర్యంగా అనిపించినా, మీరు నేర్చుకోవలసిన పాఠాలు మరియు జ్ఞానాన్ని అందించడానికి వారు వచ్చారని గ్రహించండి. మీ కృతజ్ఞత వారిని ప్రభావితం చేస్తుంది, వారిని నయం చేస్తుంది. మీరు దాని నుండి శక్తివంతంగా బయటకు వచ్చారు, మీరు ఎమోషన్స్ ను  విడిచిపెట్టి, ముందుకు సాగండి , ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ  మీరు ఉత్తమంగా ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »