Hin

15th april soul sustenance telugu

నెగిటివ్ పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

2 – పాజిటివ్ మరియు శక్తివంతమైన మానసిక స్థితిని తయారుచేయడం – ఏదైనా నెగిటివ్ పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక సంకల్పాలు లేదా ఆంతరిక  శక్తి మరియు దృఢ సంకల్పంతో నిండిన ఆలోచనల సహాయంతో పాజిటివ్ మరియు శక్తివంతమైన మానసిక స్థితిని తయారుచేయడం. మీరు ఎదుర్కొంటున్న నెగిటివ్ పరిస్థితిని బట్టి మీ కోసం ఒక చిన్న సంకల్పాన్ని తీసుకొని  మీరు ఉదయం లేచిన తర్వాత, రోజులో ఏదైనా తినడానికి మరియు త్రాగడానికి ముందు, నిద్రపోయే ముందు ఒకసారి మనస్సులో ఆ సంకల్పాన్ని చెయ్యటం ఉత్తమ అభ్యాసం. సంకల్పాన్ని పూర్తి విశ్వాసం మరియు దృఢ నిశ్చయంతో సాధన చేయాలి. ఎలాంటి భావాలు లేకుండా కేవలం మనస్సులో రిపీట్ చేయకూడదు. అలాగే, మనం నిర్భయంగా, స్థిరంగా ఉండి, సర్వశక్తివంతుడైన, ప్రపంచంలోని ఏ పరిస్థితినైనా ఎలా పరిష్కరించాలో తెలిసిన జ్ఞాన సాగారుడైన,  భగవంతుని సహాయం తీసుకుంటే ఈ పరిస్థితి సులభంగా పరిష్కరించబడుతుందని మనం గుర్తు చేసుకోవాలి. మనం వారి సహవాసం మరియు శక్తిని అడుగడుగునా అనుభూతి చెందుతూ  వారి అభయ హస్తాన్ని గట్టిగా పట్టుకుని వారిపై పూర్తి నిశ్చయముతో ఉండాలి.

భగవంతుని శక్తిని గ్రహించడానికి, మెడిటేషన్ లో ఆయనతో కనెక్ట్ అవ్వడానికి సమయాన్ని వెచ్చించి ఆయనతో సంభాషణలు కూడా చేయండి. నెగిటివ్ పరిస్థితి గురించి మీ ఆలోచనలను అతనితో పంచుకొని వారి పాజిటివ్ వైబ్రేషన్స్ మరియు ముందడుగు వేయడానికి కావలసిన ప్రేరణలు పొందండి. చాలా కష్టంగా అనిపించే ఏదైనా పరిస్థితి,  విజయానికి దారి చీకటితో నిండినది గా అనిపిస్తే, మీరు మెడిటేషన్ లో భగవంతుడి నుండి తీసుకునే కాంతి మరియు భగవంతుడి దర్శనంతో సులభంగా దాటవచ్చు. 

చివరగా, మీరు నెగిటివ్ పరిస్థితులను దాటడానికి సంబంధించిన, భగవంతుడి నుండి విన్న మరియు నేర్చుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అంశాలను కూడా గుర్తుంచుకొని రివైజ్ చేసుకోండి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా మీ మనస్సును ఉల్లాసం మరియు సంతృప్తితో నింపండి. అలాగే, గతంలో మీరు భగవంతుడి సహాయం మరియు మద్దతుతో అధిగమించిన విభిన్న నెగిటివ్ పరిస్థితుల అనుభవాన్ని గుర్తుంచుకోండి. ఈ వెలుగు పాజిటివ్ పరిష్కారాలను సులభంగా మరియు వేగంగా ఆకర్షిస్తుంది. మన మనస్సులలో,  మన ఆలోచనలలో ఎటువంటి ఒత్తిడి లేకుండా పరిస్థితిని సులభంగా ఎదుర్కోవడానికి కూడా మనల్ని బలపరుస్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »