భగవంతుడు ఆశించిన భారతదేశాన్ని తయారుచేయటం (పార్ట్ 2)

భగవంతుడు ఆశించిన భారతదేశాన్ని తయారుచేయటం (పార్ట్ 2)

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక సందేశం – ఆగస్టు 15 (కొనసాగింపు)

  1. ప్రతి ఒక్కరికీ భగవంతుని జ్ఞానాన్ని అందజేద్దాం మరియు జ్ఞానం అంతర్గత బలాన్ని, స్థిరత్వాన్ని ఎలా పెంచుతుందో వారికి బోధిద్దాం – మన మానసిక బలం మరియు ఎమోషన్స్ యొక్క శక్తిని  పెంచడానికి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను భగవంతుడు మనకు బోధించారు. నేడు, స్వాతంత్ర్యం తర్వాత, జీవితంలోని ప్రతి రంగంలో ప్రతిఒక్కరికీ మెరుగైన సౌకర్యాల వంటి బాహ్య విజయాలలో మనం చాలా సాధించాము.  భారతదేశం ఆర్థికంగా , మెరుగైన వైద్య సదుపాయాలతో, అనేక రకాల వినోదాలు  మరియు క్రీడలలో విజయంతో మరింత మెరుగైంది. కానీ ఏమి జరిగిందంటే, ప్రజల జీవితాల్లో నెగిటివ్ పరిస్థితులు పెరిగాయి మరియు చాలా మంది ప్రజలకు తమ భవిష్యత్తు గురించి ఖచ్చితంగా తెలియదు. అటువంటి పరిస్థితులలో, వారితో భగవంతుని జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా, మనం ప్రతి ఒక్కరినీ శక్తివంతం చేసి వారి జీవితాల్లో భద్రతను తీసుకురాగలము, ఇది చాలా అవసరం.
  2. భారతదేశం దేవీ దేవతలకు ప్రసిద్ధి చెందిన దేశం. మన జీవితాల్లో దైవత్వాన్ని తీసుకువచ్చి వారిలాగా మారుదాం – మొత్తం భూమి అంతా  దేవీ దేవతల ఆలయాలతో ఉన్న దేశంలో మనము ఉంటున్నాము, వారిని భారతదేశం లోని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతిచోటా పూజిస్తారు. అలాగే, మన ప్రార్థనలలో వారిని చాలా స్తుతిస్తాము, వారు ఎలా ఉండేవారో అని పాటలు పాడతాము, వారు ఏమి చేసారో అని చదువుతాము మరియు వింటాము. భగవంతుడు భారతదేశంలో దివ్యతా భావం మరియు భక్తి ఉన్నందున భారతదేశాన్ని చాలా ప్రేమిస్తారు. కానీ మనం కూడా దేవీ దేవతల వలె దివ్యంగా మారి మన జీవితంలో స్వచ్ఛత మరియు దైవత్వాన్ని  సృష్టించినట్లయితే భగవంతుడు దానిని మరింత ఇష్టపడతారు. స్వచ్ఛమైన ఆహారపానీయాలు మరియు జీవనశైలి అలవాట్లు దేవతల జీవితంలో ఒక భాగం. వాటిని ధారణ చేసి సహజంగానే ఆధ్యాత్మిక రాయల్టీ ని మన జీవితంలో ఒక భాగంలా చేసుకొని భారత దేశం పట్ల ఉన్న ప్రేమ, చేసిన పాలనకు పరమాత్మ అనగా భగవంతునికి మనం  రిటర్న్ గా ఇవ్వాలి. వారే భారతదేశాన్ని చాలా అందంగా, దివ్యంగా మార్చారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒకప్పుడు ప్రపంచపు బంగారు పిచ్చుకగా ఉండేది, దానిని మళ్ళి ఆలా మార్చాలనుకుంటున్నారు.
  3. భారతదేశంలో ఆధ్యాత్మిక జాగృతపు తరంగాన్ని సృష్టిద్దాం – భారతదేశం ఆధ్యాత్మిక జాగృతపు తరంగాన్ని సృష్టించాలని భగవంతుడు చాలా ముఖ్యంగా భారత దేశం నుండి ఆశిస్తారు. ఈ తరంగం మొత్తం ప్రపంచాన్ని మేల్కొల్పాలి. విశ్వ ఆత్మలందరూ వెతుకుతున్న భగవంతుడిని తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరి కోరికలను నెరవేర్చాలి. భగవంతునితో ఎలా కనెక్ట్ అవ్వాలో మరియు వారసత్వంగా మొత్తం ప్రపంచ నాటకంలో శ్రేష్టమైన భాగ్యాన్ని  ఎలా పొందాలో అందరికీ నేర్పించాలి. ఇది భారతదేశాన్ని ప్రపంచమంతటికీ ఆధ్యాత్మిక లైట్ హౌస్ గా మారుస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »