15th feb soul sustenance telugu - brahma kumaris | official

చేతన మనసు యొక్క ప్రక్షాళన (భాగం 1)

మీ పాత అలవాట్ల నుండి పూర్తి స్వేచ్ఛ ఉన్న జీవితాన్ని గడపడం మిమ్మల్ని మానసికంగా బలంగా చేస్తుంది మరియు జీవితంలో అన్ని రకాల పరిస్థితులలో విజయాన్ని పొందడానికి అవసరమైన అన్ని శక్తులతో నింపుతుంది . కాబట్టి, రోజుకి ఒకసారి, రోజు చివరిలో, స్వయాన్ని చెక్ చేసుకోవడానికి సమయం ఇవ్వండి. మరుసటి రోజు కోసంమన స్వీయ మానసిక స్థితిని తిరిగి పొందడంలో మరియు తదనుగుణంగా వ్యవహరించడంలో మనకు సహాయపడుతుంది. పాత అలవాట్లు మన ఆలోచనా విధానాన్ని ఆధిపత్యం చేస్తాయి మరియు శాంతి మరియు సంతృప్తితో ఉండనివ్వవు. కాబట్టి, మీరు రోజును ప్రారంభించి, కర్మలు ప్రారంబించినపుడే, జీవితంలోని అన్ని రంగాలలో నేను సంతృప్తి చెందుతానని మీకు మీరు చెప్పుకోండి. నా నిజ స్వరూపమైన సంపూర్ణ పవిత్రత, శాంతి మరియు ఆనందంతో కూడిన స్థితిలో ఉంటూ నేను సంతృప్తిని పొందుతానని మీకు మీరు చెప్పుకోండి . మనస్సు యొక్క పవిత్రత ఉన్నచోట, శాంతి మరియు ఆనందం ఉంటుంది.
పవిత్రత అంటే మనసు యొక్క పూర్తి స్వచ్ఛతగా నిర్వచించవచ్చు. అంటే మనసులో కామం,క్రోధం, లోభం, మోహం మరియు అహంకారం అనే ఐదు శత్రువులు లేకపోవడం . ఈ ఐదు దుర్గుణాలు ఆత్మ యొక్క క్వాలిటీని తగ్గిస్తాయి మరియు గుణాలను క్షీణింప చేస్తాయి. స్వచ్ఛత అనేది ఒక నిర్దిష్ట దుర్గుణం లేకపోవడం మాత్రమే కాదు, ఆత్మ యొక్క సంపూర్ణమైన అర్ధాన్ని అర్ధం చేసుకొని గుణాలను నింపుకోవడం. కానీ, సంపూర్ణ పరిశుభ్రత అంటే అన్ని దుర్గుణాల నుండి పూర్తిగా విముక్తి పొందిన మనస్సు. ఉదా. పనిని పూర్తి చేయడానికి కోపాన్ని ఎక్కువగా ఉపయోగించడం దుర్గుణం కానీ ఆ పనిని పూర్తి చేయడానికి దృఢంగా ఉండటం దుర్గుణం కాదు. అలాగే, జీవితంలో పెద్ద విషయాలను దురాశతో సాధించడం దుర్గుణం. కానీ ఆ పెద్ద విషయాలను ఆశయంతో సాధించడం దుర్గుణం కాదు. మరొక ఉదాహరణ – మీ కుటుంబ సభ్యులను ప్రేమించడం దుర్గుణం కాదు, కానీ వారిపై మోహం ఉండటం, కొన్నిసార్లు దుఃఖాన్ని కలిగిస్తుంది. అలాగే, ఆత్మగౌరవంతో నిండి ఉండటం మరియు మీ విశేషతలు మరియు ప్రతిభ గురించి సంతోషంగా ఉండటం దుర్గుణం కాదు, కానీ వాటి గురించి అహంభావంతో ఉండటం, అలాగే వాటి గురించి గొప్పగా చెప్పుకోవడం దుర్గుణం. కాబట్టి, స్వచ్ఛత అంటే అన్ని దుర్గుణాల గురించి మరియు వాటి అన్ని విభిన్న ఛాయల గురించి తెలుసుకొని వాటి నుండి విముక్తి పొందడం.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

31st march soul sustenance telugu

31st March - జీవన విలువలు

ఇతర వ్యక్తుల స్క్రిప్ట్‌ను వ్రాయడం అనే నెగెటివ్ అలవాటు ఈ జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలు పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్‌ను వ్రాసి అమలు చేయమని కోరుతుంది. కానీ,

Read More »
30th march

30th March - జీవన విలువలు

సోషల్ మీడియాలో గాసిప్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి వ్యక్తుల ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను గురించి  నెగెటివ్ గా మాట్లాడకూడదని మనం ఆచరించినట్లే, ఇప్పుడు మనం

Read More »
29th march soul sustenance telugu

29th March - జీవన విలువలు

సంతుష్ట మణిగా ఉండటం (పార్ట్ 3) సంతృప్తి అనేది మీ ఆంతరిక సంపదలు మరియు విజయాలను పెంచడం ద్వారా వస్తుంది. మీ జీవితంలో మీకు నెగెటివ్ పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా, మీ మనస్సులోని పాజిటివిటీ మీకు

Read More »