Soul sustenance 15th january telugu

సరైన అలవాట్లను నిరంతరం అమలు చేయడం

మొదట మనం మన అలవాట్లను ఏర్పరుచుకుంటాము, ఆపై మన అలవాట్లు మనల్ని తయారు చేస్తాయని సామెత ఉంది . మనలో చాలా మంది గొప్ప అలవాట్లను చేసుకుంటారు కానీ అవి మన జీవితంలో పాతుకుపోయేవరకు వాటిని కొనసాగించడంలో మనం దృఢంగా లేము. ఏదైనా కార్యాచరణ లేదా అలవాటు చేసుకోవాలనుకున్నపుడు, మన ఆలోచనల నుండి ప్రారంభించి, అవి మన వ్యక్తిత్వంలో స్థిరమైన భాగం అయ్యే వరకు మనం ఆ పనులను చేస్తూ ఉండాలి . మీరు ఎప్పుడైనా ప్రయోజనకరమైన కొత్త అలవాటును చేసుకున్నారా, కానీ దానిని కొనసాగించడం కష్టంగా ఉందా? మీరు దానిని దృఢంగా పాటించలేకపోయినందున లేదా ఎవరైనా కట్టుబడి ఉండటం కష్టమని చెప్పినందున మీరు ఆ ఆరోగ్యకరమైన అలవాటును వదులుకున్నారా?అలా అయితే ఆ అలవాటును మీదిగా చేసుకోవడానికి మీకు మీరు కొంత సమయం ఇవ్వండి. ఏదైనా అలవాటు మన స్వభావంగా మారడానికి ముందు కొన్ని రోజులు ఆ అలవాటును అదే పనిగా రిపీట్ చేయడం అవసరం. గతంలో మనం ఒక అలవాటును కొనసాగించడంలో విఫలమైనా, లేదా ఆ అలవాటును కొనసాగించడం కష్టమని ఇతరులు భావించినా, మనం మాత్రం దానిని ఆచరిస్తూనే ఉండాలి. ఒక ఆరోగ్యకరమైన అలవాటును ఏర్పరచుకోవడంపై దృష్టి పెట్టండి, మీకు ఇది ఎందుకు అవసరమో అర్థం చేసుకొని మీ దినచర్య లేదా పరిస్థితిని లెక్కచేయకుండా వరుసగా 20 రోజుల పాటు దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజూ దానిని ఇప్పటికే మీ దినచర్యలో భాగం అయినట్లుగా ఒక విజువలైజేషన్ చేయండి. ఇది మీ జీవతంలో ఆ కొత్త అలవాటును సులభతరం చేస్తుంది. ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించడం వలన ఒక ప్రయోజనం ఉంటుంది. అదనంగా, ఇది సంకల్ప శక్తిని, ఆరోగ్యం మరియు ఆనందాన్ని పెంచుతుంది, మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు మీ పనిలో మీకు విజయాన్ని తెస్తుంది. మీ అలవాట్లతో స్థిరమైన దినచర్యను ఏర్పరచుకోవడం, స్వయం పై నియంత్రణను పెంచుతుంది.

సరైన ఆలోచనా విధానం, సరైన దృష్టి కోణం , విశ్వాసం , వ్యాయామం, మెడిటేషన్, ఆధ్యాత్మిక అధ్యయనం, ఆహారం, విశ్రాంతి, నిద్ర, పనిలో నైతికత, సామాజిక అలవాట్లు మొదలైనవి మీ వ్యక్తిగత వృద్ధికి తోడ్పడే మంచి అలవాట్లను పెంపొందించకునే క్రమశిక్షణను అలవర్చుకోండి. మీరు వాస్తవంగా ఎలా ఉండాలనుకుంటున్నారో దాని గురించి మాత్రమే నిరంతరం ఆలోచించండి. మీ ఆలోచనలు సరైన కర్మల చేయడానికి తోడ్పడతాయి. ఆ కర్మలన్నీ మీ వ్యక్తిత్వంలో భాగమవుతాయి. వాటి గురించి ఆలోచించడం మరియు వాటిని అమలులోకి తీసుకురావడం ద్వారా, మీ అలవాట్లు దృఢం అవుతాయి. వాటిని మీ దినచర్యకు జోడించండి, ఎందుకంటే అవే మీ ప్రాధాన్యత. అవి మీ రోజువారీ ప్రణాళికలో భాగం. మీరు ఏ కారణం చేతనైనా మీ సాధారణ కార్యాలను దాటవేసినప్పటికీ, మిమ్మల్ని మీరు విమర్శించుకోకండి మరియు ఆ కార్యాన్ని విడిచిపెట్టకండి . మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి, అలవాటును అమలు చేయడానికి తిరిగి ప్రయత్నించండి. మీరు చేయగలరని మీకు మీరే చెప్పుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లకు కట్టుబడి ఉండటం మీరు మీ కోసం చేయగలిగే అత్యంత సులభమైన పని.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

కృతజ్ఞతా డైరీ రాయడం

5th Jun – జీవన విలువలు

కృతజ్ఞతా డైరీ రాయడం మనందరం మన జీవితంలో చాలా విజయాలతో ఆశీర్వదించబడ్డాము. ఈ విజయాలను కలిగి ఉన్నందుకు మనం సంతోషంగా ఉన్నాము. విశ్వం మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులతో వారు మనల్ని ఆశీర్వదించినందుకు

Read More »
నిర్భయంగా మారడానికి 5 మార్గాలు

4th Jun – జీవన విలువలు

నిర్భయంగా మారడానికి 5 మార్గాలు ఆత్మగౌరవం యొక్క శక్తివంతమైన స్థితిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించడానికి మొదటి మరియు అతి ముఖ్యమైన మార్గం మన ఆత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. జ్ఞానం, గుణాలు,

Read More »
మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

3rd Jun – జీవన విలువలు

మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి జీవితంలో, మనం నియంత్రించగలిగేవి కొన్ని ఉంటాయి మరియు నియంత్రించలేనివి కొన్ని ఉంటాయి. అయినప్పటికీ, మన జీవితం ఎలా సాగాలి అనే దాని గురించి మనము అంచనాలను

Read More »