స్వయాన్ని తెలుసుకునేందుకు ఒక కార్-డ్రైవర్ యొక్క ఉదాహరణ (పార్ట్ 1)

స్వయాన్ని తెలుసుకునేందుకు ఒక కార్-డ్రైవర్ యొక్క ఉదాహరణ (పార్ట్ 1)

నా సత్య స్వరూపం అనగా నేను, ఆత్మను, భౌతికేతర శక్తిను,  ఈ భౌతిక శరీరానికి భిన్నమైన వాడిని అనే అవగాహనను బలోపేతం చేయడంలో సహాయపడే ఉదాహరణ డ్రైవర్ మరియు కారు.  ఇక్కడ డ్రైవర్ అనగా ఆధ్యాత్మిక శక్తి అనగా ఆత్మ మరియు కారు ఆధ్యాత్మిక శక్తిచే నియంత్రించబడే శరీరాన్ని సూచిస్తుంది.. నేడు నా వాహనం అయిన నా భౌతిక శరీరం, నా ఇంద్రియాల పై నాకు నియంత్రణ లేకపోవడానికి అతి పెద్ద కారణం వాహనాన్ని నియంత్రించగల మరియు పాలించే డ్రైవర్ అనే మనస్థితిని కోల్పోవడం. బదులుగా, నేనంటే ఈ వాహనం, ఈ భౌతిక శరీరం అనే భావనను  పెంచుకున్నాను. ఈ భావన వాహనాన్ని నియంత్రించడానికి నాలో ఉన్న సామర్థ్యం మరియు శక్తి నుండి నన్ను డిస్‌కనెక్ట్ చేసింది. నేను కోరుకున్న నియంత్రణను సాధించాలంటే, నేను డ్రైవర్ భావంతో  ఉండాలి, అంటే నేను ఆత్మ మరియు నా శరీరం ఒక వాహనం అనేది తెలిసి ఉండాలి. దాని ద్వారా నేను నిజమైన జీవితం యొక్క అనుభూతిని పొందుతాను. ఈ జ్ఞానంతో ఉన్న స్థితి నన్ను 

జాగృతపరుస్తుంది మరియు నా శరీరంపై అవసరమైన నియంత్రణను తిరిగి పొందేందుకు నాకు శక్తినిస్తుంది.

కారును నియంత్రణ చేసేందుకు గేర్లు, బ్రేక్, యాక్సిలరేటర్ మరియు స్టీరింగ్ వీల్ ఉంటాయి, వీటిని ఆత్మ యొక్క సూక్ష్మ ఇంద్రియాలైన మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలు మరియు శరీరం యొక్క కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు మరియు నాలుకతో పోల్చవచ్చు. వాహనాన్ని పూర్తిగా అదుపులో ఉంచేందుకు మరియు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, అత్యంత అప్రమత్తంగా ఉండి, గేర్లు, బ్రేక్, యాక్సిలరేటర్ మరియు స్టీరింగ్ వీల్‌లను సమర్థవంతంగా మరియు ప్రయోజనకరంగా ఉపయోగించగలవాడే మంచి డ్రైవర్. అదే విధంగా, నేను జీవితంలో ప్రయాణిస్తున్నపుడు పైన పేర్కొన్న నా సూక్ష్మ మరియు భౌతిక ఇంద్రియాలను నేను పూర్తి నియంత్రణలో ఉంచుకోవాలి. అప్పుడే నా ఇంద్రియాలు నా జీవిత ప్రయాణాన్ని సురక్షితం మరియు విజయవంతం చేస్తాయి, శాంతి మరియు ఆనందాన్ని అనుభూతి చెందేందుకు సహాయ పడతాయి. ఒకవేళ ఆలా ఉంచుకోకుండా, అవి నన్ను అధిగమించేలా ఉంటె అశాంతి మరియు దుఃఖం అనే ప్రమాదాలు ఖచ్చితంగా సంభవిస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »