మీ ఆత్మగౌరవం గెలుపు మరియు ఓటముపై ఆధారపడుతుందా? (పార్ట్ 2)

మీ ఆత్మగౌరవం గెలుపు మరియు ఓటముపై ఆధారపడుతుందా ? (పార్ట్ 2)

2. స్వయాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూడటం ప్రారంభిస్తే మిమల్ని మీరు ఎల్లప్పుడూ విజేతలుగా భావిస్తారు – ఆధ్యాత్మిక జ్ఞానం మనల్ని మనం ఆధ్యాత్మిక దృష్టి లేదా జ్ఞాన నేత్రాలతో చూడడం  నేర్పిస్తుంది. మన భౌతిక కళ్ళు మనకు మన భౌతిక వాస్తవాలైన శరీరాన్ని, దాని వయస్సు, లింగం, రూపాలు, బాహ్య వ్యక్తిత్వం, జాతీయత, సంబంధం, మతం, డిగ్రీ, పాత్ర, సంపద మొదలైన చూపుతాయి. మనల్ని మనం ఆధ్యాత్మిక జీవులుగా లేదా ఆత్మలుగా చూసుకోవడం  ప్రారంభించినప్పుడు మనకు మన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరియు మన జీవితంలో భగవంతుని  ప్రాముఖ్యతను అర్థం అవుతుంది. మన జీవితాన్ని బాహ్యంగా చూడడానికి బదులుగా, మనం లోతుగా వెళ్లి మనల్ని మనం బాగా అర్థం చేసుకుంటాము. జీవితానికి కొత్త అర్ధం ఏర్పడుతుంది.  మనం ఇతర ఆత్మల పాత్రలను మరియు జీవిత సంఘటనలను విభిన్నంగా చూడటం ప్రారంభిస్తాము.వాటి తాత్కాలిక స్వభావాన్ని గ్రహిస్తాము.మన ఆనందం కోసం వాటిపై ఆధారపడవలసిన అవసరం లేదని అర్థం చేసుకుంటాము. చివరగా, ప్రతిరోజూ భగవంతుని జ్ఞానాన్ని విని ధారణ చేయడం ద్వారా, మన విశ్వాసాలు భౌతికమైన గెలుపు ఓటముల కన్నా భగవంతునితో  సహా అందరి హృదయాలను గెలుచుకోవడం, మన బలహీనతలను వదిలివేయడం, అంతరిక పరిపక్వతతో భగవంతుడు మరియు ఇతరులచే ప్రేమించబడిన పరిపూర్ణ మానవులుగా మారడం అని అర్ధం అవుతుంది.

3. జీవితంలో ప్రతి చిన్న విజయం లేదా పాజిటివ్ చర్యకు స్వయాన్ని మరియు ఇతరులను గౌరవించండి – ఈ రోజు నుండి, మీ పిల్లలు లేదా మీ ఆఫీసు సహోద్యోగి లేదా మీకు ఇష్టమైన క్రీడా బృందం ఉత్తమంగా ప్రయత్నించినప్పుడల్లా, వారికి పాజిటివ్ పదాలు చెప్పండి మరియు వారి పట్ల పాజిటివ్ ఆలోచనలు మరియు భావాలను కలిగి ఉండండి. అలాగే, మీరు లేదా ఇతరులు చేసే ప్రతి చిన్న మంచి పని యొక్క ఫలితానికి  కాక ఆ పనికి  ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించండి. మీరు ఫలితాలను ఆలోచించకుండా మీ చర్యలను పాజిటివ్ గా చక్కగా నిర్వహించడం ద్వారా కొరకుండానే మీకు వాటి ఫలితాలు లభిస్తాయి అని ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతుంది. నిజ జీవితంలో దీన్ని వర్తింపజేయండి – ప్రతి చర్యను భగవంతుని స్మరణలో చేయండి మరియు దానిని చేసిన తర్వాత సంతోషంగా ఉండండి మరియు దాని ద్వారా ఇతరులకు ఆనందాన్ని ఇవ్వండి. మీ ఆత్మగౌరవం మరియు ఆనందాన్ని ప్రపంచం పెద్దగా నిర్వచించిన పెద్ద విజయాలపై మాత్రమే ఆధారపడేలా చేయకండి, ఎందుకంటే ఆ పెద్ద విజయాలు తాత్కాలికమైనవి మరియు అవి ఎల్లప్పుడూ మనతో ఉండవు. ప్రతి చర్యను దాని ఫలితంతో సంబంధం లేకుండా మనం ఎంతగా ఆస్వాదించడం ప్రారంభిస్తామో, మునుపెన్నడూ లేని విధంగా మనం విజయం సాధించిన అనుభూతిని పొందుతాము మరియు అదే శక్తిని మన ఇల్లు, కార్యాలయంలో మరియు సమాజంలో ఇతరులకు ప్రసారం చేస్తాము, ఇది అత్యవసరంగా ప్రతిచోటా అవసరం. లేకపోతే, మానవులు అతిగా పోటీ పడటం ద్వారా నెమ్మదిగా ఆధ్యాత్మిక మరణానికి గురవుతున్నారు మరియు తాము సంతోషంగా ఉండరు, లేదా ఇతరులకు ఆనందాన్ని ఇవ్వరు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »